visakhapatnam Railway
-
విశాఖ రైల్వేస్టేషన్ అగ్ని ప్రమాదం.. రంగంలోకి క్లూస్ టీమ్
Accident Updates..👉 విశాఖ రైల్వే ప్రమాదంపై విచారణకు ఆదేశం..రైల్వే ప్రమాదంపై విచారణకు ఆదేశించిన డీఆర్ఎం.ప్రమాద ఘటనపై రంగంలోకి దిగిన క్లూస్ టీమ్.ప్రమాద వివరాలు సేకరిస్తున్న అధికారులు. 👉 రైలు ప్రమాదంపై విశాఖ సీపీ శంఖబ్రత కామెంట్స్రైలు అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది.ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు ఎఫెక్ట్ అయ్యాయిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం, గాయాలు లేవుప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకున్నారుమంటలను అదుపులోకి తీసుకుని వచ్చారువిచారణ జరుగుతున్న క్రమంలో నేనేమీ మాట్లాడకూడదు.దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాం. 👉విశాఖ రైల్వే స్టేషన్‌కు రైళ్ల రాకపోకల్లో ఆలస్యం.👉ఆలస్యంగా నడుస్తున్న విశాఖ వచ్చే రైళ్లు.👉ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు.👉ఈరోజు విశాఖ నుంచి బయలుదేరాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్‌పై స్పష్టత ఇవ్వని అధికారులు.👉ఆందోళనలో ప్రయాణికులు. 👉ఈ సందర్బంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. కోర్బా ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నెంబర్-4పై ఉన్న సమయంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వెంటనే నాలుగు ఫైర్ టెండర్స్ ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగను కూడా అదుపులోకి తెస్తున్నారు. మంటల్లో నాలుగు బోగీలు కాలిపోయాయి. పూర్తిగా నాలుగు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. 👉బీ6, బీ7, ఎం1 బోగీల్లో మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు ఆగిఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఉన్నప్పటికీ వెంటనే వారిని బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేస్తున్నాము. ఇతర రైళ్ల కోసం ట్రాక్‌పై బోగీలను వేరు చేయడం జరుగుతోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాసేపట్లో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. 👉కాగా, విశాఖ రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. స్టేషన్లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్‌ప్రెస్(కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్)లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రైల్వే, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. 👉వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో విశాఖ రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్టు ప్రయాణీకులు చెబుతున్నారు. మంటల్లో పలు బోగీలు తగలబడుతున్నాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. స్టేషన్లో ఉన్న ప్రయాణీకులను బయటకు పంపిస్తున్నారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటన ఘటనా స్థలానికి అగ్ని మాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. కాగా, ఆదివారం ఉదయం కోర్బా నుంచి రైలు విశాఖపట్నం చేరుకుంది. మరికాసేపట్లో విశాఖ నుంచి తిరుపతికి ఇదే రైలు బయలుదేరాల్సి ఉంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఈసారీ అడియాసే
{పత్యేక జోన్‌పై ఆవిరైన ఆశలు కొత్త రైళ్ల ఊసేలేదు వీక్లీ ట్రెయిన్ల ఫ్రీక్వెన్సీ పెంపు లేనట్టే వేగన్ వర్కు షాపు ఒక్కటే వరం విశాఖపట్నం సిటీ: రైల్వే ‘ప్రభు’ దయతలచలేదు... రైల్వే జోన్‌పై ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి.... రాజ దాని ఎక్స్‌ప్రెస్‌తోసహా ఒక్క కొత్త రైలు కూడా వేయలేదు... కనీసం దువ్వాడ మీదుగా వెళ్తున్న రైళ్లను అయినా విశాఖకు మళ్లించ లేదు.. వీక్లీ రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచనూ లేదు... రద్దీ రైళ్లను అదనపు బోగీలూ వేయ లేదు..హుద్‌హుద్‌తో భారీగా నష్టపోయినా విశాఖ రైల్వే మౌలిక వసతుల మెరుగుదలను పట్టిం చుకోనే లేదు...వెరసి ఎన్ఏడీ ప్రభుత్వం కూడా విశాఖ రైల్వేకు దాదాపుగా మొం డి చెయ్యే విదిల్చింది. కొంతలో కొంత మెరుగు అన్నట్లుగా దువ్వాడ సమీపంలో వేగన్ వర్క్‌షాపు ఏర్పాటుకు ఆమోదించారు. కంచరపాలెం-మర్రిపాలెం సిక్ లైన్ ఆధునీకరణకు రూ.20 కోట్లు కేటాయించామని చెప్పారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ఊసెత్తని బడ్జెట్ జిల్లాను తీవ్రంగా నిరాశపరిచ్చింది. టీవీలకు అతుక్కుపోయి మరీ రైల్వే బడ్జెట్‌ను చూసిన విశాఖవాసులు ఈసురోమని నిట్టూర్చారు. ప్రజాగ్రహాన్ని ప్రతిబింబిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌తోసహా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనబటపట్టాయి. జోన్ జీరో!: రైల్వే జోన్ ప్రస్తావన లేదు. ఎప్పుడు వస్తుందో తెలియజేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జోన్ ప్రకటించకపోవడంపై విశాఖ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం తప్పితే ఉద్యోగులకు మేలు చేసే ప్రయోజనాలు కలిగించలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కచ్చితంగా వస్తాదనుకున్న జోన్ రాకపోవడంపై అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. జోన్ ప్రస్తావన వుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ప్రకటించినా కార్యరూపం దాల్చకపోవడంపై ఒఢిశా నేతల ఒత్తిడి ముందు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ హరిబాబుల మాటలు సైతం తేలిపోయినట్టు అయ్యాయి. రోజూ లక్ష మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే విశాఖ స్టేషన్ అభివృద్దికి ఎలాంటి మౌళిక వసతులు కల్పించలేదు. జ్ఞానాపురం వైపు చేపడతారనుకున్న పెద్ద ప్రాజెక్టులను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని ఊహించినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. పరిశుభ్రత, బయో టాయిలాట్లు మినహా కొత్త అంశాలు కనిపించడం లేదు. అదనపు బోగీల ప్రస్తావన లేకపోవడం కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. హుద్‌హుద్ తుఫాన్‌కు విశాఖలో రైల్వే వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. రైల్వే స్టేషన్‌తో బాటు రైల్వే ఆస్తులన్నీ భారీగా ధ్వర సమయ్యాయి. దాదాపు 200 కోట్ల మేర నష్టం వాటిల్లినా కొన్ని మౌళిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ. 70 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేశారు. ఆ మొత్తం ఈ బడ్జెట్లో వస్తుందని ఆశించారు. కానీ బడ్జెట్లో మౌళిక సదుపాయాలకు ఎలాంటి మొత్తం కేటాయించకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు తీవ్ర నిరాస చెందారు. ప్లాస్టిక్ కవర్ల నీడలో కుటుంబాలతో నివాసముంటున్న రైల్వే ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తి చెందారు. ఉన్నంతలో కొత్త ప్రాజెక్టులు ఇవీ..! దువ్వాడ సమీపంలోని వడ్లపూడి వద్ద వేగన్ వర్క్‌షాపు రూ. 213.97 కోట్ల వ్యయంతో నిర్మించడానికి అమోదించారు. డీజిల్ లోకోషెడ్‌ను ఆధునికీకరించేందుకు రూ. 53 కోట్లు మంజూరు చేశారు.ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు మరో 200 లోకోమెటివ్స్కు మరమ్మతులు చేసేందుకు అవసరమైన విస్తరణ కోసం రూ. 19.56 కోట్లు కేటాయించారు. పాడైన వ్యాగన్లను బాగు చేసేందుకు రూ. 20. 71 కోట్లు మంజూరు చేశారు గోపాలపట్నం-దువ్వాడ మధ్య అటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూ. 8.39 కోట్లు మంజూరు చేశారు. మరో రూ. 18 కోట్లతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సిగ్నలింగ్ పనులు చేపట్టేందుకు కేటాయించారు. అన్ మేన్డ్ లెవల్ క్రాసింగ్ పనుల నిమిత్తం రూ. 44.68 కోట్లు, ట్రాక్ నిర్వహణ కోసం రూ. 239 కోట్లు మంజూరు చేశారు. -
‘పశ్చిమ’కు చంద్రబాబు ఏమిస్తారో
‘అధికారంలోకి రాగానే రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై తొలి సంతకం పెడతా.. యువతకు ఉద్యోగాలిస్తా.. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా.. టీడీపీ అధికారంలోకి రావాలంటే ఈ జిల్లా ఫలితాలే కీలకం.. నాకు అన్ని జిల్లాలు ఓ ఎత్తు.. మీ జిల్లా ఓ ఎత్తు.. మీరు ఓటేయండి.. మిగతావన్నీ నేను చూసుకుం టా’నని ‘పశ్చిమ’ ప్రజల్ని వేడుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బుధవారం జిల్లాలో అడుగుపెడుతున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని.. గుంటూరులో ఎయిమ్స్.. కాకినాడ తీరంలో పెట్రో కెమికల్స్ పరిశ్రమలు.. విశాఖకు రైల్వే జోన్, ఐటీ హబ్ అంటూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వరాల జల్లులు కురిపించిన చంద్రబాబు ఇప్పటివరకూ ఎక్కడా మన జిల్లా ప్రస్తావనే తీసుకురాలేదు. అధికా రం చేపట్టి 50 రోజుల తర్వా త జిల్లాకు వస్తున్న బాబు ఇప్పుడైనా వరాలిస్తారా.. ఎప్పటిలా దింపుడు కళ్లెం ఆశలతో సరిపెట్టేస్తారా అనేది చర్చనీయూంశమైంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనపై ‘పశ్చిమ’ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 50 రోజుల అనంతరం బుధవారం తొలిసారి వస్తున్న ఆయన జిల్లాకు ఏం వరాలు కురిపిస్తారోనంటూ ఎన్నెన్నో అంచనాలతో ఇక్కడి ప్రజలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ‘టీడీపీ అధికారంలోకి రావడానికి ఈ జిల్లా ఫలితాలే కీలకం.. నాకు అన్ని జిల్లాలు ఓ ఎత్తు.. పశ్చిమగోదావరి జిల్లా ఓ ఎత్తు’ అంటూ పలు సందర్భాల్లో చం ద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానిం చిన నేపథ్యంలో ఇప్పుడు సీఎంగా ఆయన తొలి పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు ఒక్క మాటా లేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 50రోజుల్లో కొత్త ప్రాజెక్టుల ప్రకటనల్లో ఎక్కడా పశ్చిమగోదావరి జిల్లా ప్రస్తావనే రాలేదు. విజయవాడ-గుంటూరు మధ్య మంగళగిరి లేదా అమరావతిలో రాజధాని.. గుంటూరులో ఎయిమ్స్.. కాకినాడ తీరంలో పెట్రో కెమికల్స్.. విశాఖకు రైల్వే జోన్, ఐటీ హబ్ వంటివి వచ్చే లా చూస్తామంటున్న ముఖ్యమంత్రి సహజ, శక్తి వనరులున్న పశ్చిమగోదావరి జిల్లాకు ఏం ఇవ్వనున్నారనేది ఇంతవరకు వెల్లడించలేదు. ఈ తరుణంలో రెండురోజుల పర్యటనలో బాబు జిల్లాకు ఏం వరాలు ఇస్తారోనంటూ సామాన్య ప్రజలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏలూరులో రాజధానిపై ఏమంటారో! భారతదేశ ధాన్యాగారంగా, ఆంధ్రా అన్నపూర్ణగా, దేశంలోనే సేంద్రియ వ్యవసాయ పథకం అమలు చేస్తున్న ఏకైక జిల్లాగా, రాష్ట్రంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ప్రత్యేకతలున్న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరును రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఇటీవల కాలంలో ఊపందుకుంది. జిల్లాకు చెందిన వ్యాపార, వాణిజ్యవర్గాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు ఏలూరును ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలంటూ గళం విప్పుతున్నారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని సదుపాయాలు, సౌకర్యా లు, సహజ, శక్తివనరులు ఈ ప్రాంతానికి ఉన్నాయని వాదిస్తున్నారు. ఏలూరు-హనుమాన్ జంక్షన్ ప్రాంతం రాష్ట్ర రాజధానికి అన్నివిధాలుగా అనువైనదని ప్రతిపాదిస్తున్నారు. భూమి లభ్య త ఇక్కడ ఎక్కువగా ఉంది. లక్ష ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ఇందులోంచి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. రాజ దాని చేయనిపక్షంలో విజయవాడ-గుంటూరు-ఏలూరు ప్రాంతాలను త్రినగరిగా ప్రకటించి అభివృద్ధి చేయాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి. మరి వీటిపై చంద్రబాబు ఏవిధమైన ప్రకటన చేస్తారన్నది చూడాలి. పర్యటనలో పోలవరం ప్రస్తావన ఏదీ చంద్రబాబు రెండురోజుల జిల్లా పర్యటనలో ఎక్కడా పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం ప్రస్తావన లేకపోవడం చర్చనీయాంశమైంది. పోలవరం ప్రాజెక్టు బిల్లు (ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ సవరణ బిల్లు-2014) ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన నేపథ్యంలో జిల్లాలోని ప్రాజెక్టు ప్రాం తాన్ని చంద్రబాబు ఈ పర్యటనలో సందర్శిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్వయంగా ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తే పనులు వేగం పుంజుకోవడానికి, కీలకమైన పునరావాసం, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. చంద్ర బాబు గురువారం పోలవరం నియోజ కవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో 3గంటలపాటు పర్యటించన్నారు. ఆయా ప్రాంత రైతులతో ముఖాముఖి చర్చలతోపాటు గ్రామాలను సందర్శించనున్నారు. కొయ్యలగూడెం నుంచే హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. అయితే, అక్కడికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పోలవరం ప్రాజెక్ట్ సందర్శన టూర్ షెడ్యూల్లో ఎందుకు చేర్చలేదన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రాజెక్టు సందర్శనను చంద్రబాబు ఎందుకు పక్కనపెట్టారన్నది చర్చనీయాంశంగా మారింది. రుణమాఫీపై ఇక్కడైనా ప్రకటిస్తారా వ్యవసాయ రుణాల మాఫీపై ఇంతవరకు చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయలేదు. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి తాఖీదులొస్తున్నా అన్నదాతలకు భరోసా ఇచ్చేందుకూ యత్నించలేదు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ వర్తిస్తుందని, అది కూడా లక్షన్నరలోపే మాఫీ చేస్తామంటూ మంత్రులు రోజుకొక ప్రకటన ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇటీవల రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంగీకరించందంటూ చెప్పుకొచ్చారు. దాని పైనా స్పష్టత లేదు. రీ షెడ్యూల్ చేస్తే అప్పుల కోసం రైతులు బ్యాంకుల్లో ఉంచిన డాక్యుమెంట్లు, కుదువపెట్టిన మహిళల నగలు తిరిగిరావు. మరి వాటిని రైతులకు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేది కూడా చంద్రబాబు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు పాత రుణాలు చెల్లించని రైతులకు కొత్త రుణాలు లభించని దుస్థితి నెలకొంది. ఇప్పటికే రుణమాఫీ జాప్యంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే రైతులకు సంబంధించి వివి ద బ్యాంకుల్లో రూ.12వేల కోట్లకు పైగా రుణాలున్నాయి. మాఫీపై ఈ జిల్లాలో అయినా సీఎం స్ఫష్టమైన ప్రకటన చేస్తారా లేదా అన్నది చూడాలి. ఆశల పల్లకిలో నేతలు అధికార పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా చూస్తున్నారు. తమకు ఏ పదవులు కట్టపెడతారోనం టూ ఉవ్విళ్లూరుతున్నారు. ద్వితీయశ్రేణి నేతలు మార్కెట్ కమిటీ, గ్రంధాలయ సంస్థ చైర్మన్, ఆలయ పాలకమండళ్లలో పదవులను ఆశిస్తున్నారు. జిల్లా పర్యటనలో బాబు ఈ అంశంపై పార్టీ శ్రేణులకు హామీ ఇస్తారని భావిస్తున్నారు.