special zone
-
ప్రత్యేక మండలం కోరుతూ రాస్తారోకో
బిచ్కుంద: నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక మండలం కోరుతూ సోమవారం ఉదయం గ్రామస్తులు రాస్తారోకో చేశారు. బిచ్కుంద మండలం పెద్దకొడప్గల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలంటూ రోడ్డెక్కారు. హైదరాబాద్-నాందేడ్ రహదారిపై రాస్తారోకోకు దిగడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
ఈసారీ అడియాసే
{పత్యేక జోన్‌పై ఆవిరైన ఆశలు కొత్త రైళ్ల ఊసేలేదు వీక్లీ ట్రెయిన్ల ఫ్రీక్వెన్సీ పెంపు లేనట్టే వేగన్ వర్కు షాపు ఒక్కటే వరం విశాఖపట్నం సిటీ: రైల్వే ‘ప్రభు’ దయతలచలేదు... రైల్వే జోన్‌పై ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి.... రాజ దాని ఎక్స్‌ప్రెస్‌తోసహా ఒక్క కొత్త రైలు కూడా వేయలేదు... కనీసం దువ్వాడ మీదుగా వెళ్తున్న రైళ్లను అయినా విశాఖకు మళ్లించ లేదు.. వీక్లీ రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచనూ లేదు... రద్దీ రైళ్లను అదనపు బోగీలూ వేయ లేదు..హుద్‌హుద్‌తో భారీగా నష్టపోయినా విశాఖ రైల్వే మౌలిక వసతుల మెరుగుదలను పట్టిం చుకోనే లేదు...వెరసి ఎన్ఏడీ ప్రభుత్వం కూడా విశాఖ రైల్వేకు దాదాపుగా మొం డి చెయ్యే విదిల్చింది. కొంతలో కొంత మెరుగు అన్నట్లుగా దువ్వాడ సమీపంలో వేగన్ వర్క్‌షాపు ఏర్పాటుకు ఆమోదించారు. కంచరపాలెం-మర్రిపాలెం సిక్ లైన్ ఆధునీకరణకు రూ.20 కోట్లు కేటాయించామని చెప్పారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ఊసెత్తని బడ్జెట్ జిల్లాను తీవ్రంగా నిరాశపరిచ్చింది. టీవీలకు అతుక్కుపోయి మరీ రైల్వే బడ్జెట్‌ను చూసిన విశాఖవాసులు ఈసురోమని నిట్టూర్చారు. ప్రజాగ్రహాన్ని ప్రతిబింబిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌తోసహా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనబటపట్టాయి. జోన్ జీరో!: రైల్వే జోన్ ప్రస్తావన లేదు. ఎప్పుడు వస్తుందో తెలియజేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జోన్ ప్రకటించకపోవడంపై విశాఖ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం తప్పితే ఉద్యోగులకు మేలు చేసే ప్రయోజనాలు కలిగించలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కచ్చితంగా వస్తాదనుకున్న జోన్ రాకపోవడంపై అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. జోన్ ప్రస్తావన వుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ప్రకటించినా కార్యరూపం దాల్చకపోవడంపై ఒఢిశా నేతల ఒత్తిడి ముందు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ హరిబాబుల మాటలు సైతం తేలిపోయినట్టు అయ్యాయి. రోజూ లక్ష మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే విశాఖ స్టేషన్ అభివృద్దికి ఎలాంటి మౌళిక వసతులు కల్పించలేదు. జ్ఞానాపురం వైపు చేపడతారనుకున్న పెద్ద ప్రాజెక్టులను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని ఊహించినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. పరిశుభ్రత, బయో టాయిలాట్లు మినహా కొత్త అంశాలు కనిపించడం లేదు. అదనపు బోగీల ప్రస్తావన లేకపోవడం కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. హుద్‌హుద్ తుఫాన్‌కు విశాఖలో రైల్వే వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. రైల్వే స్టేషన్‌తో బాటు రైల్వే ఆస్తులన్నీ భారీగా ధ్వర సమయ్యాయి. దాదాపు 200 కోట్ల మేర నష్టం వాటిల్లినా కొన్ని మౌళిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ. 70 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేశారు. ఆ మొత్తం ఈ బడ్జెట్లో వస్తుందని ఆశించారు. కానీ బడ్జెట్లో మౌళిక సదుపాయాలకు ఎలాంటి మొత్తం కేటాయించకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు తీవ్ర నిరాస చెందారు. ప్లాస్టిక్ కవర్ల నీడలో కుటుంబాలతో నివాసముంటున్న రైల్వే ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తి చెందారు. ఉన్నంతలో కొత్త ప్రాజెక్టులు ఇవీ..! దువ్వాడ సమీపంలోని వడ్లపూడి వద్ద వేగన్ వర్క్‌షాపు రూ. 213.97 కోట్ల వ్యయంతో నిర్మించడానికి అమోదించారు. డీజిల్ లోకోషెడ్‌ను ఆధునికీకరించేందుకు రూ. 53 కోట్లు మంజూరు చేశారు.ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు మరో 200 లోకోమెటివ్స్కు మరమ్మతులు చేసేందుకు అవసరమైన విస్తరణ కోసం రూ. 19.56 కోట్లు కేటాయించారు. పాడైన వ్యాగన్లను బాగు చేసేందుకు రూ. 20. 71 కోట్లు మంజూరు చేశారు గోపాలపట్నం-దువ్వాడ మధ్య అటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూ. 8.39 కోట్లు మంజూరు చేశారు. మరో రూ. 18 కోట్లతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సిగ్నలింగ్ పనులు చేపట్టేందుకు కేటాయించారు. అన్ మేన్డ్ లెవల్ క్రాసింగ్ పనుల నిమిత్తం రూ. 44.68 కోట్లు, ట్రాక్ నిర్వహణ కోసం రూ. 239 కోట్లు మంజూరు చేశారు. -
కరుణించు ప్రభూ!
నేడే బడ్జెట్ రైలు రాక జిల్లాకు బెర్తు దొరుకుతుందో.. లేదో.. పజాప్రతినిధుల ప్రతిపాదనలు ఏమవుతాయో.. కొత్త రైళ్లు.. సౌకర్యాలపై జిల్లావాసుల ఆశలు ఒడిశా పెత్తనం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ మరో బడ్జెట్ రైలు వస్తోంది. ఈసారైనా ఈ రైలు జిల్లాలో ఆగుతుందా లేక ఎప్పటిలాగే దూసుకుపోతుందా!.. అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రకు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకోవడం.. దాన్ని ఒడిశా వ్యతిరేకించడం.. ప్రత్యేక జోన్ ఇవ్వడం తప్పనిసరైతే శ్రీకాకుళం జిల్లాను ఈస్‌కోస్టు జోన్లోనే ఉంచాలనే కొత్త పల్లవి ఎత్తుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జోన్లో ఉంటూ ఇప్పటికే ఎంతో అన్యాయానికి గురవుతున్న జిల్లాకు ఈస్ట్‌కోస్ట్ నుంచి విముక్తి కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఎప్పుడూ నిరాశే కలిగిస్తున్నా.. ఈసారైనా ఆకాంక్షల నిధులు మోసుకొస్తుందేమోనన్న ఆశతో రైల్వే బడ్జెట్ కోసం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు గురువారం రైల్వే బడ్జెట్ సమర్పించనున్న తరుణంలో జిల్లాలో రైల్వేల పరిస్థితి చూస్తే.. ఏమున్నది గర్వకారణం అనిపించకమానదు. ఒడిశాలోని ఈస్ట్‌కోస్టు జోన్ పరిధిలోనూ.. అందులోని జిల్లాలోని సగం ప్రాంతం ఖుర్దా డివిజన్లో ఉండటంతో సౌకర్యాలన్నీ ఒడిశాకు తరలించుకుపోతూ.. అధిక ఆదాయం సంపాదిస్తున్న జిల్లాలోని స్టేషన్లపై ఉన్నతాధికారులు సవతి ప్రేమ చూపుతున్నారు. జిల్లాలోని పలాస స్టేషన్ ఏ గ్రేడ్ కాగా, ఆమదాలవలస, ఇచ్ఛాపురం స్టేషన్లను బీ గ్రేడ్‌గా గుర్తించారు. అయినప్పటికీ గ్రేడ్ల వారీ సౌకర్యాల కల్పనలో రైల్వే శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. ఆర్ఆర్బీ పరీక్షల కోసం జిల్లా విద్యార్థులు భువనేశ్వర్ వెళ్లాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో ఒడిశా అభ్యర్థులు ఇక్కడినుంచి వెళ్లేవారిని పరీక్షలకు హాజరుకాకుండా అడ్డుకుంటున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒడిశా పెత్తనం వల్ల ఏళ్ల తరబడి వాల్తేరు ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. జిల్లాకు సంబంధించి అదనపు రైళ్లు, హాల్టులు, గేట్మెన్ లేని లెవల్ క్రాసింగులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పొందూరు-రాజాం రైల్వే లైను.. వంటి ఎన్నో డిమాండ్లు ఏళ్ల తరబడి ఉన్నా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్), పలాస, ఇచ్ఛాపురం స్టేషన్ల నుంచి ఏటా వందల కోట్ల ఆదాయం లభిస్తున్నా ఆ స్టేషన్లలో కనీస సౌకర్యాల కల్పనపై శ్రద్ధ చూపడం లేదు. గత బడ్జెట్ ఒక్క ప్యాసింజర్ రైలుకే పరిమితమైంది. పలాస వంటి ప్రధాన స్టేషన్ల సమీపంలో రైల్ ఓవర్ బ్రిడ్జి, వికలాంగులకు ఎలివేటర్లు, మౌలిక సదుపాయాల కల్పన కలగానే మిగిలిపోయింది. ఏపీలో చివరి జిల్లాగా, వెనుకబడిన, వలసల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు మరిన్ని రైళ్లు అవసరం. అదే విధంగా కోణార్క్, హౌరా వంటి రైళ్లలో బెర్తులన్నీ ఒడిశాలోనే నిండిపోతున్నాయి. ముంబై, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లడానికి నెల రోజుల ముందు ప్రయత్నించినా బెర్త్‌లు దొరకని పరిస్థితి. విశాఖ, ప్రశాంతి రైళ్లను భువనేశ్వర్ వరకు పొడిగించుకున్నారు. దీంతో ఇక్కడి వారికి ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్నాళ్లలో ఏపీకి కొత్త రాజధాని రానుంది. ఆ ప్రాంతానికి ఇచ్ఛాపురం నుంచి ఓ ప్యాసింజర్ రైలు వేయాలని జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రతిపాదించారు. అదైనా మంజూరవుతుందో లేదో చూడాలి.