సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వే ప్రాజెక్టును ఉత్తరాఖండ్ ప్రభుత్వం మోడల్‌గా తీసుకుంది. ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల ఆధునికీకరణ నేపథ్యంలో ఏపీలో రీ సర్వే జరుగుతున్న తీరును పూర్తిగా అధ్యయనం చేసింది. ఉత్తరాఖండ్ అధికారులకు సైతం ఏపీ అధికారులతో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించింది. ఇందులో భాగంగా శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఏపీ సర్వే అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్‌వీఎస్‌ఎన్ కుమార్ రీ సర్వే ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
ముస్సోరిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోని బీఎన్ యుగంధర్ సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ ఈ వర్క్‌షాప్ నిర్వహించింది. హైబ్రీడ్ టెక్నాలజీ ద్వారా ఆధునిక భూముల సర్వే నిర్వహణలో ఏపీకి అపారమైన అనుభవం ఉన్న దృష్ట్యా తాము నిర్వహించే వర్క్‌షాప్‌లో ఉత్తరాఖండ్ రెవెన్యూ అధికారులకు దీనిపై శిక్షణ ఇవ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
దీంతో సీహెచ్‌వీఎస్‌ఎన్ కుమార్‌ను భూపరిపాలన శాఖ అధికారులు అక్కడికి పంపడంతో ఆయన రీసర్వే ప్రాజెక్టుపై ప్రజెంటేషన్‌తోపాటు వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే నిర్వహిస్తున్న తీరు, గ్రౌండ్ ట్రూతింగ్, వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మొబైల్ మెజిస్ట్రేట్లు, భూ హక్కు పత్రాల పంపిణీ వంటి పలు అంశాల గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment