
పరవాడ (పెందుర్తి): అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపంతో మంగళవారం ఉదయం నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తిని బుధవారం పునరుద్ధరించారు. వర్షం కారణంగా మంగళవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింహద్రి ఎన్టీపీసీలో నాలుగు యూనిట్లలో రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే.
నిపుణులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. బుధవారం ఉదయానికల్లా 1, 3, 4 యూనిట్ల నుంచి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా, మధ్యాహ్నం 12 గంటలకు రెండో యూనిట్ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోందని పీఆర్వో టి.మల్లయ్య వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment