
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజకీయ కారణాలతో తమను ఉద్యోగాల నుంచి తొలగించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
కాగా, ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం ఉదయం విజయవాడలోని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్బంగా ఫీల్డ్ అసిస్టెంట్లను అక్రమంగా తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. ఇదే సమయంలో తొలగింపులు ఆపాలని ఫీల్డ్ అసిస్టెంట్స్ డిమాండ్ చేశారు. కాగా, రాజకీయ కారణాలతోనే తమను విధుల నుంచి తొలగిస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమతో రాజకీయం చేయవద్దన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment