సాక్షి, విజయవాడ: విజయవాడలో మళ్లీ వర్షం దంచికొడుతోంది. శనివారం ఉదయం నుంచే మళ్లీ వర్షం కురుస్తోంది. ఇక, ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో బుడమేరు కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. దీంతో, తాజాగా వర్షం కురుస్తుండటంతో బెజవాడ ప్రజలు వణికిపోతున్నారు.
మరోవైపు.. వర్షాల కారణంగా ఇప్పటికే వారం రోజులుగా పలు కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. వరద తగ్గుతుందని ఆనందపడుతున్న వేళ మళ్లీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక.. కొత్తూరు తాడేపల్లి, వైఎస్సార్ కాలనీ, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్, ఊర్మిళా నగర్, జోజినగర్, నందమూరి నగర్, వాంబే కాలనీ, పాత రాజేశ్వరి పేట, కొత్త రాజేశ్వరి పేట, కండ్రిక, పాయకాపురం, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, లూనా నగర్, ఎస్‌ఆర్‌సీ కాలనీ, అంబాపురం కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.
విజయవాడలో మళ్లీ మొదలైన వర్షం 💔#VijayawadaRains pic.twitter.com/mDUpbPJRJR
— MBYSJTrends ™ (@MBYSJTrends) September 7, 2024
Present situation in Ajith Singh Nagar area .....bad luck entante marala full rain paduthundi... God Please Save Andhra Pradesh #VijayawadaFloods #VijayawadaRains #AndhraPradeshFloods pic.twitter.com/AK9bZjsfTk
— పల్నాడు అబ్బాయి 🔥💙🤍💚 (@BSRYsrcp) September 7, 2024
ఇదిలా ఉండగా.. విజయవాడ వాసులను మళ్లీ “బుడమేరు” వణికిస్తోంది. క్రమ క్రమంగా వరద పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని, ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ వాసులను మళ్లీ “బుడమేరు” వణికిస్తోంది. క్రమ క్రమంగా వరద పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని, ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.… pic.twitter.com/GxJqpi0aw6
— YSR Congress Party (@YSRCParty) September 7, 2024
Comments
Please login to add a commentAdd a comment