Breadcrumb
Live Blog: గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం వైఎస్ జగన్ నివాళులు
Published Mon, Feb 21 2022 10:18 AM | Last Updated on Mon, Feb 21 2022 2:34 PM
Live Updates
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం
గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు
మంత్రి మేకాపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు చేశారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. రేపు (మంగళవారం) ఆయన భౌతిక కాయం తరలింపునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నుంచి రేపు ఉదయం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆయన భౌతికకాయాన్ని నెల్లూరు తరలిస్తారు.
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి సినీ నటుడు ఆలీ నివాళి
మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి సినీ నటుడు ఆలీ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
ఎయిర్ అంబులెన్స్‌లో నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం
మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయాన్ని రేపు ( మంగళవారం) ఉదయం ఎయిర్ అంబులెన్స్ ద్వారా నెల్లూరుకు తరలిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి టేకాఫ్ అయి, 10.15 గంటలకు నెల్లూరు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఉదయం 10.45 నెల్లూరులోని గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతిక కాయం చేరుతుందని తెలిపారు. అక్కడే ప్రజల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఉంచుతామని పేర్కొన్నారు. 23న అంతిమ సంస్కరాలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి మంత్రి పుష్ప శ్రీవాణి నివాళి
మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి ఎమ్మెల్యే రోజా నివాళి
మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఎమ్మెల్యే విడదల రజిని నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి సినీ నటుడు మోహన్‌బాబు నివాళి
మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి సినీ నటుడు మోహన్‌బాబు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి పవన్ కల్యాణ్ నివాళి
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి పవన్ కల్యాణ్, నాదేళ్ల మనోర్ నివాళులు అర్పించారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి అకాల మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ భవనంపై జాతీయ జెండా అవనతం
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణానికి సంతాప సూచకంగా అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంపై జాతీయ జెండాను అవనతం చేశారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ భవనంపై కూడా జాతీయ జెండాను అవనతం చేశారు.
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి మంత్రి బాలినేని నివాళి
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి దంపతులు నివాళులు అర్పించారు.
గొప్ప నేతను కోల్పోయాం
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఒక గొప్ప నేతను కోల్పోయామని అన్నారు. ఇప్పుడున్న పరిస్థతిని మాటల్లో చెప్పలేనని అన్నారు. గౌతమ్‌రెడ్డి సీఎం జగన్ ఆలోచన మేరకు అన్ని బాధ్యతలు చేపట్టారని గుర్తుచేసుకున్నారు. చక్కటి ప్రణాళికలతో ముందుకు వెళ్లేవారని అన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన స్పీచ్ ఇప్పటికి మర్చిపోలేమని అన్నారు.
సొంత అన్నను కోల్పోయినట్లు ఉంది
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందని అన్నారు. ఆయనకి ఎక్కడా కూడా వివాదాలు లేవని చెప్పారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో కొద్దీ రోజుల క్రితం పలు సమస్యలు గురించి చర్చించామని తెలిపారు. ఆయన అకాల మరణం పార్టికి, నెల్లూరు జిల్లాకు తీరని లోటు అని అన్నారు. రేపు (మంగళవారం) నెల్లూరులో పార్టీ నాయకులు చివరి చూపు చూడటానికి ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతామని చెప్పారు.
గౌతమ్‌రెడ్డి మరణం ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటు
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటు అని అన్నారు. రేపు(మంగళవారం) ఉదయం ఆయన భౌతిక కాయాన్ని నెల్లూరుకు తరలిస్తామని తెలిపారు. ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరవుతారని తెలిపారు.
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయనికి మంత్రి పేర్ని నాని నివాళి
మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయనికి మంత్రి పేర్ని నాని, కాంగ్రెస్ నేత జానా రెడ్డి నివాళులు అర్పించారు.
రేపు నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం
గౌతమ్‌రెడ్డి భౌతిక కాయాన్ని రేపు (మంగళవారం) నెల్లూరు తరలిస్తారు. అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి భారత్‌కు బయల్దేరారు. చెన్నై నుంచి అర్జున్‌రెడ్డి నెల్లూరు చేరుకుంటారు. ప్రభుత్వం లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం జగరనున్నాయి.
రెండు రోజులు సంతాప దినాలు
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
మేకపాటి గౌతమ్ రెడ్డికి ఘన నివాళి
గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. సీఎం జగన్‌ను చూసి గౌతమ్‌రెడ్డి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. ఆయన గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఓదార్చారు. సీఎం జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి.. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
హైదరాబాద్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు.
గౌతమ్‌రెడ్డి మరణం చాలా బాధాకరం: కేవీపీ
గౌతమ్‌రెడ్డి మృతి పట్ల కేవీపీ రామచంద్రరావు సంతాపం తెలిపారు. గౌతమ్‌రెడ్డి మరణం చాలా బాధాకరమన్నారు. గౌతమ్‌రెడ్డి ఉన్నత ఆశయాలు, విలువలు కలిగినవారన్నారు. ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాని కేవీపీ అన్నారు.
గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళ్లు
గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి నివాళుర్పించారు.
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ
తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘గౌతమ్‌రెడ్డి సంతాపసభ’ నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, పార్టీ నేతలు హాజరయ్యారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గౌతమ్‌రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది: కేటీఆర్
మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళుర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తనకు గౌతమ్‌రెడ్డి అత్యంత సన్నిహితుడన్నారు. 12 ఏళ్ల నుంచి గౌతమ్‌రెడ్డితో పరిచయం ఉందన్నారు. చిన్న వయస్సులో గౌతమ్‌రెడ్డి మరణం చాలా బాధాకరమన్నారు
మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని, వలభనేని వంశీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం.. హైదరాబాద్ బయల్దేరిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌కు బయల్దేరారు. నేరుగా గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళర్పించున్నారు.
కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌కు రానున్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మరణ వార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు.
Related News By Category
Related News By Tags
-
సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తనకు ఆతీ్మయుడైన మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత విషాదకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణ...
-
ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయం
అమరావతి: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం పట్ల మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. పద...
-
#HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం
Jagan Birthday Shakes Social Media: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం నేడు. అయితే.. ముందు నుంచే ఈ కోలాహలం నడిచింది. మొన్నా.. నిన్నంతా.. అడ్వాన్స్ హ...
-
పేరు తొలగించిన మాత్రాన..!
నెల్లూరు, సాక్షి: అధికారం చేపట్టిన వెంటనే.. కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఆపేయడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం.. ఆఖరికి గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేయడం పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. తాజాగా.. మేకపాటి ...
-
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ...
Comments
Please login to add a commentAdd a comment