సాక్షి, అమరావతి : పాఠశాలల హాజరు రికార్డుల్లో విద్యార్థుల కులం, మతం ప్రస్తావించకూడదన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కొనియాడారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘కుల, మత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్ గారి దూరదృష్టికి సలాం....పాఠశాల హాజరు రికార్డుల్లో విద్యార్థులు కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఎందరో మహాత్ములు కలలు కన్న కులమత రహిత సమాజానికి ఇది నాంది’’ అని పేర్కొన్నారు. ( దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం )
అంతకు క్రితం రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరిపై ట్విటర్ వేదికగా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఫలానా పథకం ప్రవేశపెట్టండి, డ్యాములు కట్టండి, రోడ్లు వేయండని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి. చంద్రబాబు మాత్రం ఇంకే సమస్యలు లేనట్టు తన రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం రాజధాని అక్కడే ఉంచాలన్న సింగిల్ ఎజెండాతో తుపాకీ పట్టుకు తిరుగుతున్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment