సాక్షి, అమరావతి: నేడు(సెప్టెంబర్ 5) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు అని సీఎం జగన్ పేర్కొన్నారు. జ్ఞానాన్ని పంచి, నడత నేర్పించే పూజ్య గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
కాగా దేశానికి మొదటి ఉప రాష్ట్రపతి, రెండో రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ తత్వవేత్త, రాజనీతి శాస్త్రజ్ఞుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు.
చదవండి: తనికెళ్ల భరణికి ‘లోక్‌నాయక్’ పురస్కారం
తల్లితండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు. జ్ఞానాన్ని పంచి, నడత నేర్పించే పూజ్య గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు#TeachersDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2022
Comments
Please login to add a commentAdd a comment