సాక్షి, తాడేపల్లి: విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష అని.. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిపిస్తుందని.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రేపల్లె నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గంలోని పరిస్థితులపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కష్టాల్లో కొత్తేమీ కాదని, రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదన్నారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
- రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి
- కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు
- చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది, ఇది సృష్టి సహజం
- ఐదేళ్ల పాలనా కాలంలో గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశాం
- నేను వైఎస్సార్ సీపీ కార్యకర్తను అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పుకోగలం
- అన్ని పనులు ప్రజలకు చేశాం
- మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేయదగినది కాదని, అది అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి మన పార్టీ మాత్రమే చెప్పింది
- ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చాం
- బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను రిలీజ్ చేశాం
- ప్రతినెలా క్రమం తప్పకుండా బటన్ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చాం
- ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే ఇలా చేయగలిగింది
- గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు
- మనకు ఓటు వేయకపోయినా మంచి చేశాం
- వివక్ష, పక్షపాతం లేకుండా అందరికీ ఇచ్చాం
- ఎన్నికష్టాలు వచ్చినా సాకులు చెప్పలేదు
- చాలా బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు అప్పుడు దిగిపోయాడు
- దాదాపు రూ.21వేల కోట్లు కరెంటు కంపెనీలకు చెల్లించలేదు
- దీంతోపాటు కోవిడ్ లాంటి అతిపెద్ద సంక్షోభం వచ్చింది
- బయటకు వెళ్లే పరిస్థితులూ లేవు, మన పనుల్ని మనం చేసుకునే పరిస్థితులూ కోవిడ్ వల్ల లేకుండా పోయాయి.. కోవిడ్ వల్ల రాష్ట్రం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి…
- అయినా మనం ఏరోజూ సాకులు చెప్పలేదు
- ఎన్నికష్టాలున్నా మనమే పడి, ప్రజలకిచ్చిన మాటను తప్పకుండా అమలు చేశాం
- నేరుగా ఆయా కుటుంబాల ఖాతాల్లో వేశాం
- డెలివరీ మెకానిజంలో లంచాలకు తావే లేకుండా చేశాం:
- లంచాలు లేకుండా పథకాలు సేవలు అందించిన పరిస్థితి ఒక్క వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే కనిపించింది
- మరోవైపు విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
- కేవలం వేయి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని 3350 ప్రొసీజర్లకు పెంచాం
- రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీని పరిధిని పెంచాం
- ఆరోగ్య ఆసరా కూడా తీసుకు వచ్చాం
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూశాం
- జీఎంపీ ప్రమాణాలున్న మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చాం
- కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కట్టాం
- మన గ్రామంలోనే వైద్యం కోసం వైయస్సార్ విలేజ్ క్లినిక్ తీసుకు వచ్చాం
- ఉచిత పంటల బీమా కేవలం వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే అమలైంది
- రైతులకు పెట్టుబడి భరోసాగా ఇచ్చిన ప్రభుత్వం వైయస్సార్‌సీపీనే
- దళారీ వ్యవస్థ లేకుండా పంటలు కొనుగోలు చేశాం
- మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు
- మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది
- కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరు
- చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయాం:
- చంద్రబాబు అబద్ధాలతో పోటీపడలేకపోయాం
- ఒకవేళ అలాంటి అబద్ధాలు చెప్పినా.. ఇవాళ ప్రజలముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది
- తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లలేని పరిస్థితి
- పిల్లలు రూ.15వేలు గురించి అడుగుతారు
- మహిళలు.. రూ.18వేలు గురించి అడుగుతారు
- పెద్దవాళ్లు రూ.48వేల గురించి అడుగుతారు
- విద్యా, వైద్యరంగాలను ఈ నాలుగు నెలలకాలంలో నాశనం చేశారు
- వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి
- డోర్‌డెలివరీ పద్ధతిని తీసేశారు
- ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్
- రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది.. ప్రజలను భయపెడుతున్నారు
- తప్పుడు కేసులు పెడుతున్నారు
- హద్దుల్లేని అవినీతి జరుగుతోంది
- పేకాట క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలో నడుస్తున్నాయి
- లిక్కర్ సిండికేట్ నడుపుతున్నారు
- విపరీతంగా అమ్మకాలు పెంచడానికి సిద్ధమయ్యారు
- మన హయాంలో ఇసుకమీద ప్రభుత్వానికి డబ్బులు వచ్చేవి
- ఇవాళ ఉచితం లేదుకానీ రెట్టింపుకన్నా, ఎక్కువరేట్లకు అమ్ముతున్నారు
- చంద్రబాబు అబద్ధాలు చెప్పారు
- ప్రజలను అబద్ధాలతో మోసం చేశారు
- ఆ మోసాలకు గురైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
- అన్నీ చేసిన మనకే ఇలా అయితే, ప్రజలను ఇంతలా మోసంచేసిన చంద్రబాబును ప్రజలు ఏంచేస్తారు
- చంద్రబాబుకు సింగిల్ డిజిట్‌కూడా ఇవ్వరు
- పార్టీని వీడి మోపిదేవి వెంకట రమణ వెళ్లిపోవడం బాధాకరం
- మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు
- ఏరోజైనా మోపిదేవి వెంకటరమణకి మంచే చేశాం
- తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చాం
- మండలిని రద్దుచేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవిపోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపాం
- ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత మన పార్టీది
- ఇప్పుడు గణేష్‌కు మీ మద్దతు చాలా అవసరం
- కష్టాలు కొత్తేమీ కాదు
- రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదు
- మా నాన్న ముఖ్యమంత్రి.. అయినా కష్టాలు వచ్చాయి
- పెద్దవాళ్లంతా ఏకమయ్యారు, తప్పుడు కేసులు పెట్టారు
- 16 నెలలు జైల్లో పెట్టారు, వేధించారు
- అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించలేదా?
- మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడు
Comments
Please login to add a commentAdd a comment