Accident Updates..
👉 విశాఖ రైల్వే ప్రమాదంపై విచారణకు ఆదేశం..
- రైల్వే ప్రమాదంపై విచారణకు ఆదేశించిన డీఆర్ఎం.
- ప్రమాద ఘటనపై రంగంలోకి దిగిన క్లూస్ టీమ్.
- ప్రమాద వివరాలు సేకరిస్తున్న అధికారులు.
👉 రైలు ప్రమాదంపై విశాఖ సీపీ శంఖబ్రత కామెంట్స్
- రైలు అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది.
- ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు ఎఫెక్ట్ అయ్యాయి
- ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం, గాయాలు లేవు
- ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకున్నారు
- మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు
- విచారణ జరుగుతున్న క్రమంలో నేనేమీ మాట్లాడకూడదు.
- దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాం.
👉విశాఖ రైల్వే స్టేషన్‌కు రైళ్ల రాకపోకల్లో ఆలస్యం.
👉ఆలస్యంగా నడుస్తున్న విశాఖ వచ్చే రైళ్లు.
👉ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు.
👉ఈరోజు విశాఖ నుంచి బయలుదేరాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్‌పై స్పష్టత ఇవ్వని అధికారులు.
👉ఆందోళనలో ప్రయాణికులు.
👉ఈ సందర్బంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. కోర్బా ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నెంబర్-4పై ఉన్న సమయంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వెంటనే నాలుగు ఫైర్ టెండర్స్ ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగను కూడా అదుపులోకి తెస్తున్నారు. మంటల్లో నాలుగు బోగీలు కాలిపోయాయి. పూర్తిగా నాలుగు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి.
👉బీ6, బీ7, ఎం1 బోగీల్లో మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు ఆగిఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఉన్నప్పటికీ వెంటనే వారిని బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేస్తున్నాము. ఇతర రైళ్ల కోసం ట్రాక్‌పై బోగీలను వేరు చేయడం జరుగుతోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాసేపట్లో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.
👉కాగా, విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్‌ప్రెస్(కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్)లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రైల్వే, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు.
👉వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో విశాఖ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్టు ప్రయాణీకులు చెబుతున్నారు. మంటల్లో పలు బోగీలు తగలబడుతున్నాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. స్టేషన్‌లో ఉన్న ప్రయాణీకులను బయటకు పంపిస్తున్నారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటన ఘటనా స్థలానికి అగ్ని మాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. కాగా, ఆదివారం ఉదయం కోర్బా నుంచి రైలు విశాఖపట్నం చేరుకుంది. మరికాసేపట్లో విశాఖ నుంచి తిరుపతికి ఇదే రైలు బయలుదేరాల్సి ఉంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment