
సాక్షి, గుంటూరు: దుగ్గిరాల మండలం తుమ్మపూడి తిరుపతమ్మ హత్య కేసులో నిందితులైన సాయిరాం, వెంకట సాయిసతీష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఇది గ్యాంగ్ రేప్ కాదు. తిరుపతమ్మకు అదే గ్రామానికి చెందిన వెంకట సాయి సతీష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సతీష్ తరచూ తిరుపతమ్మ ఇంటికి వెళ్లి వస్తుంటాడు.
ఘటన జరిగిన రోజు కూడా సాయి సతీష్ తిరుపతమ్మ ఇంటికి వెళ్లి కొంతసేపు గడిపి బయటకు వచ్చాడు. ఆ వెంటనే శివసత్యసాయిరాం తిరుపతమ్మ ఇంట్లోకి వెళ్లి తనకు కూడా సహకరించమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో శివసత్యసాయిరాం తిరుపతమ్మను చీర కొంగుతో ఉరేసి హతమార్చాడు' అని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
చదవండి: (రెండేళ్ల తర్వాత సొంతూరికి.. కాటేసిన రోడ్డు ప్రమాదం!)
Comments
Please login to add a commentAdd a comment