విశాఖ తీరంలో విదేశీ యుద్ధనౌకలు | Foreign warships off Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ తీరంలో విదేశీ యుద్ధనౌకలు

Published Wed, Oct 9 2024 5:26 AM | Last Updated on Wed, Oct 9 2024 5:26 AM

Foreign warships off Visakhapatnam

విశాఖ సిటీ: విశాఖ తీరంలో మలబార్‌–­2024 విన్యాసాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాల కోసం భారత నౌకాదళంతో పాటు యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీ (యూఎస్‌ఏ), జపాన్‌ మారీటైమ్‌ సెల్ఫ్‌డిఫెన్స్‌ ఫోర్స్‌ (జేఎంఎస్‌డీఎఫ్‌)తో పాటు రాయ­ల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ (ఆర్‌ఏఎన్‌) యుద్ధనౌకలు మంగళవారం విశాఖ చేరుకున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 18 వరకు హార్బర్, సీ ఫేజ్‌లలో రెండుదశల్లో విన్యాసాలు జరగనున్నాయి. 

బుధవారం నాలుగు దేశాల నౌకాదళాధిపతులు ఈ విన్యాసాలకు హాజరుకానున్నారు. తొలిదశలో హార్బర్‌ ఫేజ్‌లో ఈ నౌకాదళ కీలకాధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. సీ ఫేజ్‌లో భాగ­ంగా యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ ఆపరేషన్స్, క్రాస్‌డెక్‌ ల్యాండింగ్స్, సీమ్యాన్‌ షిప్‌ విన్యాసాలు జరగనున్నాయి. గైడెడ్‌ మిస్సై­ల్‌ డిస్ట్రాయర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఫిక్స్‌డ్‌ వింగ్‌ ఎంఆర్‌లు, ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్, హెలికాఫ్టర్లతో సహా వివిధ భారతీయ నావికా­దళ ప్లాట్‌ఫారమ్‌లు పాల్గొంటున్నా­యి. 

ఆస్ట్రేలియా తరఫున ఎంహెచ్‌–60ఆర్‌ హెలి­కాఫ్టర్, పీ8 మారీటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో అంజాక్‌ క్లాస్‌ ఫ్రిగేట్‌ హెచ్‌ఎంఏఎస్‌ స్టువర్ట్‌ యుద్ధనౌక మోహరించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీ అర్లీ బర్క్‌–క్లాస్‌ డిస్ట్రాయర్‌ వార్‌షిప్‌ యూఎస్‌ఎస్‌ డ్యూయీనీని రంగంలోకి దింపగా.. మురసమే–క్లాస్‌ డిస్ట్రాయర్‌ జేఎస్‌ అరి­యాకేతో జపాన్‌ ఈ విన్యాసాల్లో పాల్గొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement