నడిరోడ్డుపై బూటుకాళ్లతో తన్ని తరిమేశారు
జనం చూస్తుండగానే బండబూతులతో దాడి
ఆపై యువకుడిపైనే కేసు నమోదు
అనంతపురం: మఫ్టీలో ఉండి చలానాలు ఎందుకు రాస్తున్నారు.. అని ప్రశ్నించిన ఓ యువకుడిపై అనంతపురం ట్రాఫిక్ పోలీసులు జులుం ప్రదర్శించారు. యువకుడిని తీవ్రంగా కొట్టారు. అనంతపురం నగరం నడిబొడ్డున టవర్‌క్లాక్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తని ఖీలను ముమ్మరం చేశారు. టవర్‌క్లాక్ వద్ద శుక్రవారం రాత్రి త్రిబుల్ రైడింగ్ చేస్తున్న ఓ వాహనాన్ని ఆపారు. ముగ్గురు యువకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు.
త్రిబుల్ రైడింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నట్టు గుర్తించారు. బైక్‌ను తీసుకెళ్లి.. రేపు స్టేషన్‌కు వచ్చి తీసుకోవాలని యువకులతో పోలీసులు చెప్పారు. ఇంతలోనే మఫ్టీలో ఉన్న ఒక పోలీసు వారితో దురుసుగా ప్రవర్తించాడు. మఫ్టీలో ఉంటూ తమపై చలానాలు రాయడమేంటని యువకుడు ప్రశ్నించడంతో.. ఆగ్రహించిన నలుగురు పోలీసులు యువకుడిని బూటు కాళ్లతో తన్నారు. పత్రికల్లో రాయలేని భాషలో తిడుతూ.. తీవ్రంగా కొట్టి ఇంటికి పంపారు. ఇదిలా ఉండగా యువకుడిపై పోలీసులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతు న్నారు. దీంతో ఉలిక్కిపడ్డ ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సురేష్, రమేష్, రాజేష్, సురేంద్రకుమార్బాధిత యువకుడిపైనే కేసు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment