
అచ్చంపేట(పెదకూరపాడు): ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్, క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చిత్ర కళా పోటీల్లో అచ్చంపేటలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఆర్ట్స్ ఉపాధ్యాయుడు కంచర్ల శివనాగ ప్రసాద్ వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటం జ్యూరీ అవార్డుకు ఎంపికైంది.
కాగా పాఠశాల విద్యార్థులు వేసిన చిత్రాలకు బంగారు, రజిత పతకాలను సాధించగా, 15 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు వచ్చాయి. శివనాగప్రసాద్‌ను సోమవారం పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు. ప్రత్యేక జ్యూరీ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చేతులమీదుగా అందుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment