Good News For APSRTC Passenger; APSRTC Plans To Buy 1489 New Buses - Sakshi
Sakshi News home page

AP: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కొత్తగా 1,489 ఆర్టీసీ బస్సులు

Published Sat, May 13 2023 7:48 AM | Last Updated on Sat, May 13 2023 9:39 AM

AP Government Plans To Purchase 1489 New Buses In APSRTC - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.  ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. కొత్తగా 1,489 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలు, అంతర్రాష్ట సర్వీసుల కోసం ఈ బస్సులను కొనుగోలు చేయనుంది. 

డీలర్ల వద్ద నుంచి కాకుండా నేరుగా బస్సుల తయా­రీ కంపెనీల నుంచే వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కో బస్‌ ఖరీదు దాదాపు రూ.45లక్షల చొప్పున మొత్తం రూ.670కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కాగా టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్‌ ప్రివ్యూకు ఆర్టీసీ నివేదించింది. టెండర్‌ డాక్యుమెంట్లను జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టెండరు నిబంధనలు, ఇతర అంశాలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈమెయిల్‌ ద్వారా తెలిపేందుకు ఈ నెల 19 సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఇచ్చారు. 

- టెండర్‌ పత్రాలు అందుబాటులో ఉంచిన జ్యుడిషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌  www.judicialpreview. ap.gov.in 
- టెండర్ల ప్రక్రియపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు ఈమెయిల్స్‌ పంపాల్సిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఈమెయిల్‌ ఐడీలు judge&jpp@ap.gov.in, apjudicialpreview@­gmail.com.

ఇది కూడా చదవండి: ఆదుకోవాలని వచ్చిన వారికి తక్షణ సాయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement