
తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం, సెప్టెంబర్ 10వ తేదీ) ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం గం.11 కి వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ, వేల కోట్ల రూపాయిల విలువైన భూములను బినామీలకు దోచిపెట్టడం సహా అనే అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.