tirupatamma
-
తుమ్మపూడి మహిళ హత్య కేసులో సంచలన విషయాలు
సాక్షి, గుంటూరు: దుగ్గిరాల మండలం తుమ్మపూడి తిరుపతమ్మ హత్య కేసులో నిందితులైన సాయిరాం, వెంకట సాయిసతీష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఇది గ్యాంగ్ రేప్ కాదు. తిరుపతమ్మకు అదే గ్రామానికి చెందిన వెంకట సాయి సతీష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సతీష్ తరచూ తిరుపతమ్మ ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఘటన జరిగిన రోజు కూడా సాయి సతీష్ తిరుపతమ్మ ఇంటికి వెళ్లి కొంతసేపు గడిపి బయటకు వచ్చాడు. ఆ వెంటనే శివసత్యసాయిరాం తిరుపతమ్మ ఇంట్లోకి వెళ్లి తనకు కూడా సహకరించమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో శివసత్యసాయిరాం తిరుపతమ్మను చీర కొంగుతో ఉరేసి హతమార్చాడు' అని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. చదవండి: (రెండేళ్ల తర్వాత సొంతూరికి.. కాటేసిన రోడ్డు ప్రమాదం!) -
నేటినుంచి తిరుపతమ్మ చిన్నతిరునాళ్ల
పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్ : తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల ఆదివారం ప్రారంభం కానుంది. మార్చి 16 నుంచి 20 వరకు ఘనంగా నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, నల్గొండ, కరీంనగర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఆలయ ఈఓ సీహెచ్ హనుమంతరావు, చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, పాలకవర్గం భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. ఇప్పటికే విద్యుద్దీప కాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. గ్రామంలోని కూడళ్లతో పాటు పలుచోట్ల స్వాగత ద్వారాలు, ఆలయం వద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సుమారు రూ.20 లక్షలు వెచ్చించి విద్యుద్దీపకాంతులు, బారికేడింగ్, మునేరులో భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాల ఏర్పాటు, ఆలయం చుట్టూ, మునేరులో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక షామియానాల ఏర్పాట్లు నిర్వహించారు. అఖండజ్యోతితో ఉత్సవాలు ప్రారంభం... ఈ నెల 16న ఉదయం అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 17న సాయంత్రం గ్రామంలో రథోత్సవం, 18న ఉదయం ప్రత్యేక అభిషేకం, అనంతరం లక్ష కుంకుమార్చన, 19న సాయంత్రం ఆలయం చుట్టూ 90 అడుగుల దివ్య ప్రభోత్సవం నిర్వహిస్తారు. 20న సాయంత్రం తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన పుట్టింటి పసుపు కుంకుమల బండ్లు అనిగండ్లపాడు నుంచి రావటంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం... తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని ఆలయ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, ఈఓ సీహెచ్ హనుమంతరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చేస్తున్న ఏర్పాట్లను శనివా రం వారు పరిశీలించారు. అనంతరం ఆలయ చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్సవాలు జరిగే ఐదు రోజులూ ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. అమ్మవారి పసుపు కుంకుమల ఉత్సవం రోజున పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేశఖండన శాల వద్ద భక్తుల స్నానాల కోసం తాత్కాలిక పంపులు అదనంగా ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో వివిధ శాఖల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నంది గామ డీఎస్పీ ఆధ్వర్యంలో, జగ్గయ్యపేట సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ నీగప్రసాద్ తెలిపారు. ప్రతిరోజూ 50 వేల లడ్డూలు సిద్ధం... తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం లడ్డూ ప్రసాదాలను పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. లడ్డూ తయారీకి స్థానిక సిబ్బందితో పాటు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రసాదాలను నిల్వ ఉంచుకునేలా సిద్ధం చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాలలో ప్రతిరోజూ 50 వేల లడ్డూలు సిద్ధంగా ఉంటాయన్నారు. తిరునాళ్లలో ప్రధాన ఘట్టం, ముగింపు రోజు అయిన 20న లడ్డూలు అదనంగా సిద్ధంగా చేస్తామని చెప్పారు. -
మహిళ దారుణ హత్య
నందిపాడ్ (మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్: నందిపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అదే ఇంట్లో ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో ఇంట్లో సీలింగు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు భార్యాభర్త మృతిచెందడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరేడుచర్ల మండలం రామాపురానికి చెందిన ఆవుల బంగారయ్య(25), తిరుపతమ్మ(22)లకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రి తం నందిపాడు గ్రామానికి వచ్చి గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బంగారయ్య తల్లి గురువమ్మ అదే గ్రామంలో వేరేచోట గుడిసె వేసుకుని నివాసముం టోంది. బుధవారం రాత్రి 9 గంటల వరకు కుమారుడి ఇంట్లో గడిపిన గురవమ్మ ఆ తర్వాత తన ఇంటికి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున ఆమె కుమారుడి ఇంటికి రాగా తలుపు బయట వైపు గడియ వేసి ఉంది. గడియ తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా కోడలు తిరుపతమ్మ మంచంలో రక్తపు మడుగులో పడి ఉండగా, కుమారుడు బంగారయ్య సీలింగు ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతని రెండు చేతులు చున్నీతో కట్టి ఉన్నాయి. దీంతో ఆమె ఇరుగు పొరుగును పిలిచి విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, ప్రొబేషనరి డీఎస్పీ విజయభాస్కర్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ రాహుల్దేవ్లు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నల్లగొండ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతులిద్దరూ నిరుపేదలు కావడం, వారి వద్ద విలువైన వస్తువులు, డబ్బు లేకపోవడంతో ఇతరులు హత్య చేసే అవకాశం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. భార్యాభర్త గొడవపడిన సందర్భంలో తిరుపతమ్మ తలపై గురవయ్య రోకలిబండతో కొట్టడంతో చనిపోయి ఉండొచ్చని, దిక్కుతోచని స్థితిలో అతను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. డాగ్ స్క్వాడ్ సైతం ఇంట్లోకి వెళ్లి మృతుడి చుట్టూ తిరిగి, ఇంట్లో ఉన్న బావి వద్దకు వెళ్లింది. తిరిగి మృతుడి వద్దకు వెళ్లడంతో పోలీసుల అనుమానం బలపడింది. గురువమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.