24 కీలక అంశాలపై చర్చ
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల పంపకాలే ప్రధాన అజెండాగా డిసెంబర్ 3వ తేదీన కృష్ణా బోర్డు సమావేశం కానుంది. చైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగే 19వ సర్వసభ్య సమావేశం అజెండాలో 24 కీలక అంశాలను కృష్ణా బోర్డు చేర్చింది. ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శితో పాటు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఈఎన్‌సీలు పాల్గొననున్నారు.
ఉమ్మడి ప్రాజెక్టుల్లోని కృష్ణా జలాలను 66 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణ వాడుకునేలా గతంలో కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ.. తెలంగాణ ప్రభుత్వం 50 శాతం వాటా కావాలని కోరడం, దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఈ అంశాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు కృష్ణా బోర్డు సిఫార్సు చేసింది. నీటి పంపకాల జోలికి అపెక్స్ కౌన్సిల్ వెళ్లదని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చిచెప్పడంతో వివాదం మళ్లీ కృష్ణా బోర్డు ముందుకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment