Krishna board meeting
-
KRMB: అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం నిర్వహణ విధానాల్లో (రూల్ కర్వ్స్) స్వల్ప మార్పులకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు అంగీకరించిన తెలంగాణ.. తుది నివేదికపై సంతకం పెట్టే సమయంలో అడ్డం తిరిగింది. హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, జెన్కో సీఈ సుజయ్‌కుమార్ హాజరైనా.. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజం గైర్హాజరయ్యారు. దాంతో తుది నివేదికపై ఆర్ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై, బోర్డు సభ్యుడు (విద్యుత్) మౌతాంగ్, ఏపీ ఈఎన్సీ, జెన్కో సీఈ సంతకాలు చేశారు. తొలుత అంగీకారం తెలిపిన తెలంగాణ అధికారులు.. ఆ తర్వాత సంతకాలు చేయడానికి గైర్హాజరైనట్లు పేర్కొంటూ ఆర్ఎంసీ కన్వీనర్ పిళ్లై కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు తుది నివేదికను అందజేశారు. ఈ నివేదికపై కృష్ణా బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీ. ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఆర్ఎంసీ సమావేశంలో శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్స్‌లో స్వల్ప మార్పులకు తాము సమ్మతించకపోయినా, అంగీకరించినట్లుగా కన్వీనర్ పిళ్లై తప్పుగా చిత్రీకరించారంటూ కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం సాయంత్రం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంపిణీకి తాము అంగీకరించబోమని, 50:50 నిష్పత్తిలో పంపిణీ చేయాలంటూ ఆ లేఖలో పాత పల్లవి అందుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా శ్రీశైలం, సాగర్ల రూల్‌కర్వ్స్ ముసాయిదా, విద్యుత్ ఉత్పత్తి, మళ్లించిన వరద జలాలను కోటాలో కలాపాలా వద్దా అనే అంశాలపై చర్చించడానికి నాలుగుసార్లు ఆర్ఎంసీ సమావేశాలు నిర్వహించారు. ఒకట్రెండు సమావేశాలకు మాత్రమే తెలంగాణ అధికారులు హాజరయ్యారు. శనివారం జరిగిన ఐదో సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం రూల్‌కర్వ్స్‌లో స్వల్ప మార్పులకు ఇరు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. సాగర్ రూల్‌కర్వ్స్‌పై సీడబ్ల్యూసీ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. చదవండి: (ఏబీఎన్ వెంకటకృష్ణను విచారించిన సీఐడీ) శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగా ఉంచాలన్న సీడబ్ల్యూసీ ప్రతిపాదనకు అంగీకరించారు. శ్రీశైలంలో 50 : 50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తి చేయాలని, సాగు, తాగునీటికి బోర్డు కేటాయించిన నీటితోనే విద్యుదుత్పత్తి చేయడానికి సమ్మతించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కడలిలో వరద జలాలు కలుస్తున్నప్పుడు రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటాలో కలపకూడదన్న ఏపీ ప్రతిపాదనకు అంగీకరించారు. అయితే, ఇదే అంశాలతో కూడిన తుది నివేదికపై సంతకం చేయడానికి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఇదీ నివేదిక శ్రీశైలం రూల్ కర్వ్స్‌లో స్వల్ప మార్పులు, 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తి, మళ్లించిన వరద జలాలను లెక్కించినా కోటాలో కలపకూడదంటూ పేర్కొన్న తుది నివేదికపై తెలంగాణ మినహా ఆర్ఎంసీ సభ్యులు సంతకాలు చేశారు. శ్రీశైలం, సాగర్ల నిర్వహణకు శాశ్వత జలాశయాల నిర్వహణ కమిటీ (పీఆర్‌ఎంసీ)ని ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. కృష్ణా బోర్డు కేటాయించిన నీటి వినియోగంపై ప్రతి పది రోజులకు ఒక సారి పీఆర్‌ఎంసీ సమావేశమై, లోటుపాట్లు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దడానికి బోర్డుకు సూచనలు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. -
ఇక బోర్డుల వంతు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిపై సబ్‌కమిటీ స్థాయి భేటీలో ఏమీ తేలలేదు. బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంది. దీంతో తదుపరి నిర్ణయాలు పూర్తిస్థాయి బోర్డుల్లోనే తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే గోదావరి బోర్డు, మంగళవారం జరిగే కృష్ణా బోర్డు భేటీలు కీలకంగా మారాయి. ప్రాజెక్టుల అంశంతో పాటు సిబ్బంది నియామకం, నిధుల చెల్లింపు అం శాలపై వరుసగా జరగనున్న భేటీల్లోనే స్పష్టత రా నుంది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు జరగనుంది. గెజిట్ అమలుపై చర్చించేందుకు ఆదివారం ఉదయం జలసౌధలో గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే అధ్యక్షతన, మధ్యాహ్నం కృష్ణా బోర్డు తరఫున రవికుమార్ పిళ్లై అధ్యక్షతన భేటీలు జరగ్గా, తెలంగాణ తరఫున సీనియర్ ఇంజనీర్లు సుబ్రహ్మణ్య ప్రసాద్, విజయ్‌కుమార్, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఒక్కో భేటీ సుమారు మూడు గంటలకుపైగా జరగ్గా, బోర్డు అధీనంలో ఉండాల్సిన ప్రాజెక్టులు, సిబ్బంది, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, బోర్డు అభిప్రాయాలు, నిధుల చెల్లింపు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. గోదావరి ఒక్కటే.. మిగతా వాటికి ఒప్పుకోం.. ఇక గోదావరి బోర్డు భేటీలో ప్రధానంగా ప్రాజెక్టుల పరిధిపై చర్చ జరిగింది. తెలంగాణ ముందు నుంచి చెబుతున్నట్లుగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని కోరింది. అయితే ఏపీ మాత్రం శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ బ్యారేజీ వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోనే ఉంచాలని విన్నవించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తిస్థాయి భేటీలో చర్చిద్దామంటూ బోర్డు సర్దిచెప్పింది. ఇక పెద్దవాగు కింద 80% ఆయకట్టు ఏపీ పరిధిలో ఉన్నందున దాని నిర్వహణకయ్యే వ్యయంలో 80% ఏపీనే భరించాలని కోరగా, దీనికి సానుకూలత లభించినట్లు తెలిసింది. మిగతా నిధు లు, సిబ్బంది, వాటికిచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలపై సోమవారం జరిగే బోర్డు భేటీలో స్పష్టత రానుంది. విద్యుదుత్పత్తి కేంద్రాలపై తెలంగాణ అభ్యంతరం కృష్ణా బేసిన్లో జూరాల నుంచి పులిచింతల వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో ఉంచాలన్న ప్రతిపాదనలపై ఇరురాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, సాగర్, పులిచింతల విద్యుత్కేంద్రాలు బోర్డుల పరిధిలో అక్కర్లే దని తెలంగాణ చెప్పినట్లు సమాచారం. జూరాల ప్రాజెక్టును సైతం బోర్డు పరిధిలోకి తేవడాన్ని తెలంగాణ తప్పుపట్టింది. శ్రీశైలం మీద ఆధార పడి ఉండే కల్వకుర్తి, నాగార్జునసాగర్ హెడ్ రెగ్యులేటర్, ఎడమ కాల్వ హెడ్‌రెగ్యులేటర్, సాగర్ పరిధిలోని వరద కాల్వ, ఆర్డీఎస్, దాని పరిధిలోని తుమ్మిళ్ల, సిద్ధనాపూర్ కాల్వ, ఆర్డీఎస్ హెడ్రెగ్యులేటర్లనే బోర్డు ఆధీనంలో ఉంచేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఇక ఏపీ బనకచర్లతోపాటు దానికింద ఉన్న ఔట్లెట్లు మినహా శ్రీశైలం పరిధిలోని హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, హెడ్ రెగ్యులేటర్లు, పవర్‌హౌస్, పోతిరెడ్డిపాడు, సాగర్ కింది కుడి కాల్వ, పులిచింతలను బోర్డు పరిధిలో ఉంచేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఏపీ అధికారులు తెలంగాణ పవర్‌హౌస్‌లు తీసుకోవాల్సిందేనని గట్టిగా పట్టు బట్టినట్లు తెలిసింది. ప్రాజెక్టులపై ఒక్కో రాష్ట్రానిది ఒక్కో అభిప్రాయం కావడంతో బోర్డుల భేటీల్లో ఖరారు చేయాలని నిర్ణయించారు. -
తటస్థులతోనే తనిఖీ కమిటీ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించిన తరువాతే ప్రాజెక్టుల తనిఖీకి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 22న కేంద్ర జల్ శక్తి శాఖ రాసిన లేఖలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేశామని గుర్తు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల్లో ఛైర్మన్, సభ్యులు, సీఈలుగా ఇరు రాష్ట్రాలకు చెందని అధికారులను మాత్రమే నియమించాలని కేంద్ర జల్ శక్తి శాఖ గత నెల 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనటాన్ని గుర్తు చేసింది. కానీ రాయలసీమ ఎత్తిపోతల తనిఖీకి నియమించిన కమిటీలో తెలంగాణకు చెందిన దేవేందర్‌రావును సభ్యుడిగా నియమించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు లేఖ రాశారు. బోర్డు నియమించిన కమిటీ రాయలసీమ ఎత్తిపోతలను ఈనెల 5న పరిశీలిస్తుందని, అందుకు ఏర్పాట్లు చేయాలంటూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే సోమవారం శ్యామలరావుకు లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే కమిటీ ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాల ప్రకారం బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాకే తనిఖీ కమిటీని నియమించాలని కృష్ణా బోర్డును మరోసారి కోరింది. తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్తరామదాస, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, నెట్టెంపాడు సామర్థ్యం పెంపు, కల్వకుర్తి సామర్థ్యం పెంపు, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు ప్రాజెక్టులను చేపట్టిందని పేర్కొంది. వీటి తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత ఆయకట్టుకు నీళ్లందించడానికే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా మొదట చేపట్టిన ప్రాజెక్టులను తొలుత తనిఖీ చేసి ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలని సూచించింది. -
జల జగడంపై కదిలిన కృష్ణా బోర్డు
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా బోర్డు కదిలింది. ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడంపై చర్చించేందుకు ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం కనీస నీటిమట్టం స్థాయికి నీటి నిల్వ దాటకుండానే.. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తుండటంపై గత నెల 10న, 23న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వాటిపై స్పందించిన కృష్ణా బోర్డు తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. కానీ.. ఆ ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తూ విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీనిపై గత నెల 29న మరోసారి కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా డెల్టా ఎస్ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నప్పటికీ.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా పులిచింతల ప్రాజెక్టులోనూ తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని ప్రారంభించడంపై గత నెల 30న బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మూడు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టులను ఖాళీ చేయడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని.. వాటిని పరిరక్షించాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చర్చించేందుకు 9న త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేసినట్లు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. -
Krishna River Management Board: ఆ మూడు అంశాలే అజెండా
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నదీ జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, ఒక నీటి సంవత్సరంలో కోటాలో మిగిలిన జలాలను తర్వాత వచ్చే ఏడాదిలో వాడుకోవడం, వరద సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన జలాలను కోటా కింద లెక్కించాలా? వద్దా? అనే అంశాలే అజెండాగా మంగళవారం కృష్ణా బోర్డు సమావేశమవుతోంది. కరోనా నేపథ్యంలో వర్చువల్ విధానంలో బోర్డు 13వ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎ.పరమేశం సమాచారం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు ఇదే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఏటా బోర్డు సమావేశంలో కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటును బోర్డు ప్రతిపాదించడం.. రెండు రాష్ట్రాలు అంగీకరించడం రివాజుగా వస్తోంది. మంగళవారం జరిగే భేటీలోనూ ఇదే పద్ధతిలో లాంఛనంగా నీటిని పంపిణీ చేయనుంది. ఒక నీటి సంవత్సరం కోటాలో మిగిలిన జలాలను క్యారీ ఓవర్ జలాలుగా పరిగణించాలని.. వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ఇదే అంశాన్ని ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులకు వివరించి.. ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని బోర్డు వర్గాలు తెలిపాయి. శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. వరద జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో ఇరు రాష్ట్రాలు ఎవరు వినియోగించుకున్నా వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై సమావేశంలో మరో దఫా చర్చించనున్నారు. బోర్డు చైర్మన్ పరమేశం ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఆయనకు వీడ్కోలు పలకనున్నారు. -
మరింత వాటాకు పట్టు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో నెలకొన్న వివాదాలపై బోర్డు జరిపే భేటీలో ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులపైనే చర్చించాలని తెలంగాణ నిర్ణయించింది. శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచేలా తీసుకొచ్చిన జీవో 203ను నిలుపుదల చేసే అంశాన్ని బోర్డు ఎజెండాలో చేర్చింది. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ.. బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై త్వరలోనే భేటీ నిర్వహిస్తామని, అందులో చర్చించే ఎజెండాను 26వ తేదీలోగా అందించాలని ఆదేశించింది. దీనిపై తెలంగాణ 4 అంశాలతో ఎజెండాను ఖరారు చేసింది. తెలంగాణకు అడ్‌హక్‌గా కేటాయించిన 299 టీఎంసీల నీటికి అదనంగా పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి మళ్లింపు జలాలతో తెలంగాణకు దక్కే వాటాను రాష్ట్రానికి కేటాయించాలని కోరనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన పోలవరం, పట్టిసీమలతో బచావత్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలకు కనీసంగా 90 టీఎంసీల నీటి వాటాలు దక్కుతాయని, ప్రస్తుతానికి పోలవరం వాటాను పక్కన పెట్టినా, పట్టిసీమ ద్వారా దక్కే 45 టీఎంసీలను కేటాయించి, తమ వాటా పెంచాలని తెలంగాణ కోరనుంది. అలాగే, ఈ వాటర్ ఇయర్లో ఏపీ చేసిన అదనపు వినియోగాన్ని వచ్చే జూన్ నుంచి ఆరంభమయ్యే వాటర్ ఇయర్లో కలపాలని కోరనుంది. తాగునీటి వినియోగ అంశాలను సైతం ఎజెండాలో చేర్చింది. -
15న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఇప్పటికే నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 66:34 నిష్పత్తిన దక్కిన నీటి వాటాల్లోంచి రాష్ట్ర నెలవారీ అవసరాలకు నీటి కేటాయింపులు చేసేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలకు జలసౌధలో భేటీ కానుంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఇరు రాష్ట్రాలకు శుక్రవారం లేఖలు రాశారు. ఈ భేటీకి తెలంగాణ, ఏపీల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు, బోర్డు సభ్య కార్యదర్శులు హాజరు కానున్నారు. ఇప్పటికే తమకు తక్షణ అవసరాలకు లభ్యతగా ఉన్న జలాల్లో తమకు 53 టీఎంసీల మేర నీటిని తక్షణం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు విన్నవించింది. ఇందులో పోతిరెడ్డిపాడుకు 25 టీఎంసీ, హంద్రీనీవాకు 5, కృష్ణాడెల్టాకు 4, నాగార్జునసాగర్ కుడి కాల్వలకు 15, ఎడమ కాల్వకు 4 టీఎంసీలు కోరింది. ఇక తెలంగాణ తనకు 31 టీఎంసీలు అవసరమవుతుందని తేల్చింది. ఇందులో సాగర్ఎడమ కాల్వకు 13 టీఎంసీ, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్ తాగునీటికి 10, కల్వకుర్తి అవసరాలకు 8 టీఎంసీలు అవసరమని తెలిపింది. ఇందులో ఇప్పటికే సాగర్ఎడమ కాల్వ కింద ఏపీకి 4 టీఎంసీలను కేటాయిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా, మిగతా నీటి కేటాయింపులపై నిర్ణయం చేయాల్సి ఉంది. ఇక దీంతో పాటే ఎడమ కాల్వ పరిధిలో టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటు, నీటి సరఫరా నష్టాలను అంచనా వేసేందుకు బోర్డు నేతృత్వంలోని నలుగురు సభ్యుల అధికారుల బృందం ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల్లో పరివాహక ప్రాంతంలో పర్యటించనుంది. -
'ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి'
విజయవాడ: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు కిందకు తీసుకురావాలని ఏపీ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, నాగార్జునసాగర్ కుడి, ఎడమ ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు భుజంగరాయలు, వై. పుల్లయ్య చౌదరిలు కోరారు. విజయవాడ గేట్ వే హోటల్లో జరుగుతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశానికి విచ్చేసిన బోర్డు చైర్మన్ శ్రీవాస్తవను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఎగువ రాష్ట్రాల నుంచి రావాల్సిన నీటిని సకాలంలో విడుదల చేయించాలని కూడా విజ్ఞప్తి చేశారు. సాగర్ కుడి కాలువ ప్రధాన రెగ్యులేటర్ గుంటూరులో ఉన్నందున దాని నిర్వహణను ఏపీకి అప్పగించాలని కోరారు. ఏపీలో తొలిసారిగా చైర్మన్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపకాలపై చర్చ జరుగుతోంది. సమావేశంలో ఏపీ, తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బోర్డు చైర్మన్ శ్రీవాస్తవను కలిశారు. -
నీటి కేటాయింపులు సవాలే!
నేడు కృష్ణా బోర్డు సమావేశం సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం లో ఇప్పటివరకూ వినియోగించుకున్న నీళ్లు పోనూ.. ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీళ్లన్నీ మావంటే మావని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న 40.45 టీఎంసీ లను తమకే కేటాయించాలంటూ కృష్ణా బోర్డుకు ఇరు రాష్ట్రాలు లేఖలు రాశాయి. నీటి కేటాయింపు లపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం సాధిం చడం సవాలేనని బోర్డు వర్గాలు వెల్లడించాయి. నీటి కేటాయింపుల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు లేఖలు రాస్తుండటంతో రబీ పంటలకు సాగునీరు, తాగునీటి అవసరాలపై చర్చించేందుకు బుధవారం హైదరా బాద్‌లోని జలసౌధలో బోర్డు సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ హెచ్‌కే హల్దార్ నిర్ణయించారు. కృష్ణా నదీపై ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో కనీస నీటిమట్టానికి ఎగువన 40.45 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇప్పటికే కేటాయించిన నీళ్ల కన్నా తెలంగాణ ప్రభుత్వం 4.34 టీఎంసీలను అధికంగా వినియోగించుకుందని.. తమకు కేటాయించిన నీటి లో ఇంకా 14.46 టీఎంసీలను వినియోగించుకోవా ల్సి ఉందని ఏపీ ప్రభుత్వం బోర్డుకు తెలిపింది. ఆ నీటిని విడుదల చేయడంతో పాటు నాగార్జునసాగర్ కుడి కాలువ కింద పంటలను కాపాడుకోవడానికి 12, ఎడమ కాలువ కింద పంటలను కాపాడుకోవ డానికి, తాగు నీటి అవసరాలకు 4 టీఎంసీలు కేటా యించాలని ఈనెల 3న ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటే శ్వరరావు బోర్డుకు లేఖ రాశారు. కేటాయించిన నీటి కన్నా ఏపీ ప్రభుత్వం 25.341 టీఎంసీలు అధికంగా వినియోగించుకుందని.. తమకు కేటాయించి విని యోగించు కుని నీటిని విడుదల చేయడంతోపాటూ అదనంగా 25 టీఎంసీలు కేటాయించాలని ఈనెల 1న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కసరత్తు చేసిన బోర్డు.. నీటి కేటాయింపులపై ఏకాభిప్రాయం సాధించడానికి సంప్రదింపులు జరిపింది. -
19న కృష్ణా బోర్డు సమావేశం
రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల తాగునీటి అవసరాలు, నీటి విడుదల, ప్రాజెక్టుల పరిధిలో టెలీమెట్రీ విధానం వంటి అంశాలను చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 19న సమావేశం కానుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ గురువారం లేఖలు రాశారు. గత నెల 21, 22న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రాష్ట్రాల అవసరాలు, నీటి విడుదలపై ఈ సమావేశంలో చర్చించాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుండగా, తమ డెల్టా అవసరాల కోసం మూడు, నాలుగు టీఎంసీలు అవసరం ఉందని ఏపీ కోరుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీకి దిగువన 503.9 అడుగుల వద్ద 121.55 టీఎంసీల నీరుంది. ఇందులో ఒక టీఎంసీకి మించి వాడుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి నీటి విడుదల అనివార్యం. ప్రస్తుతం శ్రీశైలంలో 788.4 అడుగుల వద్ద 23.72 టీఎంసీల నీరుంది. ఇందులో 10 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. ఆ నీటిని తమ అవసరాలకు విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు సమావేశంలో కోరవచ్చు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో చుక్క కూడా తేడా రాకుండా నాగార్జునసాగర్, శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద టెలీమెట్రీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద ్ధమైంది. సాగర్, శ్రీశైలం సహా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, కల్వకుర్తి, ఏఎంఆర్పీ సహా మొత్తంగా 14 పాయింట్లలో రిజర్వాయర్ల లెవల్, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో ప్రవాహాలను గణించేందుకు వీలుగా టెలీమెట్రీ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. దీనిపై సమావేశంలో చర్చించనున్నారు. -
కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి!
* 15 అంశాలతో మార్గదర్శకాల రూపకల్పన * ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు * మిగులు జలాలూ ఇదే నిష్పత్తిలో పంపిణీ * నీటి విడుదల ప్రొటోకాల్ నిర్ధారణకు వర్కింగ్ గ్రూపు ఏర్పాటు * దీని సిఫారసులకు అనుగుణంగానే బోర్డు ఆదేశాలు * సుదీర్ఘంగా సాగిన కృష్ణా బోర్డు సమావేశం.. నేడూ కొనసాగింపు సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పంపిణీపై మార్గదర్శకాల ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన 15 అంశాలపై ప్రస్తుతానికి ఒక ముసాయిదాను రూపొందించింది. దీనిని జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంది. గురువారం ఇక్కడి శ్రమశక్తిభవన్‌లోని జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి అమర్జీత్సింగ్, తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్.కె.జోషి, ఆదిత్యనాథ్‌దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, తెలంగాణ అంతర్ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజనీర్ నాగేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ముందుగా బోర్డు పరిధిని నిర్వచించి ఈ నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులను, వాటి నీటి విడుదల ప్రొటోకాల్‌ను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 8.40 వరకు.. దాదాపు 10 గంటల పాటు కొనసాగింది. వివిధ అంశాలపై సమావేశంలో వాడీవేడిగా వాదోపవాదాలు జరిగినప్పటికీ చివరకు సయోధ్య దిశగా అడుగులు వేశారు. సమావేశాన్ని శుక్రవారం కూడా కొనసాగించాలని, మరోసారి అన్ని అంశాల మీద చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు. ఈ ముసాయిదా ఆమోదం పొందితే 2015-16 ఖరీఫ్, రబీ పంటల కాలానికి మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలు: 1. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల్లో నీటి విడుదల ప్రొటోకాల్ కూడా బోర్డు పరిధిలోకి వస్తుంది. 2. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు మెంబర్ సెక్రెటరీ అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాజెక్టుల అధికారుల నుంచి నీటి అవసరాలపై ఈ కమిటీకి ప్రతిపాదనలు వెళ్లాలి. నీటి విడుదలకు అవసరమైన ఆపరేషన్ ప్రొటోకాల్‌ను సిఫారసు చేస్తుంది. ఇందుకు అనుగుణంగా కృష్ణా బోర్డు తగిన ఆదేశాలు జారీచేస్తుంది. వీటిని ఆయా ప్రాజెక్టు అధికారులు అమలుచేయాల్సి ఉంటుంది. 3. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల జలాలను ఏపీ 512 , తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాలి. 4. నికర జలాలు 811 టీఎంసీలు పోగా మిగులు జలాలు ఉంటే వాటినీ అదే నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. 5. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి కుడి కాలువ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా 32 టీఎంసీలు విడుదల చేయాలి. ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు 100 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. మొత్తంగా నాగార్జునసాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. 6. కెసీ కెనాల్ ద్వారా 31 టీఎంసీలు, జూరాల ద్వారా 17.8 టీఎంసీలు, ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీల నీటి వినియోగం మించకూడదు. 7. తెలుగు గంగ ద్వారా చెన్నై నీటి పథకానికి నిర్దేశిత విడుదలయ్యేలా, ఎస్సార్బీసీ ద్వారా వివిధ అవసరాలకు 19 టీఎంసీలు తప్పనిసరిగా విడుదలయ్యేలా చూడాలి. వీటిని పరిగణనలోకి తీసుకున్న తరువాతే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి అంశాన్ని పరిగణించాలి. 8. భీమా ఎత్తిపోతల పథకానికి 20 టీఎంసీలు ఇవ్వడం ద్వారా కృష్ణా డెల్టాకు తక్కువయ్యే 20 టీఎంసీల విషయంలో పాత విధానాన్నే పాటించాలని నిర్ణయించారు. 9. నీటి నియంత్రణ, నిర్వహణలో ముందుగా కృష్ణా డెల్టా అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు అనుగుణంగా నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఉండాలి. వాదోపవాదాలు.. * నికర జలాల పంపిణీకి సంబంధించి.. తమకు 532 టీఎంసీలు కేటాయించి, తెలంగాణకు 279 టీఎంసీలే కేటాయించాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు. చివరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించాలని నిర్ణయించారు. కృష్ణా డెల్టాకు తక్కువయ్యే 20 టీఎంసీల విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. * హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇప్పుడు ఇస్తున్న 16.5 టీఎంసీలకు తోడుగా ఉమ్మడి నీటి కేటాయింపుల నుంచి మరికొంత నీరు కేటాయించాలని తెలంగాణ కోరగా.. నూతన రాజధాని అమరావతికి, రాయలసీమకు తాగునీటి అవసరాలకు నీరు కావాలని ఏపీ కోరింది. * ఈ అంశంపై ఇప్పటివరకు ఉన్న విధానాన్నే కొనసాగించాలని, హైదరాబాద్‌కు అవసరమైన నీటిని ఉమ్మడి కోటా నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. * మొత్తం కేటాయింపుల నుంచి తమకు నచ్చిన రీతిలో వినియోగించుకుంటామని తెలంగాణ వాదించినప్పటికీ.. ఏపీ అంగీకరించలేదు. కేంద్రమూ ఈ వాదనకు సానుకూలంగా స్పందించలేదు. -
కృష్ణా బోర్డు భేటీ మే 8కి వాయిదా
హైదరాబాద్: బుధవారం జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం వచ్చే నెల 8కి వాయిదా పడింది. కృష్ణా జలాల వివాదం, బ్రిజేశ్‌కుమార్ ట్రి బ్యునల్ తీర్పుపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు హాజరుకావడానికి అధికారులు ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నం దున బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని ఇరు రాష్ట్రాలు కోరాయి. ఫలితంగా భేటీని వచ్చే నెల 8కి వా యిదా వేస్తున్నట్లు బోర్డు సభ్య కార్యదర్శి ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. -
కృష్ణా బోర్డు సమావేశం మళ్లీ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 29న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజున కృష్ణా నదీ జలాల అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వాదనలు వినిపించాల్సి ఉండ డంతో ముఖ్య అధికారులంతా అక్కడే ఉండే అవకాశం ఉంది. దీంతో సమావేశం జరగడం కష్టమేనని తెలుస్తోంది. తమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి 28 నుంచి 3 రోజుల పాటు అందుబాటులో ఉండరని, ఇతర అధికారులు సైతం సుప్రీం కేసు విషయమై ఢిల్లీలో ఉండనున్నారని శుక్రవారం తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయాలని లేఖలో కోరారు. తమ అధికారులూ ఢిల్లీలో ఉండే అవకాశం దృష్ట్యా ఏపీ సైతం సమావేశాన్ని వాయిదా వేయించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.