Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Bhumana Karunakar Reddy Questioning On Chandrababu Government Over Tirupati stampede1
తిరుమల తొక్కిసలాట ఘటన.. అసలు దోషులెక్కడా చంద్రబాబు

సాక్షి,తిరుపతి: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘‘ శ్రీరంగ పట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాము. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8 న జరిగిన జరిగిన తొక్కిసలాట పై కంటి తుడుపు చర్యలు కు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది.సంఘటన జరిగిన తర్వత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన పై ఈవో ఛైర్మన్ల మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆరోజు గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు.చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తమకు కావాల్సిన వారితో సాక్షులు ఇప్పించారు హరినాథ్ రెడ్డి, రమణ కుమార్‌లను బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. ఆరు మంది చనిపోయి, 50 మందికి పైగా తీవ్ర గాయాలు ఐతే పాక్షికంగా నివేదిక ఇచ్చారుఆ నివేదికను దురుద్దేశ పూర్వకంగా ఇచ్చిన నివేదికగా వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదికలు బట్టి చూస్తే.. చంద్రబాబు నియమించిన ఏ విచారణ అయిన ఒక కేస్ స్టడీగా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే విచారణ కమిషన్ ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ.హరినాధ రెడ్డికు 21.12.24 నా జరిగిన సమావేశంలో సూర్య ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు సమాన బాధ్యత ఇచ్చారులా అండ్ ఆర్డర్, విజిలెన్స్ వాళ్లకు క్యూ లైన్ బాధ్యతలు ఇచ్చారు. అండ్ ఆర్డర్ బాధ్యత ఎస్పీ, సీవీ అండ్‌ ఎస్వో ది కూడా బాధ్యత. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగలేదు.జనవరి 10, 11, 12 తేదీలు మాత్రమే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఇస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు కారణం, దీనికి సమాధానం లేదు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందన ఖాన్ ఒక నివేదిక ఇచ్చారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారు? క్యూ లైన్‌లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు.తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమీషన్ నివేదిక సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. మా పాలనలో వైకుంఠ ఏకాదశికు పదిలక్షలు మందికి దర్శనం చేయించాము. 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం పదిరోజుల దర్శనం జరిగింది.పీఠాధిపతులు ఆలోచనలను పక్కన పడేస్తారా.. కేసులు పెట్టాలనే , జైలుకు తరలించాలని చూస్తున్నారు.నా గొంతు కోస్తే తప్ప నేను పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు.

Operation Sindoor still on shastra shaastra both key CDS Anil Chauhan2
ఆపరేషన్‌ సిందూర్‌ ఆన్‌లోనే ఉంది: సీడీఎస్‌

న్యూఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్‌లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అనేది ఇంకా ఆన్‌లోనే ఉందని సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్‌ సెమినార్‌కు హాజరైన అనిల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ..ఆపరేషన్‌ సిందూర్‌ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్‌లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.మూడు స్థాయిల్లో మాస్టర్‌ కావాలి..యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్‌ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్‌ కట్స్‌ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు. కాగా, ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్‌ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్‌ సిందూర్‌ను భారత్‌ చేపట్టింది.మే 7వ తేదీన భారత్‌ చేపట్టిన ఈఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాక్‌ అతాలకుతలమైంది. భారత్‌ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్‌ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌ కాస్త దారికొచ్చింది.ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్‌ చేసిన దాడులకు పాకిస్తాన్‌ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్‌ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్‌ టార్గెట్‌ చేసి పైచేయి సాధించింది. భారత్‌ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్‌.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్‌ మిలటరీ ఆపరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌.. భారత్‌ ఆర్మీకి ఫోన్‌ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్‌ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్‌ సిందూర్‌ ఆన్‌లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్‌.

ENG VS IND 4th Test Day 3: Joe Root Surpasses Dravid And Kallis In Elite List3
ద్రవిడ్‌, కల్లిస్‌ను దాటేసిన రూట్‌.. మిగిలింది పాంటింగ్‌, సచిన్‌ మాత్రమే..!

ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్‌ జో రూట్‌ టెస్ట్‌ క్రికెట్‌లో మరో ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో రాహుల్‌ ద్రవిడ్‌, జాక్‌ కల్లిస్‌ను అధిగమించాడు. మాంచెస్టర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లోఈ ఫీట్‌ను నమోదు చేశాడు. మ్యాచ్‌ మూడో రోజు తొలి సెషన్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ద్రవిడ్‌ను.. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కల్లిస్‌ను అధిగమించాడు.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రూట్‌ ముందుంది రికీ పాంటింగ్‌, సచిన్‌ టెండూల్కర్‌ మాత్రమే. భారత్‌తో జరుగుతున్న ఇదే సిరీస్‌లో రూట్‌ రికీ పాంటింగ్‌ను కూడా అధిగమించే అవకాశం​ ఉంది. ఈ మ్యాచ్‌తో పాటు ఐదో టెస్ట్‌లో మరో 89 పరుగులు చేస్తే పాంటింగ్‌ను అధిగమిస్తాడు. అప్పుడు రూట్‌ ముందు సచిన్‌ మాత్రమే ఉంటాడు. సచిన్‌ రికార్డు బద్దలు కొట్టడం రూట్‌కు అంత ఈజీ కాదు. రూట్‌ తన కెరీర్‌లో మరో 2500 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ ఫీట్‌ అసాధ్యమైతే కాదు. రూట్‌ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే మరో 25 టెస్ట్‌ల్లో సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలవడం ఖాయం.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్లు..సచిన్‌ టెండూల్కర్‌- 15921రికీ పాంటింగ్‌- 13378జో రూట్‌- 13290*జాక్‌ కల్లిస్‌- 13289రాహుల్‌ ద్రవిడ్‌- 13288మ్యాచ్‌ విషయానికొస్తే.. 225/2 స్కోర్‌ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లో ఆచితూచి ఆడుతుంది. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తుండటంతో ఇంగ్లండ్‌ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నారు. పోప్‌ 32, రూట్‌ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ స్కోర్‌ 261/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంగ్లండ్‌ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు జాక్‌ క్రాలే (84), బెన్‌ డకెట్‌ (94) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడి స్కోర్‌ బోర్డును పరిగెత్తించారు. క్రాలే వికెట్‌ జడేజాకు.. డకెట్‌ వికెట్‌ అన్షుల్‌ కంబోజ్‌కు దక్కింది.అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు.ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్‌ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్‌, డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

Indian Government Bans Ullu ALTT Other Apps For This Reason4
ఉల్లూ, ఏఎల్‌టీటీ సహా 25 యాప్‌లపై బ్యాన్‌

అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేసే క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతర కంటెంట్‌ను ప్రొత్సహిస్తున్న ఉల్లూ, ఏఎల్‌టీటీ సహా 25 వీడియో యాప్‌లు, వెబ్‌సైట్‌ల మీద నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.పోర్నోగ్రఫిక్‌ సహా అభ్యంతకర కంటెంట్‌ను ప్రదర్శిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. ఆయా యాప్‌ల, వెబ్‌సైట్‌ల లింకులను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా బ్యాన్‌ చేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది.భారత్‌లో పోర్న్‌సైట్లపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో కోట్ల మంది ఆ సైట్లను వీక్షిస్తున్నారు. అయితే.. కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని యాప్‌లు అధికారికంగానే పోర్న్‌, సాఫ్ట్‌ పోర్న్‌ను ప్రొత్సహిస్తూ వస్తున్నాయి. ఇందులో ఉల్లూ, ఏల్‌టీటీ(ఏక్తాకపూర్‌కు చెందిన బాలాజీ టెలిఫిలింస్‌కు చెందిన యాప్‌, అశ్లీలంతో పాటు సాదారణ సినిమాలూ అందిస్తోంది) తదితరాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు డబ్బులు తీసుకుని ఇంతకాలం యూజర్లకు అశ్లీల కంటెంట్‌ విచ్చలవిడిగా అందిస్తూ వచ్చాయి.అయితే రాను రాను.. ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఏకంగా పోర్న్‌ కంటెంట్‌ ఇదే తరహా యాప్‌ల ద్వారా ప్రమోట్‌ అయ్యింది. ఇది హద్దులు దాటి ‘ఎక్స్‌’(ట్విటర్‌) లాంటి పాపులర్‌ ఓపెన్‌ మాధ్యమానికి కూడా చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో కేంద్రం నిషేధం విధించడం గమనార్హం. ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.తాజా నిషేధిత జాబితాలో.. ఉల్లూ, ఏఎల్‌టీటీ, బిగ్‌ షాట్స్‌ యాప్‌, దేశీఫ్లెక్స్‌, బూమెక్స్‌, నవరసా లైట్‌, గులాబ్‌ యాప్‌, కంగన్‌ యాప్‌, బుల్‌ యాప్‌, జల్వా యాప్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫెనియో, షో ఎక్స్‌, సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్‌ వీఐపీ, హల్‌చల్‌ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియోన్‌ ఎక్స్‌ వీఐపీ, ఫూగీ, మోజ్‌ఫ్లిక్స్‌, ట్రిఫ్లిక్స్‌ తదితరాలు ఉన్నాయి.ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2000 సెక్షన్‌ 67, 67 ఏ.. లాగే భారత న్యాయ సంహిత సెక్షన్‌ 294, మహిళలను అభ్యంతరకరంగా చూపించడం(The Indecent Representation of Women (Prohibition) Act, 1986 సెక్షన్‌ 4).. ఉల్లంఘనల కింద ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Indian Origin Entrepreneur Who Served Tea To PM Modi Goes Viral5
ఎవ‌రీ లండ‌న్ చాయ్‌వాలా.. ఏంటి ప్ర‌త్యేక‌త‌?

ఇండియ‌న్ కల్చ‌ర్‌లో టీకి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవ‌రు వ‌చ్చినా ముందుగా టీయిచ్చి మాట‌లు క‌లుపుతాం. మిత్రులు, సావాస‌గాళ్ల‌తో చాయ్‌లు తాగుతూ చేసే చ‌ర్చ‌ల‌కు అంతే ఉండ‌దు. న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌ర్వాత చాయ్ పే చ‌ర్చ చాలా ఫేమ‌స్ అయింది. త‌న‌ను తాను చాయ్‌వాలాగా ఆయ‌న ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైర‌ల్ అయ్యాడో యువ చాయ్‌వాలా. అది కుడా లండ‌న్‌లోని బ్రిట‌న్ ప్ర‌ధాని అధికారిక నివాసంలో. ఇద్ద‌రు ప్ర‌ధానుల‌కు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భార‌త్‌, బ్రిట‌న్ దేశాల మ‌ధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ సంద‌ర్భంగా లండ‌న్‌లోని బ్రిట‌న్ ప్ర‌ధాని అధికారిక నివాసం అయిన చెకర్స్‌లో కీల‌క భేటీ జ‌రిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్ర‌ధాని మోదీ కీలకాంశాల‌పై చ‌ర్చ‌లు సాగించారు. ప‌చ్చిక‌లో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్‌లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్‌ను ఇరువురు అగ్ర‌నేత‌లు ఆస్వాదించారు. త‌ర్వాత ఈ ఫొటోల‌ను మోదీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "చెకర్స్‌లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో 'చాయ్ పే చర్చా'... భార‌త్‌-యూకే సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువ‌కుడు.. ఇద్దరు ప్ర‌ధానుల‌కు చాయ్ స‌ర్వ్ చేస్తున‌ట్టు క‌న‌బ‌డింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్‌పై రాసివున్న క్యాప్ష‌న్ అంద‌రినీ ఆక‌ర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్‌లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్ర‌నేత‌ల‌కు చాయ్ అందించిన ఆ యువ‌కుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయ‌న బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్‌వాలాకు మ‌రో చాయ్‌వాలా..భార‌త్‌, బ్రిట‌న్ ప్ర‌ధానుల‌కు చాయ్ అందించి అప‌రూప క్ష‌ణాల‌కు సంబంధించిన వీడియోను అఖిల్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రీల్‌ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్‌తో క‌లిసి మోదీ.. టీస్టాల్ వ‌ద్ద‌కు రావ‌డం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్‌తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్‌వాలాకు మ‌రో చాయ్‌వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అన‌గానే.. మోదీ గ‌ట్టిగా న‌వ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుంద‌ని కితాబిచ్చారు. ఎవ‌రీ అఖిల్ పటేల్?భార‌త మూలాలు క‌లిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్‌ను ప్రారంభించాడు. అత‌డి అమ్మ‌మ్మ 50 ఏళ్ల క్రితం లండ‌న్‌కు వ‌ల‌స‌వచ్చి స్థిర‌ప‌డ్డారు. ప‌టేల్‌ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్‌లోని హాంప్‌స్టెడ్‌లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్‌లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్‌మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశాడు.చ‌ద‌వండి: మీరు ఎలా చనిపోవాల‌నుకుంటున్నారు?చిన్న‌త‌నంలో త‌న అమ్మ‌మ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అయితే బ‌య‌ట తాగే చాయ్‌ల‌లో ఇలాంటి రుచి లేద‌ని గ‌మ‌నించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్‌ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ త‌యారు చేస్తాడు. అందుకే అమ‌ల చాయ్‌కు త‌క్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్ద‌రు ప్ర‌ధాన మంత్రుల‌కు మ‌సాలా చాయ్ అందించి ప్ర‌పంచం దృష్టిలో ప‌డ్డాడు అఖిల్ ప‌టేల్‌.

Mahavatar Narsimha Movie Review In Telugu6
'మహావతార్‌: నరసింహ' మూవీ రివ్యూ

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ కొన్నాళ్ల క్రితం మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్‌ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సినిమా 'మహావతార్‌: నరసింహ' నేడు(జులై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూనిమేటెడ్‌ ఫిల్మ్‌ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'మహావతార్‌: నరసింహ' కథేంటంటే..పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథ గురించి తెలిసిందే. విష్ణువు మూర్తి నరసింహ అవతారం(సగం మనిషి, సగం సింహం) ఎత్తి, భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్‌లో చూస్తే.. అదే మహావతార్‌: నరసింహ సినిమా.విశ్లేషణభక్త ప్రహ్లాద కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి తెలిసింది. ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా'మహావతార్‌: నరసింహ'. కథనం మొత్తం యానిమేషన్‌తో నడుస్తుంది. విజువల్‌ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహా విష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు..తమకున్న శక్తులతో దేవతలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణు మూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తప్పస్సు చేసి బ్రహ్మాదేవుడి నుంచి తనకు భూమి, అకాశం పైన,దేవతలతో గాని, పశువులతోగానీ, పగలు గానీ రాత్రి గానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు.. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పిన విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహా అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఒక కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. దాన్ని దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ చక్కగా వాడుకున్నాడు. భారీ ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీన్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్‌లో నరసింహ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్‌ అదిరిపోతుంది.హిరణ్యకశిపుడితో నరసింహాస్వామి చేసే యాక్షన్‌ తెరపై చూస్తుంటే గూస్‌ బంప్స్‌ వస్తాయి. యానిమేటెడ్‌ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్‌ సీన్లకు థియేటర్స్‌లో విజిల్స్‌ పడతాయి. యానిమేషన్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. తెరపై చూస్తుంటే కమర్షియల్‌ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. తెలుగు డబ్బింగ్‌ చక్కగా కుదిరింది. సామ్‌ సీ.ఎస్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎం అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు.

Thailand Cambodia Row: Advisory to Indians is This Details7
థాయ్‌-కంబోడియా ఘర్షణలు.. భారతీయులకు అడ్వైజరీ

థాయ్‌లాండ్‌, కంబోడియా దేశాలు సరిహద్దు వివాదంతో పరస్పర దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం.. తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం అడ్వైజరీ జారీ అయ్యింది.భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌ల వైపు ప్రయాణం చేయొద్దని శుక్రవారం థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సూచింది. అంతేకాదు మార్గదర్శకాల కోసం థాయ్‌ అధికారుల సహకారం కోరవచ్చని అందులో స్పష్టం చేసింది. ట్రాట్‌, సురిన్‌, సిసాకెట్‌, బురిరామ్‌, సా కవావో, ఛంథాబురి, ఉవోన్‌ రట్చథాని..ప్రావిన్స్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.In view of the situation near Thailand-Cambodia border, all Indian travelers to Thailand are advised to check updates from Thai official sources, including TAT Newsroom.As per Tourism Authority of Thailand places mentioned in the following link are not recommended for… https://t.co/ToeHLSQUYi— India in Thailand (@IndiainThailand) July 25, 2025ఇదిలా ఉంటే.. మరోవైపు థాయ్‌లాండ్‌ తాత్కాలిక ప్రధాని పుమ్తోమ్‌ వెచయాచై కూడా ఆయా ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్ని దశాబ్దాలుగా థాయ్‌లాండ్ – కాంబోడియా మధ్య నడుస్తున్న వివాదం.. తాజాగా తీవ్రరూపం దాల్చింది.Ta Muen, Ta Moan Thom దేవాలయాలు తమవంటే తమవని ఇరు దేశాలు కొన్ని దశాబ్దాలుగా వాదించుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. థాయ్‌లాండ్‌ నుంచి అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. మే నెలలో కంబోడియాకు చెందిన సైనికుడ్ని థాయ్‌ సైన్యం కాల్చి చంపింది. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దులో వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్‌ ప్రధాని షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్‌ సేన్‌తో రాయబారం చేయబోయారు. ఆ సమయంలో ‘అంకుల్‌’ అని సంబోధిస్తూ మాట్లాడిన ఫోన్‌కాల్‌ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్‌ సైన్యం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశంపై అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం విచారణకు ఆదేశించడంతో పాటు ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 3న పుమ్తోమ్‌ వెచయాచై థాయ్‌ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.జూలై 23, 2025న ల్యాండ్‌మైన్ పేలడంతో థాయ్‌లాండ్‌కు చెందిన ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ప్రతిగా.. థాయ్‌లాండ్ F-16 యుద్ధ విమానాలతో కాంబోడియా లక్ష్యాలపై బాంబుల దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరు దేశాల రాయబారులను ఉపసంహరించుకున్నారు.గురువారం నాటి ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన 14 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ సంక్షోభంతో సరిహద్దులో ఉంటున్న వేలమంది తమ తమ దేశాలకు పారిపోయారు. శుక్రవారం సైతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. థాయ్‌లాండ్‌ కంబోడియన్‌ సరిహద్దులో వైమానిక దాడులు చేస్తోంది.

Vigilance Department raided six locations linked to a forest official8
ప్రభుత్వ అధికారుల అక్రమాల పుట్టపగులుతోంది.. తవ్వే కొద్దీ డబ్బే డబ్బు

భువనేశ్వర్‌: అవినీతికి పాల్పడుతున్న అటవీశాఖ అధికారుల్ని విజిలెన్స్‌ అధికారులు ఆట కట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అటవీ శాఖ అధికారుల ఇళ్లలో విజిలెన్స్‌ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ అధికారికి 116 ఫ్లాట్లు గుర్తించగా.. మరో అధికారి ఇంట్లో తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, గోల్డ్‌ కాయిన్లు, ఇతర బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారుల ఇళ్లల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం ఆరో ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అటవీశాఖ డిప్యూటీ రేంజర్‌ రామ చంద్ర నాయక్‌ నివాసంలో ఆదాయానికి మించిన రూ.1.44 కోట్ల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు.తనిఖీల్లో జయపూర్‌లోని ఆయన ఫ్లాట్‌లో రహస్య గదిలో దాచిన రూ. 1.44 కోట్ల నగదు, 4 బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణేలు (ప్రతి నాణెం 10 గ్రాములు),6 ప్రాంతాల్లోని జయపూర్, భువనేశ్వర్‌లోని ఆయన నివాసాలు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, తొమ్మిదిమంది ఏఎస్‌ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు ఉపయోగించి నగదు లెక్కింపు కొనసాగుతోంది.ఈ దాడికి ముందు మరో అటవీ శాఖ అధికారి నివాసాల్లో విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సదరు అధికారికి 119కి పైగా ప్లాట్లు ఉన్నట్లు తేలింది.

How Charlie Escaped from Kannur Jail, 2011 Soumya Case Details9
సౌమ్య కేసు: దుస్తులే తాడుగా.. జైలు గోడ దూకి పరార్‌.. కేరళలో హైఅలర్ట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌమ్య(23) హత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న గోవిందచామీ అలియాస్‌ ఛార్లీ థామస్‌ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీస్‌ శాఖ కేరళవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించి అప్రమత్తమైంది. అయితే గంటల వ్యవధిలో.. ఓ స్థానికుడి సహాయంతో పోలీసులు ఆ మానవ మృగాన్ని పట్టుకోగలిగారు.2011లో సౌమ్య అనే యువతిని రైలు నుంచి బయటకు నెట్టేసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు చార్లీ థామస్‌. ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ నాలుగు రోజులకే కన్నుమూసింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసులో ఘటన జరిగిన మరుసటిరోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే కన్నూరు జైలులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న చార్లీ.. గత అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి పరారయ్యాడు. తాను ఉంటున్న సెల్‌ ఊచలను తొలగించి బయటకు వచ్చిన చార్లీ.. ఆపై తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి కరెంట్‌ ఫెన్సింగ్‌ను దాటేసి మరీ పరారయ్యాడు. గోడ దూకాక.. రోడ్డు మీద తాపీగా నడుచుకుంటున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసు శాఖ స్టేట్‌ వైడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు.. ఇలా అన్నిచోట్ల చార్లీ ఫొటోలతో గాలింపు ముమ్మరం చేసింది. చార్లీని గుర్తిస్తే 9446899506 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరింది.ఈలోపు.. కన్నూరు తలప్పు ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంటి ఆవరణలో చార్లీని చూసినట్లు స్థానికుడు ఒకరు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. అక్కడ బావిలో దాక్కుని కనిపించాడు. దీంతో తాడు సాయంతో అతన్ని బయటకు తీశారు. ఉదయం. 11గం. ప్రాంతంలో చార్లీని పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు తరలించారు. 2011, ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చి నుంచి షోరణూర్‌ వెళ్తున్న రైలులో సౌమ్య(23) ఒంటరిగా ప్రయాణిస్తోంది. అది గమనించిన గోవిందచామీ.. ఆమెను రైలు నుంచి తోసి, ట్రాక్‌ పక్కన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. అటుపై ఆమె ఫోన్‌తో ఉడాయించాడు. ఆ ఫోన్‌ ఆధారంగానే పోలీసులు ఆ మరుసటిరోజే నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ఇటు త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతూ సౌమ్య ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూసింది.ఈ ఘటన కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఏడాది నవంబర్‌​ 11న ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు గోవిందచామీకి మరణశిక్ష విధించింది. కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో చార్లీ నవ్వుతూ కనిపించాడు. పైగా శిక్ష ప్రకటించే సమయంలోనూ అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. అయితే.. 2013లో కేరళ హైకోర్టు ఆ శిక్షను నిలుపుదల చేయగా, 2014లో సుప్రీం కోర్టు సైతం స్టే ఇచ్చింది. 2016లో గోవిందచామీపై మర్డర్‌ అభియోగాన్ని తొలగించి.. కేవలం రేప్‌కేసు కింద జీవిత ఖైదును సుప్రీం కోర్టు విధించింది. అంత కట్టుదిట్టమైన భద్రత నుంచి ఎలా?కన్నూరు సెంట్రల్‌ జైలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుందని, అలాంటి జైలు నుంచి చార్లీ తప్పించుకోవడం ఏంటి? అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఎవరో అతనికి సాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చార్లీ కరడుగట్టిన నేరస్తుడు. అర్ధరాత్రి 1గం. సమయంలో తప్పించుకున్నాడు. అధికారులేమో ఉదయం 5గం. గుర్తించారు. ఏడుగంటలకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిగ్గా అతను తప్పించుకునే టైంలోనే జైల్లో కరెంట్‌ పోయింది. ఇది పక్కా స్కెచ్‌తోనే జరిగి ఉంటుంది’’ అనే అనుమానాలు వ్యక్తం చేశారాయన. అయితే కేరళ పోలీస్‌ శాఖ మాత్రం అతని కోసం వేట కొనసాగుతోందని తెలిపింది. ఈలోపు అతను దొరకడం విశేషం.

Why Donald Trump Doesn't Want US Tech Giants Hiring Indians?10
ఇండియన్స్‌ను వద్దంటే యూఎస్‌కే నష్టం

భారత్ వంటి దేశాలతో సహా విదేశాల్లో నియామకాలను నిలిపివేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలకు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేశం పంపారు. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణాలు లేకపోలేదు. ‘అమెరికా ఫస్ట్‌’ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌ అక్కడి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోపాటు ఇంకా కొన్ని కారణాలున్నాయి. అయితే దీని అమలు చేస్తే యూఎస్‌ సాంకేతిక అభివృద్ధి మందగిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.జాతీయవాదం, అమెరికా ఫస్ట్ ఎజెండా2025 జులై 23-24 తేదీల్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ రాడికల్ గ్లోబలిజం నుంచి టెక్‌ కంపెనీలు బయటకు రావాలని నొక్కి చెప్పారు. టెక్ కంపెనీలు యూఎస్ నుంచి ప్రయోజనం పొందుతున్నాయని చెబుతూ, చైనా, భారత్‌ వంటి దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఎత్తిచూపారు. అమెరికాలో ఉపాధిని పెంచేందుకు స్థానిక టెక్నాలజీ కంపెనీలు ముందుకు రావాలన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీఇదే సదస్సులో కృత్రిమ మేధకు సంబంధించి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో కృత్రిమ మేధ అభివృద్ధిని పెంచడానికి, దేశ పురోగతి అడ్డంకులను తగ్గించడానికి ‘విన్నింగ్ ది రేస్’ పేరుతో జాతీయ వ్యూహాన్ని తెలియజేశారు. ఈ ప్రణాళికలో డేటాసెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం ద్వారా, కృత్రిమ మేధకు అవసరమైన మౌలిక సదుపాయాలను కంపెనీలు సులభంగా నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు. అమెరికాను కృత్రిమ మేధలో అగ్రగామిగా నిలపాలని చెప్పారు. ఏఐని అభివృద్ధి చేయడానికి ఫెడరల్ ఫండింగ్ పొందే కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఉత్తర్వుపై సంతకం చేశారు. అందులో భాగంగా కంపెనీలు రాజకీయంగా తటస్థంగా ఉండే ఏఐ టూల్స్‌ను తయారు చేయాల్సి ఉంటుంది.హెచ్-1బీ వర్క్ వీసాలపై ఆందోళనట్రంప్ గత హయాంలో జారీ చేసిన బై అమెరికన్, హైర్ అమెరికన్ కార్యనిర్వాహక ఉత్తర్వులను పునసమీక్షించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా టెక్ సంస్థల్లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా విధానాలపై ఇది ఒత్తిడి తెస్తుంది. ఈ వీసా అమెరికా కంపెనీలు స్థానిక సిబ్బంది కంటే విదేశీ ప్రతిభావంతులపై ఎక్కువగా ఆధారపడటానికి ప్రోత్సహిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.ఇప్పటికే హెచ్చరికలు..గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో డెవలప్‌మెంట్‌ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. భారత్‌లో నియామకాలు ఆపేయాలనే ట్రంప్ హెచ్చరిక కంపెనీల దీర్ఘకాలిక కార్యకలాపాలకు సవాలుగా మారుతుంది. ఇప్పటికే యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్‌తో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్‌ అన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్ ఉద్యోగులను తిరిగి యూఎస్‌కు రప్పించాలని కూడా ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్‌..నష్టమేంటి..?ట్రంప్ వ్యాఖ్యలపై భారత అధికారులు, ప్రపంచ ఆర్థికవేత్తలు, టెక్ ఇండస్ట్రీ లీడర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రతిభావంతులకు భారతదేశం నెలవుగా కొనసాగుతోంది. చాలా కంపెనీలు ఇక్కడి నైపుణ్యాన్ని తమ అభివృద్ధికి ఉపయోగిస్తున్నాయి. ట్రంప్‌ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలకు సహాయపడటం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ టెక్ ఎకోసిస్టమ్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, క్లౌడ్ ఇన్‌ఫ్రా కోసం భారతీయ ఇంజినీర్లు, డెవలపర్లు, పరిశోధకులు గణనీయంగా దోహదపడుతున్నారు. భారత్ నుంచి నియామకాలను నిలిపివేస్తే అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి మందగించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement