
నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాం
– ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
రైల్వేకోడూరు అర్బన్ : వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి అండగా ఉంటామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాఘవరాజపురంలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు బత్తిన శశికుమార్‌రెడ్డి (45) రెండురోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొన్న ఎంపీ మృతుడి నివాసానికి వెళ్లి తల్లి సునీతమ్మ, అన్న శ్రీకాంత్‌రెడ్డి, కుమారుడు యశ్వంత్‌రెడ్డిలను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే రంగనాయకులపేట బూత్‌కన్వీనర్ గుత్తిసురేష్ గుండెపోటుతో మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి మృతుడి కుమారుడు పవన్‌కుమార్‌ను పరామర్శించారు.ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు.కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్, మందలనాగేంద్ర, ముద్దా రామసుబ్బారెడ్డి, రత్తయ్య, రమేష్, నాగరాజ, అమర్; మందలశివయ్య, నందాబాల, మహేష్, చైతన్య, పురుషోత్తం, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
నేరాలపై
అప్రమత్తంగా ఉండాలి
ములకలచెరువు : ములకలచెరువు సర్కిల్ కార్యాలయాన్ని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... సర్కిల్ పరిధిలోని మండలాల్లో నేరాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదు దారులతో గౌరవ మర్యాదలతో ప్రవర్తిస్తూ ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. వారంలో ఒక్క రోజూ మహిళా పోలీసులతో కలిసి పాఠశాలల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో మారకద్రవ్యాలు, బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శక్తియాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొనే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులు రాజీ అయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ కొండయ్యనాయుడు, సిబ్బంది ఉన్నారు.

నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాం