హైదరాబాద్: బుధవారం జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం వచ్చే నెల 8కి వాయిదా పడింది. కృష్ణా జలాల వివాదం, బ్రిజేశ్‌కుమార్ ట్రి బ్యునల్ తీర్పుపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు హాజరుకావడానికి అధికారులు ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నం దున బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని ఇరు రాష్ట్రాలు కోరాయి. ఫలితంగా భేటీని వచ్చే నెల 8కి వా యిదా వేస్తున్నట్లు బోర్డు సభ్య కార్యదర్శి ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు.