నేడు కృష్ణా బోర్డు సమావేశం
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం లో ఇప్పటివరకూ వినియోగించుకున్న నీళ్లు పోనూ.. ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీళ్లన్నీ మావంటే మావని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న 40.45 టీఎంసీ లను తమకే కేటాయించాలంటూ కృష్ణా బోర్డుకు ఇరు రాష్ట్రాలు లేఖలు రాశాయి. నీటి కేటాయింపు లపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం సాధిం చడం సవాలేనని బోర్డు వర్గాలు వెల్లడించాయి. నీటి కేటాయింపుల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు లేఖలు రాస్తుండటంతో రబీ పంటలకు సాగునీరు, తాగునీటి అవసరాలపై చర్చించేందుకు బుధవారం హైదరా బాద్‌లోని జలసౌధలో బోర్డు సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్ హెచ్‌కే హల్దార్ నిర్ణయించారు. కృష్ణా నదీపై ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో కనీస నీటిమట్టానికి ఎగువన 40.45 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి.
ఇప్పటికే కేటాయించిన నీళ్ల కన్నా తెలంగాణ ప్రభుత్వం 4.34 టీఎంసీలను అధికంగా వినియోగించుకుందని.. తమకు కేటాయించిన నీటి లో ఇంకా 14.46 టీఎంసీలను వినియోగించుకోవా ల్సి ఉందని ఏపీ ప్రభుత్వం బోర్డుకు తెలిపింది. ఆ నీటిని విడుదల చేయడంతో పాటు నాగార్జునసాగర్ కుడి కాలువ కింద పంటలను కాపాడుకోవడానికి 12, ఎడమ కాలువ కింద పంటలను కాపాడుకోవ డానికి, తాగు నీటి అవసరాలకు 4 టీఎంసీలు కేటా యించాలని ఈనెల 3న ఏపీ ఈఎన్‌సీ ఎం.వెంకటే శ్వరరావు బోర్డుకు లేఖ రాశారు. కేటాయించిన నీటి కన్నా ఏపీ ప్రభుత్వం 25.341 టీఎంసీలు అధికంగా వినియోగించుకుందని.. తమకు కేటాయించి విని యోగించు కుని నీటిని విడుదల చేయడంతోపాటూ అదనంగా 25 టీఎంసీలు కేటాయించాలని ఈనెల 1న తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కసరత్తు చేసిన బోర్డు.. నీటి కేటాయింపులపై ఏకాభిప్రాయం సాధించడానికి సంప్రదింపులు జరిపింది.
నీటి కేటాయింపులు సవాలే!
Published Wed, Feb 8 2017 3:48 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
Advertisement
Advertisement