welfare scheme
-
కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, గిరిజన ఉత్పత్తులు..ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్స్‌లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలన్నారు. నెలలు నిండిన గర్భిణిల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలిఅరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి ఎక్కడా కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. -
మనం చేసిన మంచి గడప గడపకు ఇంకా ఉంది
-
పేదల పథకాలు నిలిపివేత..కక్ష తీర్చుకున్న చంద్రబాబు
-
అట్టడుగు జనం అభివృద్ధి చెందేలా...
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పనులూ ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఫలితంగా అట్టడుగు జనం జీవన ప్రమాణాలు పెరుగుతూ పోతున్నాయి. అభివృద్ధికి నిజమైన నిర్వచనం ఇదే కదా! పారిశ్రామిక పార్కులు, పోర్టుల నిర్మాణం – అభివృద్ధి, విమానా శ్రయాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో ఏపీలో ఉద్యోగ కల్పన వేగం పుంజుకొంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాల్లో అధిక భాగం దక్కడం ఈ అభివృద్ధి నమూనా ప్రత్యే కతగా చెప్పుకోవాలి.ఏపీ ప్రభుత్వం నెలకొల్పిన పారిశ్రామిక పార్కుల ప్రాంతాల్లో ఒకప్పుడు బతుకు తెరువు కోసం పట్నాలకు వలస పోయే పరిస్థితి ఉండేది. మిగిలిన వారు పెత్తందారుల చుట్టూ పని కోసం తిరిగే వారు. ప్రస్తుతం ఆ యా ప్రాంతాల్లో పరి శ్రమలు రావడంతో పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.తిరుపతి జిల్లాలోని ‘శ్రీసిటీ పారిశ్రామిక పార్క్’ సమీపంలోని మల్లావారి పాలెం గ్రామస్థుడు సన్యాసయ్య చెప్పినట్లు ‘బడుగు జీవుల పొలాలకు మంచి ధరలు వచ్చాయి. ఇంటికో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎవరి ముందు తలవంచక ఆత్మ విశ్వాసంతో’ బతుకుతున్నారు.‘‘టెన్త్ మాత్రమే చదివిన నాకు ఎక్కడా పని దొరక లేదు. సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తూ... కాలం వృధా చేస్తున్న సమయంలో, సెల్ఫోన్లు తయారీ కంపెనీలో పని దొరికింది. ఇంటి నుండి కంపెనీకి వెళ్లి రావడానికి బస్‌సౌకర్యం, క్యాంటీన్, 24 గంటల హెల్త్ సెంటర్ ఉంది’– తిరుపతికి చెందిన మరో యువతి మనోగతం ఇది. వీరంతా ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాలకు చెందిన పేద మహిళలు.ఇక్కడ ఉద్యోగాలు చేసే వారిలో 90 శాతం మహిళలే. టెన్త్ నుండి ఇంజనీరింగ్ వరకు చదివిన వారే. ఈ అవకాశం తైవాన్ బహుళజాతి సెల్‌ఫోన్ తయారీ సంస్థ ‘ఫాక్స్‌కాన్’ ద్వారా మహిళలకు దొరికింది. తిరుపతి జిల్లా శ్రీసీటీలో ఈ కంపెనీ 30 ఎకరాల్లో ఏర్పాటయింది. ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు సరిహద్దుల్లో, నెల్లూరు జిల్లా తడ, తిరుపతి జిల్లా సత్యవేడు మధ్య ఏర్పాటయ్యింది శ్రీసిటీ పారిశ్రామిక పార్క్. 2006లో ఇక్కడ భూసేకరణ సమయంలో అనేక ఆందోళనలు జరిగాయి. అప్పటి దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులతో స్వయంగా సమావేశమై అప్పటి మార్కెట్ ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి 14 గ్రామాల్లో భూములు తీసుకున్నారు. ఇది 2008లో ప్రారంభమై 7,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. జాతీయ రహదారి, రైల్వే, విమానాశ్రయం, ఓడరేవు అన్నీ దగ్గరగా ఉండడం ఈ పారిశ్రామిక పార్కుకి బాగా కలిసొచ్చింది.ఇందులో ఇప్పటి వరకు 220 కంపెనీలు ఏర్పాటై 62 వేల మందికి ఉపాధి కలిగింది. వారిలో సగం మంది మహిళలే. గత 55 నెలల్లో, రాష్ట్రంలో 311కి పైగా ప్రధాన పరిశ్రమలు స్థాపించారు. 1.3 లక్షల ఉద్యోగావకా శాలు ఉన్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రూ. 13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 386 అవగాహనా ఒప్పందాలు జరిగాయి. దీనివల్ల మరో 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఏపీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. సీ పోర్టుల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆరు పోర్టులకు తోడు కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టి వాటిని అభివృద్ధి చేస్తోంది. దాదాపు రూ. 16,000 కోట్లతో రామా యపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టులను నిర్మిస్తున్నారు. కొత్త పోర్టుల వల్ల 110 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓడరేవుల ద్వారా 75 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు మత్స్యకారుల జీవనోపాధిని పెంచుతాయి. 3,793 కోట్ల వ్యయంతో పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ప్రతి 50 కిలోమీటర్ల తీరప్రాంతానికి ఓడరేవు లేదా ఫిషింగ్‌హార్బర్ ఉంటుంది. భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమా నాశ్రయం రూ. 4,592 కోట్ల ప్రాజెక్ట్. దీనివల్ల 10,000 మందికి ప్రత్యక్షంగా, 80,000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలుగబోతున్నాయి. గన్నవరం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాల విస్త రణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రామ్‌కో సిమెంట్, సెంచరీ ప్యానెల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్‌లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ, మెగా పరిశ్రమల నుండి భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈడీబీ) ఇండెక్స్‌లో వరుసగా మూడేళ్లుగా భారత్‌లో నంబర్‌వన్‌గా నిలవడం ఈ సందర్భంగా గమనార్హం.- వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్ మొబైల్: 94405 95858- శ్యాంమోహన్ -
మా పేదల కష్టాలు తీర్చిన ఏకైక నాయకుడు జగనన్న..!
-
మా పిల్లలు డాక్టర్ అయ్యే వరకు జగనన్నే సీఎంగా ఉండాలి
-
అప్పటికప్పుడే... 10.86 లక్షల సమస్యలకు పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తక్షణమే తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష క్యాంపుల్లో ఇప్పటివరకు 10.86 లక్షల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయి. వీటిని ప్రజల నుంచి వినతులు అందిన వెంటనే అప్పటికప్పుడే.. అక్కడికక్కడే పరిష్కరించారు. రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లో బుధవారం వరకు మొత్తం 10,86,727 వినతులను అప్పటికప్పుడే, అక్కడికక్కడే క్యాంపుల్లో అధికారులు పరిష్కరించారు. ప్రతి సంక్షేమ పథకం, ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల మంజూరు వంటివాటికి సంబంధించిన అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వలంటీర్ల ఆధ్వర్యంలో ఇంటింటా అర్హులను జల్లెడ పట్టి.. వారికి ఆయా సేవలను అందజేస్తోంది. సచివాలయాలవారీగా 31 వరకు నిర్వహణ.. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శనివారం (జూలై 1) నుంచి మొదలుపెట్టి ఈ నెల 31 వరకు ప్రభుత్వం క్యాంపులు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు.. 1వ తేదీన 1,305 సచివాలయాల వద్ద, 3న 387 సచివాలయాల వద్ద, 4న 1,022 సచివాలయాల వద్ద, 5 (బుధవారం)న మరో 625 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తయినట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 36.30 లక్షల కుటుంబాలు నివాసం ఉండే పరిధిలో మొత్తం 3,339 సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణ పూర్తయినట్టు తెలిపారు. ఈ సచివాలయాల పరిధిలో జరిగిన క్యాంపుల్లో వివిధ రకాల సమస్యలపై 13.10 లక్షల వినతులు అందాయి. ఇందులో 80 శాతానికి పైగా అంటే 10,86,727 వినతులను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించారు. వీటిలో హౌస్ హోల్డ్ లిస్టులో మార్పులుచేర్పులతోపాటు విద్యార్థులకు సంబంధించి ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల జారీ వంటివి ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటిదాకా జరిగిన క్యాంపుల్లో అందిన వినతుల్లో ఇంకా 2.22 లక్షలు పరిష్కరించాల్సి ఉందన్నారు. అవి కూడా ఆయా శాఖల అధికారుల పరిశీలనలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వర్గాలు తెలిపాయి. -
ఇలా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం కలిగింది: సీఎం జగన్
తాడేపల్లి : ఏలూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన పెద్ది శ్రీను కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో ట్వీట్ చేశారు. దివ్యాంగుడైన పెద్ది శ్రీనుకి పెన్షన్‌తో పాటు అతని భార్య పేరు మీద భూపట్టా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి ఇచ్చి వారి జీవితంలో వెలుగులు నింపినందుకు సంతోషంగా ఉందని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఇటువంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.పెద్ది శ్రీను కుటుంబానికి మన ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచినందుకు గర్వపడుతున్నానని సీఎం జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. పెద్ది శ్రీను కుటుంబానికి మన ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచినందుకు గర్వపడుతున్నాను. శ్రీనుకు దివ్యాంగ పెన్షన్ తో పాటు తన భార్య పేరుమీద భూపట్టా, వైయస్సార్ చేయూత, అమ్మఒడి ఇచ్చి వారి జీవితంలో, ఇటువంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. pic.twitter.com/fKRdeUV0Uf — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2023 -
వాట్సాప్‌లో సచివాలయాల సేవలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీరు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రజలకు పాలన ఎంతో చేరువైంది. ఇక మీదట ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి. వాట్సాప్‌లో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సూచించే మొబైల్ నెంబరుకు కేవలం ‘హాయ్’ అని మేసెజ్ చేస్తే చాలు.. సచివాలయంలో మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం ఇట్టే అందుతుంది. అలాగే, ‘నవరత్నాల’ పేరిట ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హులేనా.. లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారన్న సమాచారం కూడా తెలిసిపోతుంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తమ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్‌లో అవసరమైన మార్పులకు కసరత్తు చేస్తోంది. దీనికితోడు.. ఈ సేవల కోసమే ఒక మొబైల్ నంబరును కేటాయించి ఆ నంబరుకు ఎవరైనా కేవలం మెసేజ్ చేస్తే చాలు.. ఈ సేవలు పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ అకౌంట్‌ను ఇప్పటికే తెరిచినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఉదా.. ఎవరైనా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకుంటే.. సంబంధిత అధికారుల ఆమోదం అనంతరం ఆ సమాచారం వాట్సాప్ ద్వారా దరఖాస్తుదారుడి మొబైల్ నెంబరుకు ఇవ్వడంతోపాటు ఆయా ధ్రువీకరణ పత్రాలను కూడా మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని నెలన్నర రోజులుగా అమలుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సేవల్లో సువర్ణాధ్యాయం.. నాలుగేళ్ల క్రితం.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్నపని ఉన్నా మండల, జిల్లా ఆఫీసుల చుట్టూ నెలలు, ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చేది. అన్ని అర్హతలు ఉండి పింఛను లేదా రేషన్‌కార్డు లేదా మరోదాని కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుంటే.. అదెప్పుడు మంజూరవుతుందో తెలీని దుస్థితి. పైగా మంజూరు కాకపోతే ఎందుకు కాలేదో కూడా చెప్పే దిక్కుండదు. సరైన సమాచారమిచ్చే నాథుడేలేక దరఖాస్తుదారునికి చుక్కలు కనిపించేవి. కానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వలంటీరు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటవడంతో పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలందరికీ వారివారి సచివాలయంలోనే ప్రభుత్వ సేవలన్నీ అందుబాటులోకి వచ్చాయి. పింఛన్లు, రేషన్ల పంపిణీ వంటివి అయితే లబ్ధిదారుల గడప వద్దే అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా ఆ పథకం అర్హుల వివరాలతో పాటు, తిరస్కరణకు గురైన వారి వివరాలు, ఎందుకు తిరస్కరణకు గురయ్యాయన్న సమాచారాన్ని నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆ సమాచారమంతా వాట్సాప్‌లోనూ.. ఇక వాట్సాప్ ద్వారా కూడా గ్రామ, వార్డు సచివాలయాల సేవలు పూర్తిస్థాయిలో అమలుచేసే విధానం అమలులోకి వస్తే.. సచివాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచే సమాచారం కూడా ప్రజలు వాట్సాప్ ద్వారా తెలుసుకునే వీలు ఏర్పడుతుందని ఆ అధికారులు తెలిపారు. అదెలాగంటే.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సూచించే వాట్సాప్ నెంబరుకు కేవలం ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే చాలు.. ఆ సమయంలో పథకాల పేర్లు వాట్సాప్ మెసేజ్‌లో ప్రత్యక్షమవుతాయి. తాము తెలుసుకోదలిచిన పథకం ఎంపిక చేసుకుని ఎవరికి వారు తమ ఆధార్ నెంబరు నమోదుచేస్తే అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అనర్హులుగా పేర్కొంటే ఆ వివరాలు కూడా ఆ సమాచారంలో తెలుస్తాయి. దీనికితోడు.. పింఛను, రేషన్‌కార్డు వంటి వాటితో ఏవైనా ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే అది ఏ అధికారి పరిశీలనలో ఉందన్న సమాచారం ఆ దరఖాస్తుదారునికి వాట్సాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. -
ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. అక్టోబర్ 1 నుంచి అమలు
సాక్షి, తాడేపల్లి: ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేసి.. సంక్షేమ అమలులో తన చిత్తశుద్ధి చూపించుకుంది వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. తాజాగా ఏపీలో మరో భారీ సంక్షేమ పథకానికి కసరత్తులు పూర్తి చేసింది. మరో కీలక హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అమలు చేయనుంది. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తించనున్నాయి. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్ సర్కార్ అమలు చేయనుంది. అంతేకాదు.. ఈ పథకం కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు సాయం అందించనుంది. ఎస్సీలకు వైఎస్సార్ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు ఎస్టీలకు వైఎస్సార్ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు బీసీలకు వైఎస్సార్ కల్యాణమస్తు కింద రూ.50వేలు బీసీల కులాంతర వివాహాలకు రూ.75వేలు మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు. దివ్యాంగులు వివాహాలకు రూ. 1.5 లక్షలు భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40వేలు ఆర్థిక సాయం అందించనుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. బాబు హయాంలో.. ఆర్భాటం జాస్తి... అమలు నాస్తి దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దిన సీఎం వైఎస్ జగన్.. రాజకీయాల్లో అంకిత భావానికి, నిబద్ధతకు ప్రతిరూపంగా నిలిచారు. గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన సంక్షేమాన్ని.. ఇప్పుడు ఆచరణలో చూపిస్తున్నారు సీఎం జగన్. గత ప్రభుత్వంలోనూ ఇలాంటి పథకం ఉన్నా.. అది కేవలం కాగితాలకే పరిమితం అయ్యింది. పైగా అన్నివర్గాల లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున పెళ్లి కానుక లభించలేదు. ► 2017లో బీసీలను పథకంలో చేర్చిన నాటి చంద్రబాబు ప్రభుత్వం.. పెళ్లికానుక అందించలేదు. ► నాటి మార్గదర్శకాల్లోనూ సమగ్రత లేదు ► లబ్ధిదారులకు ఇవ్వాలన్న కోణంలో కాకుండా, ఎలా ఎగ్గొట్టాలన్న కోణంలో నియమాలు, నిబంధనలు కానీ.. అర్హులందరికీ వర్తించేలా పథకాన్ని తీర్చిదిద్దిన వైయస్.జగన్ సర్కార్. గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు. ఒక్కసారి పోల్చి చూస్తే.. ► ఎస్సీలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 40వేలు ► ఎస్సీల కులాంత వివాహాలకు జగన్ సర్కార్ సాయం రూ. 1.2 లక్షలు.. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది రూ.75వేలు ► ఎస్టీలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు కింద రూ. 1 లక్ష.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు ► ఎస్టీల కులాంతర వివాహాలకు జగన్ సర్కార్ సాయం రూ.1.2 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 75వేలు ► బీసీలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు కింద రూ. 50వేలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.35వేలు ► బీసీల కులాంతర వివాహాలకు జగన్ సర్కార్ సాయం రూ.75వేలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 50వేలు ► మైనార్టీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద రూ. 1 లక్ష.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు ► దివ్యాంగుల వివాహాలకు జగన్ ప్రభుత్వ సాయం రూ. 1.5 లక్షలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 1లక్ష మాత్రమే. అలాగే.. భవన నిర్మాణ కార్మికులకు జగన్ ప్రభుత్వం రూ.40వేలు ప్రకటిస్తే.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.20వేలే ప్రకటించింది. అన్ని అర్హతలను జీవోలో పొందుపరిచిన ఏపీ ప్రభుత్వం.. పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. వాటి ద్వారా పథకం నిర్వహణ చేపట్టనుంది. -
అధికారం అంటే ప్రజలపై మమకారం : సీఎం జగన్
-
రజకబంధు పథకం ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, కవాడిగూడ(హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం రజకబంధు పథకం ప్రకటించి ఒక్కో రజక కుటుంబానికి రూ.10లక్షలు అందించాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇందుకోసం ప్రధాని మోదీ జాతీయస్థాయిలో కమిటీని వేయాలని కోరారు. అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాకు ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రజకులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించడంతోపాటు వారికి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కోఠి మహిళా కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు ముగ్గు అనిల్, బీసీ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పాలన పక్కన పెట్టి కుట్రలు -
రేపే ‘జగనన్న చేదోడు’ పథకం ప్రారంభం
సాక్షి, అమరావతి : నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కరోనా కష్టకాలంలోనూ ప్రతీ కుటుంబానికి అండగా నిలబడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్(దర్జీ) అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’ పేరుతో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది. బుధవారం సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు జగనన్న పథకానికి రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి : సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ) ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు. షాపులున్న1,25,926 మంది టైలర్లకు రూ. 125,92,60, 82,347 మంది రజకులకు రూ. 82,34,70, 38,767 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 38,76,70 మొత్తం 2,47,040 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఈ లబ్దిదారులు వారి వృత్తికి అవసరమగు చేతి పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. -
ఇక అమ్మ ఫొటో కనిపించదా
ప్రభుత్వ పథకాల్లో అమ్మ జయలలిత బొమ్మ ఇక కనిపించేది అనుమానమే. అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు అన్నాడీఎంకే నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ఖాయం. సాక్షి, చెన్నై: తమిళుల అమ్మ జయలలిత. అన్నాడీఎంకే వర్గాలు తమ కన్న తల్లి కంటే ఎక్కువగా భావి స్తుంటారు. అమ్మ మీద అభిమానాన్ని ఎక్కువగానే చూపిస్తున్నారు. అన్నాడీఎంకే సర్కారు 2011లో అధికార పగ్గాలు చేపట్టినానంతరం అమ్మ పేరిట పథకాలు కోకొల్లలుగా తెర మీదకు వచ్చాయి. అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ సిమెంట్, ఇలా పథకాలు ఓ వైపు ఉంటే, మరో వైపు ఉచిత మిక్సీ, గ్రైండర్, ల్యాప్‌టాప్‌లు ఇలా ఉచితాల్లో అమ్మ బొమ్మ తప్పనిసరి. అమ్మ ఫొటో అన్నది లేని ప్రభుత్వ కార్యాలయాలు ఉండదు. ప్రతి మంత్రి ఛాంబర్లోని టేబుల్ మీద అమ్మ ఫొటో ఉండాల్సిందే. ఇది అమ్మ మీదున్న భక్తి. అయితే, ఇప్పుడు ఆ అమ్మ అనంతలోకాలకు చేరారు. అమ్మ ఉన్నప్పుడు భయం, భక్తి రెండు అన్నాడీఎంకే వర్గాల్లో మెండుగానే ఉండేది. ఇప్పుడు అది కరువైంది. అందుకే అన్నాడీఎంకే రెండుగా చీలింది. అధికారం కోసం రెండు శిబిరాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయినా, అమ్మ నినాదాన్నే రెండు శిబిరాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. అమ్మ ఆశయ సాధనే లక్ష్యం అని చాటుకుంటూ, ప్రజా మద్దతుకు తీవ్ర కుస్తీలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళతో పాటుగా ముగ్గురు దోషులుగా తేలింది. అలాగే, అమ్మ ఈ లోకంలో లేకున్నా, ఆమె కూడా దోషి అన్న వాదనను కోర్టు తెరమీదకు తెచ్చింది. చట్టాల మేరకు కేసులో దోషిగా తేలే వారికి ఇక గౌరవం అన్నది కరువే. ఈ దృష్ట్యా, అమ్మ బొమ్మ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక దర్శనం ఇచ్చేనా, పథకాల్లో అమ్మ ఫొటో , అమ్మ పేరుతో పథకాలు కొనసాగేనా అన్నది అనుమానంగా మారింది. అలాగే, అమ్మ జయలలితకు భారతరత్న దక్కేనా, పార్లమెంట్ ఆవరణలో విగ్రహం, తమిళ శాసన సభలో ఫొటో ప్రతిష్టించేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక, మెరీనా తీరంలోని జయలలిత సమాధి పరిసరాలను స్మారక కేంద్రంగా మార్చేందుకు కనీసం ప్రభుత్వం కూడా నిధులు వెచ్చించలేని పరిస్థితి ఈ తీర్పు తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. సీఎం పగ్గాల కోసం తీవ్ర కుస్తీలు పడుతున్న పన్నీరు శిబిరం, పళనిస్వామి శిబిరంలో ఎవరు అధికారంలోకి వచ్చినా, వారికి అమ్మ బొమ్మ ఏర్పాటు చిక్కుల్ని తెచ్చే పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, తమ అమ్మ మీదున్న భక్తిని చాటుకునేందుకు చట్ట నిబంధనల్ని ఉల్లంఘించేనా అన్నది వేచి చూడాల్సిందే. -
ఆ చివరి ఆశయానికి సముచిత గౌరవం
దివంగత హరీష్ పేరుతో సంక్షేమ పథకం రేపు ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ పథకం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తిగా నిలచిన హరీష్ చివరి కోరిక బెంగళూరు: రాష్ర్ట ప్రభుత్వం ఒక సాధారణ వ్యక్తి పేరుతో సంక్షేమ పథకం అమలు చేయడం మహా ఆరుదు. ప్రాణాలు పోతున్న చివరి క్షణంలో ఆ వ్యక్తి అసాధారణ తాపత్రయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన నేపథ్యం ఆయన పేరుతో సంక్షేమ పథకం తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కూడా తాను చనిపోయే చివరి క్షణంలో కూడా అవయవదానం చేయాలని భావించిన హరీష్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సముచిత గౌరవం ఇవ్వనుంది. ప్రభుత్వం రేపు (మంగళవారం) ఆయన పేరు మీదుగా ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఓ సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. నగరంలో ఇటీవల జరగిన రోడ్డు ప్రమాదంలో నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న హరీష్ చనిపోయిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆయన శరీరం రెండు భాగాలైంది. ఇక తాను బతకనని భావించి దగ్గరగా వచ్చిన వారితో ‘నా శరీరంలో ఏ అవయవం పనికి వస్తే ఆ అవయవాన్ని దానం చేయండి.’ అని అర్థించారు. విషయం తెలుసుకున్న వైద్యులు కుటుంబ సభ్యుల అనుమతితో ఆయన కళ్లు దానం చేశారు. ఆయన స్ఫూర్తితో స్వగ్రామమైన తుమకూరు జిల్లా, గుబ్బి తాలూకా కరెగౌడహళ్లి గ్రామ ప్రజలంతా తమ కళ్లను దానం చేయడానికి ముందుకు వ చ్చారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడిన ప్రజలకు సత్వర వైద్య సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి సాంత్వన యోజన’ పేరుతో నూతన పథకాన్ని అమలు చేయాలని గతంలో భావించింది. గత జనవరి నెలలో ప్రారంభం కావాల్సిన ఈ పథకం వివిధ కారణాల వాయిదా పడుతూ వస్తోంది. చివరికి రేపు ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హరీష్ తన చివరి క్షణంలో కూడా అవయవదానం చేయడానికి ముందుకు రావడమే కాకుండా ఎంతోమందికి ఈ విషయంలో ప్రేరణగా నిలిచారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి సాంత్వన యోజన పేరును ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ పేరుతో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి యూ.టీ ఖాదర్ ధ్రువీకరించారు. ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ ఇలా పనిచేస్తుంది ►రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిని వారు ఆసుపత్రిలో చేరిన మొదటి 48 గంటలు చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. గరిష్టంగా రూ.25 వేల వరకూ ఖర్చు పెడుతుంది. ►బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి నేరుగా ఈ పథకం ద్వారా నిధులు అందజేస్తారు. ► చిన్న గాయాలు మొదలుకుని మొత్తం 25 రకాల చికిత్సలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వారికి కూడా ఈ పథకం ద్వారా సాయం అందుతుంది. ►ఈ విషయంపై మరింత సమాచారం కోసం 108, లేదా 104లను సంప్రదించవచ్చు. -
రెండు పింఛన్ల కథ
అదనంగా తీసుకున్న డబ్బు వసూలు చేయడానికి పింఛన్ చెల్లించడం ఆపేయడం ఎంతవరకు సమంజసం? పింఛను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అంతకంటే ముందు అతనికి సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇది పీకేసిన పింఛను కథ. వృద్ధులైన పేదలకు పింఛను ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం మం చి సంక్షేమ పథకం రచించిం ది. అన్వర్ అలీకి పింఛను ఇవ్వడం ఆరంభించారు. కాని హఠాత్తుగా దాన్ని నిలిపివేశా రు. ఎందుకు? నిలిపివేసే ముందు ఎందుకు చెప్పలేదు? అనేది అన్వర్ అలీ ఆర్టీఐ సవాల్. అన్వర్ అలీ రెండుసార్లు విడిగా దరఖాస్తు పెట్టు కుని, రెండు బ్యాంక్ అకౌంట్లు చూపాడనీ, 70 సంవత్స రాలలోపు వారికి ఇచ్చే రూ.1000లు, 70 ఏళ్లకన్నా ఎక్కు వ వయసు ఉన్న వృద్ధులైన పేదలకు ఇచ్చే రూ.1500లు కూడా ప్రతినెలా తీసుకుంటున్నాడనీ, కనుక వెంటనే రెం డు పింఛన్లు నిలిపి వేయక తప్పలేదనీ జనకల్యాణ జిల్లా అధికార కార్యాలయం (సాంఘిక సంక్షేమశాఖ) ప్రజా సమాచార అధికారి సమాచార కమిషన్‌కు వివరించారు. ఇది వాస్తవం కాదని అన్వర్ అన్నప్పటికీ రసీదులు, ఇత ర పత్రాల ద్వారా రెండు పింఛన్లు పొందుతున్న సంగ తిని నిరూపించారు పీఐఓ. రెండు పింఛన్లు పొందడం నియమాలకు విరుద్ధం. దురుద్దేశం నిరూపిస్తే నేరంగా పరిగణించే అవకాశం కూడా ఉంది. నిజానికి పేదలందరికీ పింఛ ను హక్కు లేదు. పేదరికం ఆధారంగా పింఛను ఇవ్వవలసిన బాధ్యతను ప్రభుత్వం స్వీకరించడం వల్ల అతనికి పింఛ ను పొందే హక్కు ఏర్పడింది. ప్రభుత్వం ఒక పథకం రచించి, నియమాలు రూపొందించి నిధులు కేటాయి స్తేనే ఆ హక్కు, ఆ నియమాలకు లోబడి పింఛను ఇవ్వా ల్సిన బాధ్యత ఏర్పడ్డాయి. అన్వర్ అలీ అర్హుడనీ, అతడు పేదరికంలో ఉన్నాడనీ, పింఛను సాయంతో బతకగలు గుతున్నాడనీ ప్రభుత్వం భావించింది కనుకనే ఇస్తు న్నది. ఉన్నట్టుండి పింఛను ఆపడం అవసరమే అను కున్నా, ఆ పనిచేసే ముందు ఒక నోటీసు ఇవ్వడం, తన కేసు వివరించే అవకాశం ఇవ్వడం కనీస బాధ్యతలు. అవి అతని హక్కులు కూడా. వీటిని సహజ న్యాయని యమాలుగా ప్రపంచమంతటా పాటిస్తారు. ఈ సహజ న్యాయసూత్రాలు పాటించిన తరువాతనే తగినచర్య తీసుకునే అధికారం అధికారులకు వస్తుంది. పింఛనుదా రుకు అదనపు ఆదాయ వనరులు ఉన్నా, రెండో పిం ఛను అన్యాయంగా తీసుకున్నా, లేదా పింఛనుదారు మరణించినా పింఛను ఆపే అధికారం, బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నాయి. రెండో పింఛను ఆపడంతో పాటు, ఇన్నాళ్లూ అతను అన్యాయంగా తీసుకున్న రెండో పింఛను డబ్బును వసూలు చేయడం కూడా వారి బాధ్యతే. అయితే చట్టాలనూ, అధికారాలనూ మానవతా దృక్పథంతో ఉపయోగించవలసిన అవసరం ఉంది. ఇక్కడున్న సమస్యలు రెండు. చెప్పా పెట్టకుండా పిం ఛను నిలిపివేయడం ఒకటైతే, పింఛన్లు రెండూ నిలిపి వేయడం మరో సమస్య. ఒక పింఛను నిలిపివేయాల్సిం దే. సందేహం లేదు. అసలు ఏ పింఛనూ ఇవ్వకూడదని నిర్ణయించారు. అదనంగా చెల్లించిన డ బ్బు వసూలు చేయడం కోసం పింఛను చెల్లించడం ఆపేయడం ఎంత వరకు సమంజసం అన్నది ప్రశ్న. పింఛను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కాని అంతకంటే ముం దు అతనికి సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రతి ప్రభుత్వ అధికార సంస్థ ఎవరి హక్కుల ైనైనా తగ్గించే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అం దుకు కారణాలు తెలపాలని ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1) (డి) ఆదేశించింది. అది పాలనా పరమైన నిర్ణయమైనా, లేక ఇరుపక్షాల వాదన విని తీసుకునే నిర్ణయమైనా (అర్ధ న్యాయ నిర్ణయం) కారణాలు వివరించడం ముఖ్యమైన సమాచార హక్కు. తమంత తామే వివరించాల్సిన విష యాలు ఇవి. ఎవరో అడగనవసరం లేదని స.హ. చట్టం వివరిస్తున్నది. ఈ సెక్షన్‌ను అమలు చేసే అధికారాన్ని ఏ నియమంలోనూ పొందు పరచలేదు. అంటే ఈ నియ మం అమలు చేయడానికి వీల్లేదని అర్థం తీసుకోవడానికి వీల్లేదు. కాని ఎవైరనా స.హ. చట్టం కింద ఈ సమా చారం అడిగితే మాఅంతట మేమిచ్చే దాకా ఆగు, నీైకై నీవు అడగరాదు అని నిరాకరించడానికి కూడా వీలు కాదు. సొంతంగా ఇవ్వవలసిన సమాచారాన్ని అడిగినా ఇవ్వకపోతే ఆ సమాచార అధికారిని నిలదీసి, సెక్షన్ 20 కింద జరిమానా వేసే అధికారం సమాచార కమిషనర్‌కు ఉంది. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు బాకీ ఉన్న సంస్థ లకూ, సంపన్నులకూ రకరకాల రాయితీలు ఇస్తారు. అతని సంస్థ బతకడానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తారు. కాని కొన్ని వందల రూపాయలు మాత్రం అదనంగా తీసుకున్న వ్యక్తి నుంచి వెంటనే ఒక్కొక్క పైసా గోళ్లూడ గొట్టి వసూలు చేస్తారా? ప్రభుత్వానికి అప్పుపడిన ఉద్యోగి జీతాన్ని అటాచ్ చేసి అందులో కొంత ప్రతినెలా అతనికి కాకుండా అప్పిచ్చిన వాడికి చెల్లించాలని ఆదే శాలు జారీ చేస్తారు. అందులో కూడా మొత్తం వేతనం నిలిపివేయకూడదు. అతని కుటుంబం బతకడానికి కావ లసిన కనీస డబ్బు మిగిల్చి, తక్కిన జీతాన్ని మాత్రమే అటాచ్ చేయాలని న్యాయ నియమాలు ఉన్నాయి. తిన డానికి లేని వాడి పింఛను మొత్తంగా ఆపడం అన్యా యం. 20 శాతం పింఛను మాత్రం కోసి, దాన్ని పాత బాకీ కింద తీసుకుంటూ మిగిలిన పింఛను ఇవ్వడం న్యా యం అని కమిషన్ సూచించింది. ఎంతో కొంత పిం ఛను ఎప్పటి నుంచి ఇస్తారో వివరించాలని కమిషన్ పక్షాన ఆదేశం జారీ చేశాను. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) - మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
కేసీఆర్ పిట్టలదొర మాటలు మానాలి: ఎర్రబెల్లి
వరంగల్: సీఎం కేసీఆర్ పిట్టల దొర మాటలు మాని.. సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేయూలని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా తొర్రూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు బడ్జెట్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, రైతులు, కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. బడా సంస్థల ప్రయోజనాల కోసమే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. అందులో భాగంగానే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మకై చిన్నచిన్న ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అనేక హామీలు ఇచ్చి వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. ఇప్పటికైనా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం మానుకోవాలని ఆయన సూచించారు. -
'మైనారిటీల కోసం దుల్హన్'
హైదరాబాద్: మైనారిటీ యువతీ, యువకులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం చేయడానికి దుల్హన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మైనారిటీ యువతీ యువకులకు వివాహ సమయంలో రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేయనున్నట్టు మంత్రి చెప్పారు. ముస్లిం విద్యార్థులు, నిరుద్యోగుల కోసం రోషిని ప్యాకేజీ పథకాలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీలో భాగంగా తత్కాల్, సూక్ష్మరుణాలు, ఆదరణ, దుకాణ్ మకాన్ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మైనార్టీలంతా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. -
‘వసతి’లేని గృహాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ :నల్లగొండ పట్టణంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ముద్దన్నం, నీళ్లచారు అందుతున్నాయి. బీసీ హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు, పెట్టెలు అందలేదు. పట్టణంలోని బీసీ, ఎస్సీ హాస్టల్స్‌లో టాయిటెట్లకు తలుపులు లేవు. 1500మంది విద్యార్థులున్నా ఎస్సీ బాలుర హాస్టల్లో టాయిలెట్ల సమస్య ఉంది. తిప్పర్తిలోని బీసీ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు నేటి వరకూ నోట్‌బుక్స్, డ్రస్సులు, బెడ్షీట్లు ఇవ్వలేదు. అలాగే ఎస్టీ బాలికల, ఎస్టీ బాలుర వసతి గృహాల విద్యార్థులకు డ్రస్సులు ఇంతవరకు రాలేదు. బీసీ బాలుర వసతిగృహం అద్దె భవనంలో కొనసాగుతుంది. కనగల్‌లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు దుస్తులు సరఫరా కాక, చిరిగిన బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇన్చార్జి వార్డెన్ స్థానికంగా ఉండకపోవడంతో సమస్యలు తప్పడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి, వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లోని వసతి గృహాల్లో విద్యార్థుల కొరత తీవ్రంగా ఉంది. డివిజన్లో1400సీట్లు ఉండగా 600 మందికి మించి విద్యార్థులు లేరు. భువనగిరిలో ఎస్సీ బాలుర, ఎస్సీ కళాశాల వసతి గృహంలో మంచినీటి సౌకర్యం, వసతి సరిగా లేవు. బీబీనగర్, పోచంపల్లిలో బాలికల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పోచంపల్లి హాస్టల్ భవనం చుట్టూ ప్రహరీ లేక విద్యార్థులు రాత్రివేళల్లో భయాందోళనకు గురవుతున్నారు. బీబీనగర్ బాలుర హాస్టల్లోని మరుగుదొడ్లలో ట్యాప్‌లు పనిచేయకపోవడంతో విద్యార్థులు బయట స్నానాలు చేస్తున్నారు. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని షాబునగర్ ఎస్సీ బాలుర హాస్టల్ (ఆనంద నిలయం)లో మరుగుదొడ్లకు డోర్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు వస్తే ఎస్సీ(బీ) బాలికల హాస్టల్ గదుల్లోకి జల్లులు కొడుతున్నాయి. ఎస్టీ బాలికల హాస్టల్లో ఉదయం టిఫిన్ వేళలో వర్షంలోనే విద్యార్థులు క్యూలో నిల్చున్నారు. ఎస్సీ బాలికల వసతి గృహంలో బాత్రూములకు తలుపులేవు. ఈదులగూడలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో గదుల తలుపులకు చెక్కబల్లను అడ్డం పెట్టుకుంటున్నారు. దామరచర్ల మం డలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. బాత్రూములు లేక విద్యార్థులు ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. చౌటుప్పల్‌లోని ఎస్సీ బాలుర వసతిగృహంలో 60మంది విద్యార్థులకు 12మంది మాత్రమే ఉన్నారు. మెనూ అమలు కావడంలేదు. నేలపట్ల గ్రామంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండడంతో అందుబాటులో లేరు. నల్లగొండ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చండూరులోని ఎస్సీ హాస్టల్ అద్దెభవనంలో కొనసాగుతోంది. మర్రిగూడలోని ఎస్సీ హాస్టల్ మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. కోదాడ నియోజకవర్గంలోని 16 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అసౌకర్యాల మధ్య కునారిల్లుతున్నాయి. 16మంది వార్డెన్లూ కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. మోతెలోని బీసీ బాలుర వసతి గృహంలో 68 మంది విద్యార్థులకు గాను 12మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. గణపవరం, కాపుగల్లు హాస్టళ్లు విద్యార్థులు లేక సరిగా నడవడం లేదు. మునగాల ఎస్సీ బాలికల కోసం రూ.50 లక్షలతో నిర్మించిన పక్కా భవనానికి విద్యుత్ సౌకర్యం లేక నిరుపయోగంగా పడి ఉంది. నడిగూడెం మండలంలో బాలుర వసతిగృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని 22ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో 13 అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాలు ఉన్నచోట అవి శిథిలావస్థకు చేరాయి. తుంగతుర్తిలోని సంక్షేమ వసతి గృహాలకు మంచినీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహాల్లో 10చోట్ల ఇన్‌ఛార్జి వార్డెన్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వాచ్మన్లు, వంటమనుషులు లేక హాస్టల్స్‌కు భద్రత కరువైంది. పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో గత ఏడాది 90 మంది విద్యార్థులున్నా, వసతిగృహం తెరుచుకోకపోవడంతో విద్యార్థులు తిరిగి ఇంటికే పరిమితమయ్యారు. డిండి మండలంలోని ఎస్సీ హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దేవరకొండ పట్టణంలోని ఏ1, ఏ2 హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తుండడం, అవి కూడా పాతభవానాలు కావడంతో వర్షాలు కురిస్తే విద్యార్థులు ఉండే పరిస్థితి లేదు. కొండమల్లేపల్లిలోని ఏ3 హాస్టల్ కూడా అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్లో కూడా అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో పెట్టెలు, ప్లేట్లు ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. సూర్యాపేట నియోజకవర్గంలో పట్టణంలో 19, మండలాల పరిధిలో 17 హాస్టళ్లు ఉన్నాయి. పట్టణం లో 19 హాస్టళ్లకు గాను 17 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. పట్టణంలోని ఎస్సీ బాలుర-బీ హాస్టల్లో భవనంపై కప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. ఏ సమయంలో అవి కూలిపోతాయోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. జేజేనగర్ బాలికల కళాశాల హాస్టల్, హనుమాన్‌నగర్ ఎస్టీ బాలికల హాస్టల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులు బిగించకుండా వదిలేశారు. గిరి జన బాలికల హాస్టల్లో విద్యుత్‌వైర్లు తేలి ప్రమాదకరంగా మారాయి. నకిరేకల్ నియోజకవర్గంలో మొత్తం 15 ప్రభు త్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఐదింటికి మాత్రమే పక్కా భవనాలు నిర్మించారు. మిగతా 10 వసతిగృహాలు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. నాణ్యమైన బియ్యం సరఫరా కాకపోవడంతో భోజనం ము ద్దలు ముద్దలుగా ఉండడంతో విద్యార్థులు తినలేని పరిస్థితి ఉంది. కట్టంగూర్‌లోని ఎస్సీ హాస్టల్ అద్దె భవనం వర్షం వస్తే కురుస్తుంది. మరుగుదొడ్లు కూడా సరిపోవడం లేదు. చిట్యాలలోని ఎస్సీ హాస్టల్ ఇరుకు గదులలో కొనసాగుతుంది. నార్కట్‌పల్లి మండలంలో రెండు ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు సరిపోను స్నానాల గదులు, మరుగుదొడ్లు లేవు. రామన్నపేట మండలంలోని ఎస్సీ హాస్టల్లో వర్షం వస్తే జలమయమవుతుంది. కేతేపల్లిలోని ఎస్సీ హాస్టల్ పక్కా భవనం ఉన్నా మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గవ్యాప్తంగా 25 ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. గుర్రంపోడు మండలకేంద్రంలోని బీసీ హాస్టల్, పెద్దవూర మం డల కేంద్రంలోని ఎస్టీ స్పెషల్ హాస్టల్, ఎస్సీ హాస్టల్, త్రిపురారంలోని బీసీ బాలుర, ఎస్సీ బాలు ర, నిడమనూరు మండలంలో ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలు అద్దె భవనంలో నడుస్తున్నాయి. ఇక్కడ కనీస సదుపాయాలు లేవు. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెద్దవూర ఎస్టీ స్పెషల్ హాస్టల్లో కృష్ణావాటర్ వస్తేనే నీరు.. లేకుంటే స్నానాలు చేసేందుకు వాగును ఆశ్రయిస్తున్నారు. త్రిపురారం మండలంలో బీసీ, ఎస్సీ బాలు ర వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేవు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 15 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. హు జూర్‌నగర్‌లోని కొందరు వార్డెన్లు స్థానికంగా నివా సం ఉండకుండా అప్పుడప్పుడు హాస్టళ్లకు వచ్చి వెళుతున్నారు. హుజూర్‌నగర్‌లోని ఎస్సీ, ఎస్సీ ఏ-1, బీసీ బాలుర, నేరేడుచర్లలోని ఎస్సీ హాస్టళ్ల్లు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెనూ అమలుకావడం లేదు. అరటిపండు, కోడిగుడ్డు సరఫరాలో కోతలు పెడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. హుజూర్‌నగర్‌లోని ఎస్టీ బాలుర హాస్టల్లో ఉద యం టిఫిన్‌కు బదులు భోజనం వండి వడ్డిస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్.ఎం, గుండాల, రాజాపేట, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో సంక్షేమ హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి వసతి గృహంలో 10 మందికి మించి విద్యార్థులు ఉండడంలేదు. గుండాల మండలం సీతారాం పురంలో అద్దెభవనంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. -
తాగేందుకు నీళ్లు కరువే
తాగేందుకు నీళ్లు కరువే నిరుపయోగంగా మరుగుదొడ్లు మెనూలో మాయమవుతున్న గుడ్డు చలిని ఆపలేని పలుచటి దుప్పట్లు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేశాయి. వీటిపై సాక్షి దినపత్రికలో రెండు నెలల క్రితం సమరసాక్షి శీర్షికన వరుస కథనాలు ప్రచురించినా అధికారుల్లో చలనం లేదు. ఇప్పటికీ అనేక హాస్టళ్లలో కనీస సదుపాయాలు లేవు. చిన్నారులకు గుక్కెడు నీరు కరువవుతోంది. సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఎస్సీ 124, ఎస్టీ, 16, బీసీ 66, మైనారిటీలకు 2 హాస్టళ్లను సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడి సమస్యలు విద్యార్థులకు నరకం చూపుతున్నాయి. బాలికల హాస్టళ్ల వద్ద రా త్రిపూట రక్షణ ఉండడం లేదు. మం గళ, గురువారాల్లో గుడ్డు ఇవ్వాల్సి ఉంది. అయితే పలు హాస్టళ్లలో గుడ్డు మాయమవుతోంది. ప్రభుత్వం అం దజేసిన పల్చటి దుప్పట్లు చలిని ఆపలేకపోతున్నాయి. గదులకు కిటికీలు, తలుపులు బిగించకపోవడంతో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. దోమల దెబ్బతో చిన్నారులు జ్వరాల బారినపడుతున్నారు. -మదనపల్లె నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల హాస్టళ్లలో బిందెలు, గ్లాసులు లేవు. అన్నం తినేటప్పుడు గొంతు పట్టుకుంటే విద్యార్థులు పరుగున కొళాయి వద్దకు చేరుకుంటున్నారు. విద్యుత్ పోతే కనీసం కొవ్వొత్తులు వెలిగించే దిక్కులేదు. వార్డెన్లు హాస్టళ్ల ముఖం చూడడం లేదు. వాచ్మెన్, వంటోళ్లతో నడిపిస్తున్నారు. మదనపల్లెలోని ఎస్సీ హాస్టల్‌కు ములకలచెరువు వార్డెన్‌ను ఇన్చార్జిగా నియమించారు. ఇక్కడ పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వృద్ధ మహిళలను వాచ్మెన్లుగా పెట్టారు. బాలికలకు రక్షణ లేదు. దుప్పట్లు లేవు. పాచినీళ్లే తాగుతున్నారు. - చిత్తూరు ఎస్సీ బాలురు-1 హాస్టల్‌కు రెండు నెలల నుంచి ప్రహరీగోడ లేదు. పందులు, కుక్కలు లోపలకు వచ్చేస్తున్నాయి. బయటి వ్యక్తులు హాస్టల్ స్థలంలో గుడిసెలు వేసేందుకు యత్నిస్తున్నారు. ఎస్సీ హాస్టల్-2 వద్ద మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపడలేదు. విద్యార్థులు మల, మూత్రవిసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సిందే. గతంలో 300 మంది బాలురు ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30 మందికి పడిపోయింది. -జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు భవనాలు లేవు. పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లె, పెనుమూరు ఎస్సీ బాలుర హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. విద్యార్థులకు సరిపోయే సంఖ్యలో మరుగుదొడ్లు లేవు. - సత్యవేడులో బీసీ హాస్టల్ భవనం పరిస్థితి మెరుగుపడలేదు. అద్దెభవనంలో కిటికీలు, తలుపులు లేకుండానే కొనసాగుతోంది. ఇక్కడ ఆరుబయటే భోజనాలు తినాల్సి వస్తోంది. - పలమనేరు హాస్టళ్లలో పల్చటి దుప్పట్లు చలిని ఆపలేకపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఇదే పరిస్థితి. పారిశుద్ధ్య లోపంతో దోమలు విజృంభిస్తున్నాయి. కిటికీలు లేకపోవడంతో పిల్లలు వణికిపోతున్నారు. - తిరుపతిలోని బీసీ హాస్టల్లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. గదుల్లో లైట్లు లేవు. కొందరు పిల్లలు వంటగదుల్లో పడుకుంటున్నారు. మెనులో గుడ్డు ఇవ్వడం లేదు. ఎస్సీ హాస్టల్లో గదుల, మరుగుదొడ్ల తలుపులు పూర్తిగా విరిగిపోయాయి. సాయంత్రం 5 గంటలు దాటితే వార్డెన్ అందుబాటులో ఉండడం లేదు. ఎస్టీ బాలుర హాస్టల్లో మెనూ పూర్తిగా అమలు కావడం లేదు. - చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లకు నీటి సదుపాయం లేదు. దోమల కారణంగా విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. రామచంద్రాపురంలోని హాస్టల్లో రీడింగ్ రూం లేదు. దోమల బెడద అధికంగా ఉంది. చంద్రగిరి ఎస్సీ, బీసీ హాస్టళ్లలో మరుగుదొడ్లలో నీటి కొరతతో పారిశుద్ధ్యం లోపించింది. - ముఖ్యమంత్రి నియోజకవర్గం పీలేరులోని హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. పీలేరు ఎస్సీ బాలుర హాస్టల్లో నీటి సమస్య వేధిస్తోంది. చలికి పల్చటి దుప్పట్లే విద్యార్థులకు దిక్కవుతున్నాయి.