
మనిషికి ఆరోగ్యం గొప్పవరం
రాయచోటి అర్బన్/రాయచోటి టౌన్ : మనిషికి ఆరోగ్యం గొప్ప వరం అని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ శైలజ అన్నారు. ప్రపంచ ఆరోగ్యదినోత్స వం సందర్భంగా సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది పురవీధులలో నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ర్యాలీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నేతాజి సర్కిల్, డైట్‌కళాశాల, వైఎస్ ఆర్ సర్కిల్‌ల మీదుగా తిరిగి ఆసుపత్రి వద్దకు చేరింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికే ఆరోగ్యం విలువ తెలుస్తుందన్నారు. సరైన సమ యంలో వివాహం చేసుకోవడం సంతోషానికి నిలయం అని అన్నారు.ఆసుపత్రి ప్రసవాలు తల్లిబిడ్డలకు ఆనందకరమన్నారు. హైరిస్క్ గర్భిణులు తప్పనిసరిగా ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పెద్దల మాటలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్టు కోటేశ్వరి, డిప్యూటీడెమో దేవశిరోమణి, హెల్త్ ఎడ్యుకేటర్ బలరామరాజు, కమ్యూనిటీ హెల్త్‌ఆఫీసర్ నారాయణ, ఆరోగ్య పర్యవేక్షఖులు సుధాకర్, రవి,నాగమల్లయ్య, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.