![Crowd of Devotees Increased in Tirumala](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/1223123.jpg.webp?itok=Pt2GcdRl)
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 27 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . అదివారం అర్ధరాత్రి వరకు 84,536మంది స్వామిని దర్శించుకున్నారు.25,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు.
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment