సాక్షి, శ్రీకాకుళం: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి వేసి కిందపడేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 2న డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ఈ ఘటనను ఖండించారు. విగ్రహం ఏర్పాటు విషయంలో గ్రామంలో ఎటువంటి వివాదం లేదని తెలిపారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేయడంపై స్థానికులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
(చదవండి: కర్నూలులో బంగారు నిక్షేపాల వెలికితీత)
దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
Published Wed, Oct 7 2020 10:52 AM | Last Updated on Wed, Oct 7 2020 12:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment