
సాక్షి, అమరావతి: చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘ఇది భారత్‌కు అపురూపమైన విజయం. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు, నాతో సహా దేశంలోని ప్రతి పౌరుడు గర్వంగా ఫీలవుతున్నారు. ఇస్రో బృందానికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఈ అపురూపమైన ఫీట్‌ని శ్రీహరికోట నుంచే సాధించాం. ఇది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
జయహో భారత్. ఇస్రో అంచనాలు తప్పలేదు. యావత్ భారతం ఉత్కంఠంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. ఎవరూ చూడని.. అడుగు మోపని చంద్రుడి భూభాగంలో భారత్ తొలి అడుగు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది.
చదవండి: చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్
An incredible achievement for India!
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2023
On the Chandrayaan-3’s successful soft landing on the moon, I, along with every citizen of India is filled with pride!
My wishes and congratulations to everyone @isro.
That this incredible feat was achieved from Sriharikota in our very own… https://t.co/PYQXe8pwj7
Comments
Please login to add a commentAdd a comment