ఏపీలో తీరం దాటే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేఘావృత వాతావరణం ఏర్పడుతుండటంతో రోజూ అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడనున్నాయి. దీంతో పాటు ఈ నెల 29న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నట్లు తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోనే తీరం దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అది కూడా ఉత్తరాంధ్రలోనే దాటే సూచనలున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందన్నారు. సెప్టెంబర్ 5 వరకు వాయుగుండం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో వానలకు ఆస్కారం ఉందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment