Panchayati Raj Department
-
విజయవాడ పంచాయతీరాజ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజకీయ కారణాలతో తమను ఉద్యోగాల నుంచి తొలగించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.కాగా, ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం ఉదయం విజయవాడలోని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్బంగా ఫీల్డ్ అసిస్టెంట్లను అక్రమంగా తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. ఇదే సమయంలో తొలగింపులు ఆపాలని ఫీల్డ్ అసిస్టెంట్స్ డిమాండ్ చేశారు. కాగా, రాజకీయ కారణాలతోనే తమను విధుల నుంచి తొలగిస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమతో రాజకీయం చేయవద్దన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. -
Karimnagar: ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..! ‘పట్టుకోండి చూద్దాం’ పార్ట్–3
సాక్షి, కరీంనగర్: ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..! అన్న పాట.. ఇటీవల ఓ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ.. తనను ఎవరూ ఏమీ చేయలేరని వెక్కిరిస్తూ.. సదరు విలన్ అహంకారంతో పాడే సందర్భం అది. 34 ఏళ్ల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో అక్రమంగా కొలువు సాధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి కూడా ఇదే పాట పాడుతూ.. ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఇటీవల సదరు అధికారి బాగోతాలను బయటపెడుతూ ‘సాక్షి’ రాసిన కథనాలకు ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తనపై ఎన్ని విచారణలు వేసినా.. ‘తగ్గేదే లే..’ అంటున్న సదరు అక్రమార్కుడు ఉన్నతాధికారులపై ఎదురుదాడికి సిద్ధమవుతూ కీలక ఆధారాలు మాయం చేసే పనిలో ఉండటం పంచాయతీరాజ్ కార్యాలయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవరినీ లెక్క చేయకుండా సాగుతున్న అధికారి వ్యవహారం తాజాగా అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఎదురుదాడికి సిద్ధం..! ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. తనపై విచారణ వేశారని తెలియగానే.. ఉన్నతాధికారులు అడిగిన సమాచారాన్ని బాధ్యతగా అందజేస్తారు. కానీ, ఈ అధికారి మాత్రం విజిలెన్స్‌కు చేరిన ఫైల్‌ను తొక్కిపెట్టడంలో విజయవంతమవుతున్నాడన్న ప్రచారం అతడికి కార్యాలయంలో ఉన్న పట్టును తెలియజేస్తోంది. వాస్తవానికి సదరు అధికారి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. తండ్రి మరణించాడని కారుణ్య నియామక కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో సదరు అధికారి కొలువు సాధించాడు. పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్లో పలు హోదాల్లో పనిచేశాడు. ఇతడి నియామకం చట్ట విరుద్ధమంటూ తోటి ఉద్యోగులంతా గతంలోనే ఈఎన్సీకి ఫిర్యాదు చేశారు. అయినా తన తెలివితేటలతో విచారణను నిలిపివేయించుకున్నాడు. ఇటీవల ‘సాక్షి’ ఈ అధికారి లీలలను ‘పట్టుకోండి చూద్దాం’ అన్న శీర్షికన అతడి తల్లి ఫించన్ వివరాలు, ఆమెను ప్రభుత్వ ఉద్యోగి అంటూ ప్రస్తావించిన కోర్టు తీర్పు కాపీని ప్రచురించిన విషయం తెలిసిందే. అదే సమయంలో సదరు అధికారి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కోసం డిపొ్లమా (మెకానికల్), బీటెక్ (సివిల్) విద్యను ఎలా (రెగ్యులరా/ దూరవిద్య) చదివాడు? ఎవరు అనుమతించారు? ఏయే దినాల్లో సెలవుపెట్టాడు? అన్న పాయింట్లను లేవనెత్తింది. దీంతో ఆయా ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కరీంనగర్ పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ఇక్కడే సదరు అధికారి చక్రం తిప్పుడుతున్నారు. ఇప్పుడే సర్వీసు రికార్డుకు సంబంధించిన పలు కీలక ఫైళ్లు మాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘనుడు.. తాజాగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వవద్దని సదరు ఆదేశాలు అందుకున్న అధికారిని మేనేజ్ చేయడంలో సఫలీకృతుడు అయ్యాడన్న ప్రచారం మొదలైంది. ఈ విషయం పంచాయతీరాజ్ విభాగంలో దుమారం రేపుతోంది. చదవండి: ఐటీ దాడులు కొత్త కాదు.. అది తెలీకపోవడం విడ్డూరం: బండి సంజయ్ ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ.. అక్రమార్క అధికారికి మరో అధికారి తోడవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అవునా? కాదా?, అతడి సర్టిఫికెట్ల విషయంలో వాస్తవమెంత? అంటూ ఉన్నతాధికారులు సంధించిన ప్రశ్నలకు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమాచారం ఉన్నతాధికారులకు వెళ్తుందా? లేక సదరు అక్రమార్కుడే పైచేయి సాధిస్తాడా? అన్న విషయంపై నేడు స్పష్టతరానుంది. జెడ్పీలో అధికారి సస్పెన్షన్ ! జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న అధికారి కూడా నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలపై సస్పెండ్ కావడం కలకలం రేపుతోంది. విద్యార్హతలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాడని ఓ జూనియర్ అసిస్టెంట్‌కు అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇవే ఆరోపణలపై ఆయనకు కొంతకాలంగా ఇంక్రిమెంట్లలోనూ కోత విధించిన అధికారులు తాజాగా సస్పెండ్ చేయడం గమనార్హం. వేములవాడలో పనిచేసే సదరు అధికారిని ఇటీవల 317 జీవో అమలులో భాగంగా కరీంనగర్‌కు కేటాయించారు. ఇతడి సర్టిఫికెట్లపై విచారణ జరిపిన అధికారులు ఎట్టకేలకు అవి నకిలీవని తేలడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు. -
సమన్వయంతో ముందుకు..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని భూగర్భ గనులు, పంచాయతీరాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశా నిర్దేశం చేశారు. సోమవారం ఆయన భూగర్భ గనుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఆయన సూచించిన ముఖ్యాంశాలు.. ► రెవెన్యూ పెంచడానికి జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించాలి. ► గ్రావెల్ తవ్వకాల విషయంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ► రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలి. ► మైనింగ్ అధికారుల అనుమతి లేకుండా ఖనిజం ఎగుమతి కావడానికి వీల్లేదు. ► ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఆదాయం పెంపునకు పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. గనుల శాఖ ప్రతిష్ఠ పెంచేలా ► జిల్లా స్థాయి అధికారులు గనుల శాఖ ప్రతిష్ఠ పెంచేలా పనిచేయాలి. ► నిర్ణీత గడువు ఉండేలా జిల్లాల వారీగా మైనింగ్ యాక్షన్ ప్లాన్ íసిద్ధం చేయాలి. ► అవసరమైన సిబ్బందిని, వాహనాలను ఏర్పాటు చేస్తాం. ఆకస్మిక తనిఖీలు చేయాలి. చెక్పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలి. నాటే మొక్కకు రక్షణగా ట్రీగార్డు ఏర్పాటు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నాటిన మొక్కకు రక్షణగా ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉపాధి పథకం అమలుపై ఆయన ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ► మొక్కల పర్యవేక్షణను సచివాలయాల సిబ్బంది సహాయంతో జిల్లా డ్వామా పీడీలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ► గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, డైరెక్టర్ చినతాతయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిర్ణయాలివీ... ► అన్ని పోర్టుల్లో రాయల్టీ ఇన్స్పెక్టర్లను నియమించాలి. ► పొరుగు రాష్ట్రాల నిబంధనలను అధ్యయనం చేసి నివేదిక సిద్దం చేయాలి. ► ప్రభుత్వం ఇచ్చే ఇళ్లస్థలాలకు మొరం, గ్రావెల్ లెవలింగ్ విషయంలో అక్రమాలు జరగకుండా నిఘా వేయాలి. ► కోవిడ్ కారణంగా మొదటి త్రైమాసికంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో ఐరన్‌ఓర్, లెడ్, లైమ్‌స్టోన్‌లకు సంబంధించి 283 లీజులు పనిచేయడం లేదని అధికారులు వివరణ ఇచ్చారు. ► సుదీర్ఘంగా జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి, రాష్ట్ర, జిల్లా స్థాయి మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం
మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులకు బడ్జెట్లో పూర్తిస్థాయి నిధులు నీటి పారుదల శాఖ బడ్జెట్ సమీక్షలో మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: మార్చిలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 80 శాతానికి పైగా పూర్తయిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఆదిలాబాద్ జిల్లాలోని కొమరం భీమ్, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ వంటి మధ్యతరహా ప్రాజెక్టులకు అవసరమయ్యేంత నిధుల కేటాయింపునకు నిశ్చయించింది. బడ్జెట్ ప్రతిపాదనలపై నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సుదీర్ఘంగా సమీక్షించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సలహా దారు విద్యాసాగర్‌రావు, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖకు ప్రతిపాదిత రూ.25వేల కోట్లను.. ప్రాజెక్టులకు ఏ రీతిన కేటాయింపులు జరపాలన్న దానిపై చర్చించా రు. హరీశ్‌రావు మాట్లాడుతూ... 2016-17 ఖరీఫ్ నాటికి నీళ్లివ్వగలిగే ప్రాజెక్టులకు నిధులివ్వాలన్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్న మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించా రు. కొత్తగా చేపడుతున్న కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిడిహెట్టి, పెన్‌గంగ, సదర్‌మఠ్ ప్రాజెక్టులకు అవసరాల మేరకు వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్నారు. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించండి.. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాలని అధికారులకు హరీశ్ సూచించారు. ముఖ్యంగా ప్రాజెక్టుల పరిధిలోని క్యాంపు కాలనీల్లో ఖర్చు తగ్గిం చాలని, రోడ్లు, నీటి సరఫరా, ఇతర నిర్వహణలను పంచాయతీరాజ్ శాఖకు బదలాయించాలని సూచించారు. ఇప్పటికే నాగార్జునసాగర్ పరిధిలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఎస్సారెస్పీ, జూరాలలోనూ అమలు చేయాలన్నారు. పనిలేని ప్రాంతాల్లో ఉన్న అధికారులు, వాహనాలను కొత్త ప్రాజెక్టుల పరిధిలోకి బదలాయించాలని ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపం ఇవ్వడానికి తిరిగి ఈ నెల 20న సమావేశం కావాలని నిర్ణయించారు. -
టీడీపీ పంచాయతీలకు ఝలక్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జాతీయ ఉపాధి హామీ (ఎన్ఆర్ఈజీఎస్) పనులకు సంబంధించి పనులు జరగాలంటే పంచాయతీ తీర్మానాలవసరం. మండలపరిషత్‌కు వచ్చిన ఆయా తీర్మానాల్ని అక్కడి అధికారులు జిల్లా పరిషత్‌కు, తరువాత కలెక్టర్ కార్యాలయానికి పంపించిన తరువాత అన్ని రకాల ఆమోదం లభిస్తేనే పనులు ప్రారంభించాలి. కానీ రాజకీయ కక్షలతో టీడీపీ అధికారం చెలాయిస్తున్న పంచాయితీలకు ఎలాంటి తీర్మానాలు లేకుండానే రూ.11.6 కోట్ల విలువైన రోడ్డు పనులకు ఉపాధి హామీ పథకం పేరిట నిధులు మంజూరు చేయడం, ఇందుకు జిల్లా కలెక్టర్ సహా జెడ్పీ, ఎంపీడీవో సై అనడంతో పొందూరు ఎంపీపీ కోర్టుకెళ్లారు. విషయమే తమ వద్దకు రాలేనప్పుడు పనులకు నిధులెలా మం జూరు చేస్తారని, వైఎస్సార్సీపీ బాధ్యత వహిస్తున్న పంచాయతీల్ని కాదని ఇతర పంచాయితీల్లో అభివృద్ధి పనులెలా చేస్తారని కలెక్టర్ సహా పలు విభాగాల్లో ఫిర్యాదిచ్చినా ఫలితం లేకపోవడంతో ఎంపీపీ కోర్టుకెళ్లారు. పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఆయా పనులపై స్టే విధించినట్టు ఎంపీపీ ప్రతినిధి సువ్వాడ గాంధీ సాక్షికి స్పష్టం చేశారు.ఆది నుంచీ అంతే పొందూరు మండల పరిధిలో 29గ్రామ పంచాయితీలున్నాయి. అందులో 14 మాత్రమే టీడీపీకి దక్కాయి. మెజార్టీ పంచాయతీలు వైఎస్సార్సీపీకి దక్కడంతో అక్కడి ఎంపీపీ పదవి సువ్వారి దివ్యను వరించింది. రాజకీయ కక్షతో ప్రభుత్వ అండదండలు చూసుకుని అక్కడి టీడీపీ నేతలు ఆదినుంచీ వైఎస్సార్సీపీకి అడ్డు తగులుతూ వస్తున్నారనే అభియోగాలున్నాయి. అభివృద్ధి పనుల విషయంలో తాము చెప్పిందే వేదం అంటూ స్థానిక అధికారులపైనా ఒత్తిడి తెస్తున్నారు. అక్కడి ఎంపీడీవో కూడా టీడీపీ నాయకుల వైపే మొగ్గుచూపుతున్నారన్న విమర్శ ఉంది. వీటిపైనా కోర్టు స్పందించింది. అక్కడి అభివృద్ధి పనులకు ఎంపీపీ ముందుకు వెళ్తున్నా ఏవో కారణాలు చూపుతూ స్థానిక టీడీపీ నాయకులు, ప్రభుత్వ విప్ అడ్డుకున్న సందర్భాలూ ఉన్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సహాయంతో ఎన్నో పనుల్ని అడ్డుకుంటున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. జెడ్పీ తీర్మానం సరిపోతుందా? గతేడాది డిసెంబర్ 29న జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మండల పరిషత్ తీర్మానాల్లేకుండానే 584 జెడ్పీ తీర్మానం మేరకు రూ.7.37 కోట్లుతో 42 పనులకు, 627 తీర్మానం మేరకు రూ.3.69 కోట్లు విలువైన 30 పనులకు అంగీకారం తెలిపినట్టు జెడ్పీ సీఈవో సైతం నోట్ జారీ చేసేశారు. ఇదే విషయమై పొందూరు ఎంపీపీ అప్పట్లోనే జెడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్లకు లిఖితపూర్వవక ఫిర్యాదిచ్చినా స్పందన లేదు. సెక్షన్ 4-(5) ప్రకారం ఎలాంటి తీర్మానాలూ లేకుండానే వ్యక్తిగత హోదాతోనే అధికారులు నిధుల మంజూరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని, గ్రామ పంచాయతీలుగానీ, ఎంపీడీవో కార్యాలయ పరిధిలో పనులకు సంబంధించి కూడా ఎజెండా రూపకల్పన జరగలేదని స్పష్టం చేసినా సంబంధిత అధికారుల్లో చలనం రాలేదు. నిధుల మంజూరీకి సంబంధించి జనవరి 11, 2016లో టీడీపీ సర్పంచ్లున్నచోటే పనులకు అంగీకరిస్తూ జిల్లా యంత్రాంగం ఆమోదం తెలపడాన్ని ప్రతిపక్ష ైవె ఎస్సార్సీపీ సభ్యులూ ఖండించారు. ప్రభుత్వం (2917-ఈజీఎస్-టీ-పీఈ3)పేరిట సెప్టెంబర్ 13, 2014లోనే సర్క్యులర్ జారీ చేసినా జిల్లా యంత్రాంగం నుంచి మాత్రం జనవరిలో అన్ని రకాల తీర్మానాలకూ సంతకాలు చేసేయడం గమనార్హం. దీంతో పంచాయితీ రాజ్ కమిషనర్‌కూ ఇక్కడ జరుగుతున్న తంతును పొందూరు ఎంపీపీ ఈనెల 2న ఫిర్యాదిచ్చారు. చట్ట ప్రకారం అన్ని పంచాయతీలకూ ఒకేలా అభివృద్ధి పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. దీంతో కోర్టునాశ్రయించాల్సివచ్చిందని బాధితులు చెబుతున్నారు. స్టే వచ్చింది రాష్ట్ర సర్వోన్నత న్యాయంస్థానం ఇక్కడి 14 టీడీపీ పంచాయతీలకు నిధులు పంపిణీ చేయొద్దంటూ స్టే విధించింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ప్రోద్భలంతోనే ఎంపీడీవో సహా అధికారులంతా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్తు తెస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. పంచాయితీల్లో ఎలాంటి తీర్మానాలు లేకుండా చాలా ఏళ్లు పనులు జరిపించేసి ఏళ్ల క్రితం భారీగా సొమ్ముకాజేసిన వైనాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తాం. సువ్వారి గాంధీ, పొందూరు ఎంపీపీ ప్రతినిధి.