
సాక్షి, అమరావతి: నేడు 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి. కాగా, మొల్ల జయంతి సందర్భంగా ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.
కాగా, ఈరోజు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు వరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ మండేపూడి పురుషోత్తంలు పాల్గొని నివాళులు అర్పించారు. ఇక, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment