కల్యాణ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ | - | Sakshi

కల్యాణ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

Apr 9 2025 12:27 AM | Updated on Apr 9 2025 12:27 AM

కల్యా

కల్యాణ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

ఒంటిమిట్ట: ఏప్రిల్‌ 11న ఒంటిమిట్టలో జరగబోవు సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేయు సందర్భంగా కల్యా ణ వేదిక ఏర్పాట్లను మంగళవారం కడప జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ తో కలిసి కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం వచ్చే మార్గాన్ని, ఆయన ఆశీనులు అయ్యే ప్రదేశాన్ని, వీవీఐపీ గ్యాలరీలను, భక్తులు ప్రవేశించే మార్గాన్ని, ముత్యాల తలంబ్రాల కౌంటర్లను పరిశీలించారు.

పోలీస్‌ గస్తీ పర్యవేక్షణ

రాయచోటి: రాత్రివేళ నిర్వహిస్తున్న పోలీస్‌ గస్తీని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు పర్యవేక్షించారు. మంగళవారం రాత్రి 11 గంటల అనంతరం జిల్లా ఎస్పీ రాయచోటి పట్టణ పరిధిలోని వీధులలో తిరిగారు. అర్బన్‌ సీఐ వివి చలపతితో కలిసి పట్టణంలోని గస్తీని సమీక్షించి పట్టణంలోగల వివిధ ప్రదేశాలను సందర్శించారు. పట్టణంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి, దొంగతనాల నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి సిబ్బందికి సూచనలు చేశారు. ముఖ్యంగా అల్లరి మూకలు, అసాంఘిక కార్యక్రమాలను చేపట్టే వారిపట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని హెచ్చరించారు.

విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

పుల్లంపేట: వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు విధులు సక్రమంగా నిర్వహించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి జయప్రకాష్‌ అన్నారు. మంగళవారం బాలుర సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్లు సెలవుకు సంబంధించి సమాచారం ముందుగా సంబంధిత అధికారులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

పాఠశాల ప్రారంభం రోజునే కిట్లు ఇవ్వాలి

రాయచోటి టౌన్‌: పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు ఇవ్వాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ పెంచలయ్య జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థికి ఈ కిట్లు అందజేయడానికి ఏర్పాట్లు చేయా లని సూచించారు. ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్‌, షూ సాక్స్‌, బెల్టు వంటి 9 రకాల వస్తువులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాల సమన్వయ కర్త ఉలవల వెంకట్రామయ్య, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ నాయక్‌ పాల్గొన్నారు.

వెలిగల్లు నుంచి

రాయచోటికి తాగునీరు

చిన్నమండెం: రూ.450 కోట్లతో వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాయచోటి నియోజకవర్గానికి తాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్నమండెం మండలం గొర్లముదివీడు క్రాస్‌ నుండి తూర్పుపల్లి వరకు కోటి రూపాయలతో నిర్మించిన తారురోడ్డును మంగళవారం మంత్రి ప్రారంభించారు.

మారుమూల గ్రామాలకు బస్సు సర్వీసులు

రాయచోటి అర్బన్‌: రాబోయే నాలుగేళ్లలో మరో 2వేల ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని శివాలయం సెంటర్‌లో ఆయన 12 నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 3 సూపర్‌ లగ్జరీ, 2 అల్ట్రా డీలక్స్‌ , 5 ఎక్స్‌ప్రెస్‌లు, 2 పల్లె వెలుగు సర్వీసులను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్టీసీ డీఎం ధనుంజయ, ఆర్‌ఎం రాము, మదనపల్లె, పీలేరు, రాజంపేట డిపోల మేనేజర్‌లు, ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు.

కల్యాణ వేదిక ఏర్పాట్లను  పరిశీలించిన డీఐజీ   1
1/1

కల్యాణ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement