రెండు పింఛన్ల కథ
అదనంగా తీసుకున్న డబ్బు వసూలు చేయడానికి పింఛన్ చెల్లించడం ఆపేయడం ఎంతవరకు సమంజసం? పింఛను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అంతకంటే ముందు అతనికి సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా ఉంది.
ఇది పీకేసిన పింఛను కథ. వృద్ధులైన పేదలకు పింఛను ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం మం చి సంక్షేమ పథకం రచించిం ది. అన్వర్ అలీకి పింఛను ఇవ్వడం ఆరంభించారు. కాని హఠాత్తుగా దాన్ని నిలిపివేశా రు. ఎందుకు? నిలిపివేసే ముందు ఎందుకు చెప్పలేదు? అనేది అన్వర్ అలీ ఆర్టీఐ సవాల్. అన్వర్ అలీ రెండుసార్లు విడిగా దరఖాస్తు పెట్టు కుని, రెండు బ్యాంక్ అకౌంట్లు చూపాడనీ, 70 సంవత్స రాలలోపు వారికి ఇచ్చే రూ.1000లు, 70 ఏళ్లకన్నా ఎక్కు వ వయసు ఉన్న వృద్ధులైన పేదలకు ఇచ్చే రూ.1500లు కూడా ప్రతినెలా తీసుకుంటున్నాడనీ, కనుక వెంటనే రెం డు పింఛన్లు నిలిపి వేయక తప్పలేదనీ జనకల్యాణ జిల్లా అధికార కార్యాలయం (సాంఘిక సంక్షేమశాఖ) ప్రజా సమాచార అధికారి సమాచార కమిషన్‌కు వివరించారు. ఇది వాస్తవం కాదని అన్వర్ అన్నప్పటికీ రసీదులు, ఇత ర పత్రాల ద్వారా రెండు పింఛన్లు పొందుతున్న సంగ తిని నిరూపించారు పీఐఓ.
రెండు పింఛన్లు పొందడం నియమాలకు విరుద్ధం. దురుద్దేశం నిరూపిస్తే నేరంగా పరిగణించే అవకాశం కూడా ఉంది. నిజానికి పేదలందరికీ పింఛ ను హక్కు లేదు. పేదరికం ఆధారంగా పింఛను ఇవ్వవలసిన బాధ్యతను ప్రభుత్వం స్వీకరించడం వల్ల అతనికి పింఛ ను పొందే హక్కు ఏర్పడింది. ప్రభుత్వం ఒక పథకం రచించి, నియమాలు రూపొందించి నిధులు కేటాయి స్తేనే ఆ హక్కు, ఆ నియమాలకు లోబడి పింఛను ఇవ్వా ల్సిన బాధ్యత ఏర్పడ్డాయి. అన్వర్ అలీ అర్హుడనీ, అతడు పేదరికంలో ఉన్నాడనీ, పింఛను సాయంతో బతకగలు గుతున్నాడనీ ప్రభుత్వం భావించింది కనుకనే ఇస్తు న్నది.
ఉన్నట్టుండి పింఛను ఆపడం అవసరమే అను కున్నా, ఆ పనిచేసే ముందు ఒక నోటీసు ఇవ్వడం, తన కేసు వివరించే అవకాశం ఇవ్వడం కనీస బాధ్యతలు. అవి అతని హక్కులు కూడా. వీటిని సహజ న్యాయని యమాలుగా ప్రపంచమంతటా పాటిస్తారు. ఈ సహజ న్యాయసూత్రాలు పాటించిన తరువాతనే తగినచర్య తీసుకునే అధికారం అధికారులకు వస్తుంది. పింఛనుదా రుకు అదనపు ఆదాయ వనరులు ఉన్నా, రెండో పిం ఛను అన్యాయంగా తీసుకున్నా, లేదా పింఛనుదారు మరణించినా పింఛను ఆపే అధికారం, బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నాయి. రెండో పింఛను ఆపడంతో పాటు, ఇన్నాళ్లూ అతను అన్యాయంగా తీసుకున్న రెండో పింఛను డబ్బును వసూలు చేయడం కూడా వారి బాధ్యతే.
అయితే చట్టాలనూ, అధికారాలనూ మానవతా దృక్పథంతో ఉపయోగించవలసిన అవసరం ఉంది. ఇక్కడున్న సమస్యలు రెండు. చెప్పా పెట్టకుండా పిం ఛను నిలిపివేయడం ఒకటైతే, పింఛన్లు రెండూ నిలిపి వేయడం మరో సమస్య. ఒక పింఛను నిలిపివేయాల్సిం దే. సందేహం లేదు. అసలు ఏ పింఛనూ ఇవ్వకూడదని నిర్ణయించారు. అదనంగా చెల్లించిన డ బ్బు వసూలు చేయడం కోసం పింఛను చెల్లించడం ఆపేయడం ఎంత వరకు సమంజసం అన్నది ప్రశ్న. పింఛను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కాని అంతకంటే ముం దు అతనికి సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రతి ప్రభుత్వ అధికార సంస్థ ఎవరి హక్కుల ైనైనా తగ్గించే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అం దుకు కారణాలు తెలపాలని ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1) (డి) ఆదేశించింది. అది పాలనా పరమైన నిర్ణయమైనా, లేక ఇరుపక్షాల వాదన విని తీసుకునే నిర్ణయమైనా (అర్ధ న్యాయ నిర్ణయం) కారణాలు వివరించడం ముఖ్యమైన సమాచార హక్కు. తమంత తామే వివరించాల్సిన విష యాలు ఇవి.
ఎవరో అడగనవసరం లేదని స.హ. చట్టం వివరిస్తున్నది. ఈ సెక్షన్‌ను అమలు చేసే అధికారాన్ని ఏ నియమంలోనూ పొందు పరచలేదు. అంటే ఈ నియ మం అమలు చేయడానికి వీల్లేదని అర్థం తీసుకోవడానికి వీల్లేదు. కాని ఎవైరనా స.హ. చట్టం కింద ఈ సమా చారం అడిగితే మాఅంతట మేమిచ్చే దాకా ఆగు, నీైకై నీవు అడగరాదు అని నిరాకరించడానికి కూడా వీలు కాదు. సొంతంగా ఇవ్వవలసిన సమాచారాన్ని అడిగినా ఇవ్వకపోతే ఆ సమాచార అధికారిని నిలదీసి, సెక్షన్ 20 కింద జరిమానా వేసే అధికారం సమాచార కమిషనర్‌కు ఉంది.
ప్రభుత్వానికి కోట్ల రూపాయలు బాకీ ఉన్న సంస్థ లకూ, సంపన్నులకూ రకరకాల రాయితీలు ఇస్తారు. అతని సంస్థ బతకడానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తారు. కాని కొన్ని వందల రూపాయలు మాత్రం అదనంగా తీసుకున్న వ్యక్తి నుంచి వెంటనే ఒక్కొక్క పైసా గోళ్లూడ గొట్టి వసూలు చేస్తారా? ప్రభుత్వానికి అప్పుపడిన ఉద్యోగి జీతాన్ని అటాచ్ చేసి అందులో కొంత ప్రతినెలా అతనికి కాకుండా అప్పిచ్చిన వాడికి చెల్లించాలని ఆదే శాలు జారీ చేస్తారు. అందులో కూడా మొత్తం వేతనం నిలిపివేయకూడదు. అతని కుటుంబం బతకడానికి కావ లసిన కనీస డబ్బు మిగిల్చి, తక్కిన జీతాన్ని మాత్రమే అటాచ్ చేయాలని న్యాయ నియమాలు ఉన్నాయి. తిన డానికి లేని వాడి పింఛను మొత్తంగా ఆపడం అన్యా యం. 20 శాతం పింఛను మాత్రం కోసి, దాన్ని పాత బాకీ కింద తీసుకుంటూ మిగిలిన పింఛను ఇవ్వడం న్యా యం అని కమిషన్ సూచించింది. ఎంతో కొంత పిం ఛను ఎప్పటి నుంచి ఇస్తారో వివరించాలని కమిషన్ పక్షాన ఆదేశం జారీ చేశాను.
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
- మాడభూషి శ్రీధర్
professorsridhar@gmail.com