సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 58,519 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 326 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,82,612కు చేరింది. నిన్న ఒక్క రోజు కోవిడ్ వల్ల ఏటువంటి మరణం సంభవించలేదు. మొత్తం 7108 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనాతో 7108 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 350 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తంగా 8,72,266 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 3,238 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 1,18,84,085 శాంపిల్స్‌ను పరీక్షించారు. చదవండి: కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment