
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తాజా షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంసెట్, సహా వివిధ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ముందు షెడ్యూళ్లు ఇచ్చినా కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి.
సెప్టెంబర్ మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించాలని, అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తాజా షెడ్యూల్‌ను రూపొందించింది. ఇలా ఉండగా, ఈ ఏడాది ఏపీ ఐసెట్‌ను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 64,822 మంది దరఖాస్తు చేసుకున్నారని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 45 పట్టణాల్లో నాలుగు సెషన్స్‌లో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment