
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. లక్షలాది కుటుంబాల్లో వెలుగు నింపిన మహనీయుడు. కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకున్న చిరస్మరణీయుడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసి సంక్షేమ పాలనతో చెరగని ముద్ర వేశారు. జలయజ్ఞం చేపట్టి రైతు బాంధవుడిగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థుల ఆశాదీపంగా, ఆరోగ్య శ్రీ పథకంతో ఎంతో మందికి గుండె చప్పుడుగా మారారు. ఇలాంటి అనేకానేక సంక్షేమ పథకాలు ఎన్నో చేపట్టి.. ప్రజలకు ఆత్మ బంధువు అయ్యారు. ఆయన జయంతి సందర్భంగా... విద్యార్థి దశలో వైఎస్సార్‌కు సంబంధించిన అపురూప చిత్రాలు మీకోసం.
Comments
Please login to add a commentAdd a comment