
సాక్షి, అమరావతి: పచ్చదనం పెంపులో ఆంధ్రప్రదేశ్.. భారతదేశంలోనే మొదటిస్థానంలో నిలవడంపై సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులను సీఎం అభినందించారు. భవిష్యత్‌లోను ఇదే కృషిని కొనసాగించాలని సూచించారు. సకాలంలో(జనవరి నెలలో) పదోన్నతి లభించిన సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి ఎన్.ప్రతీప్‌కుమార్ నేతృత్వంలో 1992, 1997, 2004, 2008, 2013 బ్యాచ్‌లకు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పచ్చదనం పెంపు కార్యక్రమాలను ముఖ్యమంత్రికి ప్రతీప్‌కుమార్ వివరించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి కేంద్రం విడుదల చేసే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్‌లో ఏపీ మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. రాష్ట్రంలో 647 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగినట్లు ఆ నివేదికలో వెల్లడించారని పేర్కొన్నారు. అలాగే ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్‌లో రాష్ట్ర పురోగతి గురించి కూడా సీఎంకు వివరించారు. ఐఎఫ్‌ఎస్ అధికారులకు సకాలంలో పదోన్నతులు కల్పించి ప్రోత్సహిస్తున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment