
నిప్పు రాజుకుని మామిడిచెట్లు దగ్ధం
సుండుపల్లె : మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీ కటారుముడుకు సమీపంలోని అటవీ ప్రాంతం (లైను)లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం నిప్పు పెట్టారు. దీంతో మంటలు వ్యాపించి తలెత్తిన ప్రమాదంలో మిట్టబిడికికి చెందిన మూడే లక్ష్మమ్మ, మరింత మంది మామిడిచెట్లు, కంచె, బోరు పైపులు, స్టార్టర్లు దగ్ధమయ్యాయి. 50కి పైగా మామిడి చెట్లు దహనమైనట్లు బాధితులు తెలిపారు.
మట్టి తరలింపునకు అడ్డుకట్ట
రాజంపేట: మండలంలోని ఎర్రబల్లి కొండ ప్రాంతంలో మట్టి తరలింపునకు గ్రామస్థులు సోమవారం అడ్డుకట్ట వేశారు. రాజంపేట మున్సిపాల్టీ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాల కోసం స్థలం కేటాయించారు. కొందరు జేసీబీలు పెట్టి అక్కడ మట్టి తవ్వుతుండడంతో గ్రామస్తులు తవ్వకాలకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ట్రాకర్లను అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ రూరల్ మండల అధ్యక్షుడు దొడ్డిపల్లి భాస్కర్‌రాజు రాజంపేట మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించారు. అక్రమ తరలింపునకు అనుమతి ఇవ్వవద్దని ఆయన సూచించారు.
రైలు పట్టాలపై మృతదేహం
రాజంపేట : నందలూరు–రేణిగుంట రైలు మార్గంలో హస్తవరం రైల్వే స్టేషన్ వద్ద సోమవారం 25 ఏళ్ల వయస్సు కలిగిన యువకుడి మృతదేహం స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు తెలియాల్సి ఉంది.

నిప్పు రాజుకుని మామిడిచెట్లు దగ్ధం

నిప్పు రాజుకుని మామిడిచెట్లు దగ్ధం