
మైదుకూరు: టీడీపీ ఆవిర్భావం నుంచి 42 ఏళ్ల పాటు నిజాయితీతో, నిబద్ధతతో పనిచేసిన రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని చంద్రబాబు అవమానించారని, తాము మనస్ఫూర్తిగా.. గౌరవంగా వైఎస్సార్‌సీపీలోకి ఆయనను ఆహ్వానించామని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మైదుకూరులోని డీసీఎల్ ఫంక్షన్ హాల్‌లో వేలాది మంది అనుచరులతో టీడీపీ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన సోదరులు కేసీ కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ రెడ్యం ఆదినారాయణరెడ్డి, దువ్వూరు మండలం గుడిపాడు మాజీ సర్పంచ్ తుమ్మల కొండారెడ్డి తదితరులకు ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో ఆయనకు, అనుచరులకు సముచిత గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment