ఈసారీ అడియాసే | Do not use the new trains | Sakshi
Sakshi News home page

ఈసారీ అడియాసే

Published Fri, Feb 27 2015 12:38 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

ఈసారీ అడియాసే - Sakshi

ఈసారీ అడియాసే

{పత్యేక జోన్‌పై ఆవిరైన ఆశలు
కొత్త రైళ్ల ఊసేలేదు
వీక్లీ ట్రెయిన్ల ఫ్రీక్వెన్సీ పెంపు లేనట్టే
వేగన్ వర్కు షాపు ఒక్కటే వరం

 
విశాఖపట్నం సిటీ: రైల్వే ‘ప్రభు’ దయతలచలేదు... రైల్వే జోన్‌పై ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి.... రాజ దాని ఎక్స్‌ప్రెస్‌తోసహా ఒక్క కొత్త రైలు కూడా వేయలేదు... కనీసం దువ్వాడ మీదుగా వెళ్తున్న రైళ్లను అయినా విశాఖకు మళ్లించ లేదు.. వీక్లీ రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచనూ లేదు... రద్దీ రైళ్లను అదనపు బోగీలూ వేయ లేదు..హుద్‌హుద్‌తో భారీగా నష్టపోయినా విశాఖ రైల్వే మౌలిక వసతుల మెరుగుదలను పట్టిం చుకోనే లేదు...వెరసి ఎన్‌ఏడీ ప్రభుత్వం కూడా విశాఖ రైల్వేకు దాదాపుగా మొం డి చెయ్యే విదిల్చింది. కొంతలో కొంత మెరుగు అన్నట్లుగా దువ్వాడ సమీపంలో వేగన్ వర్క్‌షాపు ఏర్పాటుకు ఆమోదించారు. కంచరపాలెం-మర్రిపాలెం సిక్ లైన్ ఆధునీకరణకు రూ.20 కోట్లు కేటాయించామని చెప్పారు. దీర్ఘకాలిక  సమస్యల పరిష్కారం ఊసెత్తని బడ్జెట్ జిల్లాను తీవ్రంగా నిరాశపరిచ్చింది. టీవీలకు అతుక్కుపోయి మరీ రైల్వే బడ్జెట్‌ను చూసిన విశాఖవాసులు ఈసురోమని నిట్టూర్చారు. ప్రజాగ్రహాన్ని ప్రతిబింబిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌తోసహా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనబటపట్టాయి.

జోన్ జీరో!: రైల్వే జోన్ ప్రస్తావన లేదు. ఎప్పుడు వస్తుందో తెలియజేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జోన్ ప్రకటించకపోవడంపై విశాఖ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.  రైల్వే స్టేషన్ల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం తప్పితే ఉద్యోగులకు మేలు చేసే ప్రయోజనాలు కలిగించలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కచ్చితంగా వస్తాదనుకున్న జోన్ రాకపోవడంపై అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. జోన్ ప్రస్తావన వుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ప్రకటించినా కార్యరూపం దాల్చకపోవడంపై ఒఢిశా నేతల ఒత్తిడి ముందు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ హరిబాబుల మాటలు సైతం తేలిపోయినట్టు అయ్యాయి. రోజూ లక్ష మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే విశాఖ స్టేషన్ అభివృద్దికి ఎలాంటి మౌళిక వసతులు కల్పించలేదు. జ్ఞానాపురం వైపు చేపడతారనుకున్న పెద్ద ప్రాజెక్టులను ఈ బడ్జెట్‌లో ప్రకటిస్తారని ఊహించినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. పరిశుభ్రత, బయో టాయిలాట్లు మినహా కొత్త అంశాలు కనిపించడం లేదు. అదనపు బోగీల ప్రస్తావన లేకపోవడం కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది.  హుద్‌హుద్ తుఫాన్‌కు విశాఖలో రైల్వే వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. రైల్వే స్టేషన్‌తో బాటు రైల్వే ఆస్తులన్నీ భారీగా ధ్వర సమయ్యాయి. దాదాపు 200 కోట్ల మేర నష్టం వాటిల్లినా కొన్ని మౌళిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ. 70 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేశారు. ఆ మొత్తం ఈ బడ్జెట్‌లో వస్తుందని ఆశించారు. కానీ బడ్జెట్‌లో మౌళిక సదుపాయాలకు ఎలాంటి మొత్తం కేటాయించకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు తీవ్ర నిరాస చెందారు. ప్లాస్టిక్ కవర్ల నీడలో కుటుంబాలతో నివాసముంటున్న రైల్వే ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తి చెందారు.

ఉన్నంతలో కొత్త ప్రాజెక్టులు ఇవీ..!

దువ్వాడ సమీపంలోని వడ్లపూడి వద్ద వేగన్ వర్క్‌షాపు రూ. 213.97 కోట్ల వ్యయంతో నిర్మించడానికి అమోదించారు. డీజిల్ లోకోషెడ్‌ను ఆధునికీకరించేందుకు రూ. 53 కోట్లు మంజూరు చేశారు.ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు మరో 200 లోకోమెటివ్స్‌కు మరమ్మతులు చేసేందుకు అవసరమైన విస్తరణ కోసం రూ. 19.56 కోట్లు కేటాయించారు.  పాడైన వ్యాగన్‌లను బాగు చేసేందుకు రూ. 20. 71 కోట్లు మంజూరు చేశారు గోపాలపట్నం-దువ్వాడ మధ్య అటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూ. 8.39 కోట్లు మంజూరు చేశారు. మరో రూ. 18 కోట్లతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సిగ్నలింగ్ పనులు చేపట్టేందుకు కేటాయించారు. అన్ మేన్డ్ లెవల్ క్రాసింగ్ పనుల నిమిత్తం రూ. 44.68 కోట్లు, ట్రాక్ నిర్వహణ కోసం రూ. 239 కోట్లు మంజూరు చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement