CM YS Jagan Video Tweet On Physically Challenged Person Peddi Srinu, Details Inside - Sakshi
Sakshi News home page

పెద్ది శ్రీను కుటుంబంపై సీఎం జగన్ వీడియో ట్వీట్

Published Fri, Apr 14 2023 9:27 PM | Last Updated on Sat, Apr 15 2023 11:14 AM

CM YS Jagan Video Tweet On Physically Challenged Person - Sakshi

తాడేపల్లి : ఏలూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన పెద్ది శ్రీను కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో ట్వీట్‌ చేశారు. దివ్యాంగుడైన పెద్ది శ్రీనుకి  పెన్షన్‌తో పాటు అతని భార్య పేరు మీద భూపట్టా, వైఎస్సార్‌ చేయూత, అమ్మ ఒడి ఇచ్చి వారి జీవితంలో వెలుగులు నింపినందుకు సంతోషంగా ఉందని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఇటువంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.పెద్ది శ్రీను కుటుంబానికి మన ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచినందుకు గర్వపడుతున్నానని సీఎం జగన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement