కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
గుంటూరు రూరల్: సమీకృత విధానంలో వ్యవసాయం ద్వారా రైతుల సాధికారత దిశగా కృషిచేయాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం సూచించారు. గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమీకృత వ్యవసాయం ద్వారా రైతుల సాధికారతపై నిర్వహించిన రెండురోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. రెండోరోజు సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అజేయ కల్లం మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాతలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
అనంతరం రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి నేతృత్వంలో 11 విభాగాలపై చర్చలు జరిపి రైతుల అభివృద్ధికి తీర్మానాలు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్థన్‌రెడ్డి , డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ టి.జానకిరాం, మాజీ ఉపకులపతి డాక్టర్ రాఘవరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ త్రిమూర్తులు, అగ్రివిుషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కె.గురవారెడ్డి, రైతులు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment