నేడే గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌  | Group 2 Prelims 2024 exam on February 25: Andhra pradesh | Sakshi
Sakshi News home page

నేడే గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ 

Published Thu, Mar 28 2024 1:20 PM | Last Updated on Thu, Mar 28 2024 1:20 PM

Group 2 Prelims 2024 exam on February 25: Andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌ సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

నిరంతర పర్యవేక్షణ కోసం 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 51 మంది ఏపీపీఎస్సీ అధికారులు, 450 మంది రూట్‌ అధికారులు, 1,330 మంది లైజనింగ్‌ అధికారులను నియమించినట్లు చెప్పారు. 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. పటిష్ట బందోబస్తు కోసం 3,971 మంది పోలీస్‌ సిబ్బంది.. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర మెటీరియల్‌ను సురక్షితంగా తరలించేందుకు 900 మంది ఎస్కార్ట్‌ సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించామన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement