పొన్నూరు అంబేడ్కర్ సెంటర్‌లో కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న అంబటి మురళీకృష్ణ, ఇతర నాయకులు
దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన దాడి పక్కా ఎయిర్ గన్ ఉపయోగించి చేసిన హత్యాయత్నమేనని పోలీసు అధికారులు, వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఎయిర్ గన్‌తో కణతకు గురిచూసి షూట్ చేశారని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఎయిర్ గన్ పెల్లెట్ కణతకు తగిలి ఉంటే ప్రాణాలకే ప్రమాదం సంభవించి ఉండేదని చెబుతున్నారు. అది గురితప్పి ఎడమ కంటి పై భాగంలో తగిలిందని విశ్లేíÙస్తున్నారు. సీఎం జగన్‌పై జరిగింది క్యాటర్‌బాల్‌తో దాడి కాదని, ఆయనకు ఎడమ కంటి పై భాగంలో తగిలింది రాయి కాదని కూడా చెబుతున్నారు.
సీఎం జగన్‌పై విజయవాడలో దాడి జరిగిన ప్రదేశం, ఆయనకు అయిన గాయం తీవ్రత, గాయం తీరును పరిశీలించిన పలువురు పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్య నిపుణులు ఈ దాడికి ఎలా పాల్పడి ఉండొచ్చనే అంశంపై విశ్లేషిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. విజయవాడ సింగ్ నగర్‌లోని వివేకానంద స్కూల్ నుంచే దుండగులు సీఎం జగన్‌పై దాడికి పాల్పడ్డారన్నది దాదాపు నిర్ధారణ అయ్యింది. ఆయనపై కచి్చతంగా ఎయిర్ గన్‌తోనే గురి చూసి షూట్ చేశారు. వాహనం నుంచి దాదాపు 20 అడుగుల దూరంలో ఉన్న భవనం నుంచి క్యాటర్ బాల్‌తో దాడి చేసినా అంత వేగంగా వచ్చి తగిలే అవకాశం ఉండదు.
అంత కచి్చతంగా వ్యక్తిని గురి చూసి కొట్టడం కూడా సాధ్యం కాదు. ఎయిర్ గన్‌తో 30 అడుగుల దూరం వరకు లక్ష్యాన్ని గురి చూసి కొట్టొచ్చు. ఎయిర్ గన్‌లో వాడే పెల్లెట్ అత్యంత వేగంగా దూసుకువచ్చి తీవ్రమైన గాయం చేస్తుంది. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగంలో రెండు సెంటిమీటర్ల వెడల్పుతో దాదాపు అర సెంటి మీటరు లోతులో వై ఆకారంలో గాయమైంది. ఆయనకు కుట్లు కూడా వేశారు. అంటే పెల్లెట్ అత్యంత వేగంగా వచ్చి తగిలి రాసుకుని వెళ్లి ఉంటేనే అంతటి తీవ్రమైన గాయమవుతుంది. అత్యంత వేగంగా వచి్చన ‘ఆబ్జెక్ట్’ తగలడంతోనే అంతటి గాయమైందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment