ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చీపురుపల్లి, జి.సిగడాం: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ రైల్వే గేటు సమీపంలో సో మవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీ కొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలవ్వగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు.. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బాతు వ రైల్వే గేటు సమీపానికి వచ్చేసరికి నిలిచిపోయిం ది. దీంతో బోగీల్లో ఉన్న కొందరు ప్రయాణికులు కిందకు దిగి పక్క ట్రాక్‌పైకి వెళ్లారు. అయితే అదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ సూపర్ ఫాస్ట్ రైలు ట్రాక్‌పై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రా ణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడగా.. జీఆర్పీ పోలీసులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిం చారు. మృతుల వద్ద దొరికిన ఆధార్ కార్డుల మేర కు అసోం, ఒడిశాగా గుర్తించినట్లు సమాచారం.
ఎందుకు ఆగిందంటే..?
రైలు బాతువ సమీపంలో ఆగిపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైను లాగడం వల్లే బండి ఆగిందని రైల్వే సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో చైను లాగారని.. బండి నుంచి దిగి పారిపోయే క్రమంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైలు దిగిన వారంతా అసోం, ఒడిశాకు చెందిన వారు కావడం, స్థానికంగా దిగే అవసరం లేకపోవడంతో పొగల భయంతోనే చైను లాగి ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో నా లుగు గుర్తింపు కార్డులు లభించాయి. వీటిలో మూ డు అసోంకు చెందిన వారివి, ఒకటి ఒడిశాకు చెం దిన వ్యక్తిదిగా రైల్వే పోలీసులు గుర్తించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అసోంకు చెందిన జిత్తు అనే వ్యక్తిని ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. ఘటనా స్థలంలో 4 గుర్తింపు కార్డుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మూడు కార్డులు ఉజుల్ బస్‌మంత్రి, బసిసర్ బస్‌మంత్రి, రసీదుల్లా ఇస్లామ్‌లకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. మరొకటి క్షతగాత్రుడు జిత్తూ నాయక్‌కు చెందినదిగా గుర్తించారు. కాగా రైలు ప్రమాదంపై శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎచ్చెర్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తక్షణం స్పందించారు.
సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని ఐదుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి వైద్య సేవలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. గౌహతి వెళ్తున్న రైలు నిలిచిపోవడంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారని చెప్పారు.
అదే సమయంలో మరో రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కిందకు దిగినవారిని ఢీకొట్టడంతో ఐదుగురు ప్రయాణికులు మరణించారని సీఎంకు వివరించారు. దీంతో గాయపడ్డవారికి మంచి వైద్య సేవలు అందించడంతోపాటు మృతుల కుటుంబీకులకు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
చదవండి: అమ్మానాన్న అయ్యేదెప్పుడో!
Comments
Please login to add a commentAdd a comment