
ప్రత్యేక మండలం కోరుతూ రాస్తారోకో
బిచ్కుంద: నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక మండలం కోరుతూ సోమవారం ఉదయం గ్రామస్తులు రాస్తారోకో చేశారు.
బిచ్కుంద మండలం పెద్దకొడప్‌గల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలంటూ రోడ్డెక్కారు. హైదరాబాద్-నాందేడ్ రహదారిపై రాస్తారోకోకు దిగడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.