
సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి పేరును సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమిగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.
ప్రస్తుత తరుణంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు అకాడమి పేరులో ప్రాతినిధ్యం ఉండే విధంగా సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి పేరును సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమిగా మార్పు చేయాల్సిందిగా తాము కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెలువరించిందని సి.రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ మీడియా అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు.
పేరును మార్చి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సముచిత ప్రాధాన్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డికి, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ కి, సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డికి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment