వైఎస్‌ జగన్‌: గురువులకు వందనం | YS Jagan Teachers' Day Greetings to All the Teachers Out There - Sakshi
Sakshi News home page

గురువులకు వందనం: సీఎం జగన్‌

Published Sat, Sep 5 2020 10:02 AM | Last Updated on Sat, Sep 5 2020 3:31 PM

CM YS Jagan Teachers Day Greeting - Sakshi

సాక్షి, అమరావతి: విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ విద్యా హక్కును అందించాలన్న తమ లక్ష్య సాధనలో ఉపాధ్యాయులే మార్గదర్శకులుగా తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా టీచర్లకు ఆయన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

భావి పౌరులకు విద్య, విజ్ఞానాన్ని అందించి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని సీఎం గుర్తు చేశారు. నైతిక విలువలే పునాదులుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేని అన్నారు. ‘గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. విద్య, వివేకం, విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు వందనం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.
(చదవండి: మన ఆచార్యుడు సర్వేపల్లి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement