వైఎస్‌ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ నేతలు | Gurazala Constituency Leaders Meet YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ నేతలు

Mar 31 2026 4:27 PM | Updated on Mar 31 2026 4:34 PM

Gurazala Constituency Leaders Meet YS Jagan

తాడేపల్లి :  తమపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నంకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు. టీడీపీ గూండాలు చేసిన దాడుల గురించి వైఎస్‌ జగన్‌కు వివరించారు. జగన్‌ను కలిసిన వారిలో రామాపురం, చర్లగుడిపాడు గ్రామాల వైఎస్సార్‌సీపీ స్థానిక నేతలు ఉన్నారు. 

చర్లగుడిపాడులో బీసీ వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు పార్టీ కార్యకర్తలను హతమార్చారు టీడీపీ గూండాలు. తమ వారి హత్యలతో తామంతా రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులు. 

బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్‌ ఓదార్చారు. న్యాయపరమైన సహాయం అందిస్తామని, కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ల్నాడులో గూండారాజ్యం నడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవటాన్ని వైఎస్‌ జగన్‌ తప్పుబట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement